పోషణ
వానాకాలం లో లభించే పండ్లు - వాటి పోషక విలువలు
మన పరిసరాలలో రకరకాల ఆకారాలలో, పరిమాణాలలో, ఆకర్షణీయమైన రంగులలో, తీపి, పులుపు, వగరు, చేదు రుచులలో పండ్లు లభిస్తాయి. ఇవి మన ఆహారంలో ఒక ముఖ్య భాగం కావాలి. ఎందుకంటే వీటిలో శరీరాన్ని సంరక్షించే ఖనిజ లవణాలు, విటమిన్లు అధికంగా వుంటాయి. చాలా పండ్లలో పిండి పదార్దాలు కూడా అధికమే. కేవలం తగినన్ని పండ్లు, తాజా కూరగాయలు తినకపోవడం వల్లనే ప్రపంచం మొత్తంలో ఏడాదికి 17 లక్షలమంది చనిపోతున్నారు. ఇది నోటి లెక్క కాదు. ప్రపంచ ఆరోగ్య సంస్ధ అంచనా. పండ్లు బాగా తింటే గుండె జబ్బుల ముప్పు తగ్గుతుంది. క్యాన్సర్లు దగ్గరికే రావు. ఈనాటి ప్రపంచాన్ని పీడిస్తున్న అతిపెద్ద సమస్యలకు పండ్లే విరుగుడు.
వానాకాలం లో లభించే పండ్లు (జూలై నుండి అక్టోబర్ వరకు)
దానిమ్మ: దానిమ్మ మన శరీరంలో రక్తం పెరుగుదలకు సహాయపడుతుంది. తియ్యని దానిమ్మ తింటే వాంతులు, గుండెల్లో మంట, అజీర్తి, నీళ్ళవిరేచనాలు వంటివి త్వరగా తగ్గుతాయి. నోరు, గొంతు, కడుపు, గుండెలో వుండే మలినాలను దానిమ్మ శుభ్రపరుస్తుంది. దాహాన్ని తగ్