పోషణ

సంవత్సరం పొడవునా లభించే పండ్లు - వాటి పోషక విలువలు

మన పరిసరాలలో రకరకాల ఆకారాలలో, పరిమాణాలలో, ఆకర్షణీయమైన రంగులలో, తీపి, పులుపు, వగరు, చేదు రుచులలో పండ్లు లభిస్తాయి. ఇవి మన ఆహారంలో ఒక ముఖ్య భాగం కావాలి. ఎందుకంటే వీటిలో శరీరాన్ని సంరక్షించే ఖనిజ లవణాలు, విటమిన్లు అధికంగా వుంటాయి. చాలా పండ్లలో పిండి పదార్దాలు కూడా అధికమే. కేవలం తగినన్ని పండ్లు, తాజా కూరగాయలు తినకపోవడం వల్లనే ప్రపంచం మొత్తంలో ఏడాదికి 17 లక్షలమంది చనిపోతున్నారు. ఇది నోటి లెక్క కాదు. ప్రపంచ ఆరోగ్య సంస్ధ అంచనా. పండ్లు బాగా తింటే గుండె జబ్బుల ముప్పు తగ్గుతుంది. క్యాన్సర్లు దగ్గరికే రావు. ఈనాటి ప్రపంచాన్ని పీడిస్తున్న అతిపెద్ద సమస్యలకు పండ్లే విరుగుడు.

ఆపిల్: రోజుకు ఒక ఆపిల్ తింటే చాలు మనం డాక్టర్ దగ్గరకు వెళ్లాల్సిన పనేలేదు అన్న నానుడి ఎంతో నిజం. ఆపిల్ లో ఉండే పెక్టిన్ అనే పదార్దం మన శరీరంలో కొవ్వును పెరగకుండా కాపడుతుంది. అంతేకాకుండా విటమిన్లు, ఖనిజలవణాలు మరియు పీచుపదార్దాలను కలిగి ఉంటుంది. యాపిల్స్‌లో ఇనుము, ఆర్శినిక్, పాస్ఫరస్ ఎక్కువగా ఉంటాయి కాబట్టి రక్తహీనతలో బాగా పనిచేస్తుంది. యాపిల్స్‌లో ఇనుము, ఆర్శినిక్, పాస్ఫరస్ ఎక్కువగా ఉంటాయి కాబట్టి రక్తహీనతలో బాగా పనిచేస్తుంది. పిల్లల్లో తరచుగా జిగట విరేచనాలవుతుంటాయి. బాగా పండి, తియ్యని రుచి కలిగిన యాపిల్స్‌ని మెత్తగా చిదిమి వయసునుబట్టి ఒకటినుంచి నాలుగుపెద్ద చెంచాలు తినిపిస్తే జిగట విరేచనాలు తగ్గుతాయి.

అరటి పండు: అరటిపండు మన శరీరంలో కండరాల తయారీలో సహాయపడుతుంది. ఏదైనా ఆహారం తిన్న తరువాత అరటిపండు తింటే ఆ ఆహారం త్వరగా జీర్ణం అవుతుంది. అరటిపండు ఎముకలు బలంగా తయారవటానికి సహాయపడుతుంది. ఎండిన అరటి ముక్కలను దంచి చేసిన పిండి తృణధాన్యాల పిండికన్నా ఎక్కువ పొషకాలను కలిగి ఉంటుంది. దీనిలో అత్యధికంగా ఉండేపొటాషియంబీపీ, అధిక ఒత్తిడిని తగ్గిస్తుంది.శరీరంలోని విషపదార్థాల (టాక్సిన్స్)ను తొలగిస్తుంది.అరటిపండ్లలో ఉండే ట్రిప్టోఫాన్ అనే అమైనో యాసిడ్ శరీరంలో ప్రవేశించగానే సెరటోనిన్‌గా మారి ఒత్తిడిని తగ్గిస్తుంది. అందుకే రాత్రిపూట పాలు, అరటిపండు తీసుకుంటే నిద్ర బాగా పడుతుందని చెబుతారు.అరటిపండులోని పొటాషియం శరీర కండరాల్ని ఆరోగ్యంగా ఉంచుతుంది. డైటింగ్ చేస్తున్నవాళ్లు ఒకపూట భోజనం లేదా టిఫిన్ మానేసి అరటిపండు,వెన్నతీసినపాలు తీసుకుంటే శరీరానికి కావలసిన పోషకాలన్నీ అందుతాయి.

కొబ్బరి: కొబ్బరి లేదా కొబ్బరిపాలు కడుపులో అసిడిటిని తగ్గించటంలో సహాయం చేస్తుంది. ఇందులో విటమిన్-బి ఎక్కువగా ఉంటుంది. కొబ్బరినూనె జుట్టు పెరుగుదలకు సహాయపడుతుంది. బరువు పెరగాలనుకునే వారు కొబ్బరిని రోజూ వాడటం మంచిది. బాగా పండిన కొబ్బరిలో నూనె ఎక్కువగా ఉంటుంది. కాబట్టి ఇది భేదిమందుగా, క్రిమినాశనిగా కూడా వాడబడుతుంది. నూనె కడుపులో ఉన్న యాసిడ్ల విసర్జనను అణిచిపెడుతుంది. కాబట్టి అసిడిటికి ఇది మంచి మందు. పొడిదగ్గు, ఎదనొప్పి నుండి ఇది మనిషికి ఉపశమనాన్ని కలిగిస్తుంది. కొబ్బరిని తురిమి కూరలకూ, చట్నీలకూ, తీపిపదార్ధాల తయారీకీ వాడతారు. బెల్లంతో కలిపి కొబ్బరిని తింటే మోకాళ్ళ నొప్పులు రావు. కొలెస్టెరాల్ ఎక్కువై బాధపడుతున్న వారు కొబ్బరి తినకూడదు. జీర్ణకోశ బాధల తో బాధపడే చిన్నపిల్లలకు కొబ్బరి నీరు మంచి ఆహారము, విరేచనాలు అయినపుడు ఓరల్ రి-హైద్రాషన్ గా ఉపయోగపడుతుంది, పొటాసియం గుండె జబ్బులకు మంచిది, వేసవి కాలములో శరీరాన్ని చల్లబరుస్తుంది, వేసవిలో చెమట కాయలు, వేడి కురుపులు, అమ్మవారు జబ్బు పొక్కులు తగ్గేందుకు కొబ్బరిని వాడాలి . కొన్ని రకల పొట్టపురుగులు కొబ్బరి నీటివల్ల చనిపోతాయి,, ముత్రసంభందమైన జబ్బులలోను, కిడ్నీ రాళ్ళు సమస్యలలో ఇది మంచి మందుగా పనిచేస్తుంది .

నిమ్మ: నిమ్మ ఆకలిని, జీర్ణశక్తిని పెంచుతుంది. మలబద్దకంతో భాదపడేవారు నిమ్మరసానికి 8రెట్లు నీళ్ళు కలిపితాగటం ఉత్తమం. కామెర్లతో బాధపడేవారు నిమ్మరసం, బత్తాయి లేదా కమలాపండ్లను ఎక్కువగా తినటంవల్ల మూత్రంలో వేడి, మంట, పచ్చదనం తగ్గుతాయి. నిమ్మరసం ముఖానికి రాసుకుంటే జిడ్డు తొలగి ముఖం కాంతివంతం అవుతుంది. ఆముదంలో కొద్దిగా నిమ్మరసాన్ని పిండి ఆ మిశ్రమాన్ని తలకి పట్టిస్తే తలలో వేడి తగ్గుతుంది.

 

బొప్పాయి: బొప్పాయిలో ఎ విటమిన్ తో పాటు బి విటమిన్, సి విటమిన్, మాంసకృత్తులు, కాల్షియం, ఐరన్, పాస్పరస్ వంటి పోషకాలున్నాయి. బొప్పాయిలో ఆకలిని పుట్టించే గుణం వుంది. కాలేయం, హృదయం, చిన్న ప్రేగు రోగాలను తగ్గించటానికి బొప్పాయి సహాయపడుతుంది. బొప్పాయిని వేసవిలో ఎక్కువగానూ, వర్షాకాలంలో తక్కువగానూ తినటం మంచిది. తరచూ బొప్పాయిపండును ఆహారంగా తీసుకుంటుంటే శరీరానికి కావలసిన విటమిన్లు పుష్కలంగా లభిస్తాయి. ఇందులో పెప్సిన్ అనే పదార్థం ఉండటం వలన జీర్ణక్రియ సాఫీగా జరుగుతుంది. కెరోటిన్‌, ఎ, బి, సి, ఇ విటమిన్‌లు, ఖనిజాలు, ఫ్లేవొనాయిడ్‌లు, ఫొలేట్‌లు, పాంతోనిక్‌ ఆమ్లాలు, పీచు వంటి పోషకాలుబొప్పాయి పండులో పుష్కలం. మామిడి పండు తర్వాత బొప్పాయిలోనే మనకు అధిక పరిమాణంలోవిటమిన్ ఎలభిస్తుంది. దీనితోపాటు బి1, బి2, బి3, సి-విటమిన్లు, కాల్షియం, ఇనుము, భాస్వరం వంటి ఖనిజ లవణాలు బొప్పాయిలో సమృద్ధిగా లభిస్తాయి. కంటికి సంబంధించిన రోగాలు రాకుండా ఈ పండులోని బిటాకెరోటిన్‌ తోడ్పడుతుంది. బొప్పాయిలో సమృద్ధిగా లభించేవిటమిన్ సిదంతాల, చిగుళ్ళ ఆరోగ్యానికి, రక్తవృద్ధికి, రోగనిరోధక శక్తికి తోడ్పడుతుంది.

జామ: ఆపిల్ పండు లాగానే దీనిలో కూడా పోషక విలువలు ఎక్కువ. ఇ విటమిన్ మరియు పీచు పదార్దం ఎక్కువగా కలిగి ఉంటాయి. బాగా ముదిరిన జామ కాయ తినడం వలన ఎక్కువ పోషకాలు శరీరాన్ని చేరుతాయి. చాక్లేట్ల తయారీలో దీనిని ఎక్కువగా ఉపయోగిస్తారు. చర్మాన్ని ఆరోగ్యం గా ఉంచేందుకు అవసరమయ్యే " కొల్లాజన్ " ఉత్పత్తికి ఇది కీలకము, కొవ్వు మెటబాలిజం ను ప్రభావితం జేసే " పెక్టిన్" జామ లొ లభిస్తుంది . ఇది కొలెస్ట్రాల్ ను తగ్గించి, పేగుల్లో ప్రోటీన్ పరిశుభ్రతను పరిరక్షించడం లో సహకరిస్తుంది . జామ లొ కొవ్వు, క్యాలరీలు తక్కువగా ఉంటాయి కావున బరువు తగ్గాలనుకునే వారికి ఇది మంచి పండు . జామకాయలో పోషకాలు, విటమిన్లు, పీచు పదార్థం వంటి గుణాలు ఎక్కువ.

పోషకవిలువలు 100 గ్రాములకు

పండు

కార్బోహైడ్రేట్లు

కి.కెలోరీలు

ప్రోటీన్లు

గ్రాము

శక్తి

కి.కెలోరీలు

ఎ విటమిన్

యుజి

సి విటమిన్

మిల్లీ గ్రాము

చక్కెరలు

గ్రాము

ఆపిల్

10.5

0.4

49

2

15

11.8

అరటి

26.0

1.2

88

3

10

20.4

నిమ్మ

3.4

0.0

12

0

40

3.0

బొప్పాయి

16.0

0.0

32

40

46

8.0

జామ

4.4

1.0

72

30

218

17.0

 

కుమారి బి. జ్యోతిర్మయి, విద్యార్థి, ఐ.డి.నెం: హెచ్.హెచ్. 2012/028.

Download File

Rating :2.79 1   1   1   1  
మీ సూచనను పోస్ట్ చేయండి

(ఈ పేజీ లో ఉన్న కంటెంట్ పై ఏమైన వ్యాఖ్యలు / సలహాలు ఉంటే, ఇక్కడ పోస్ట్ చేయండి)

Select Rating : 0 1 2 3 4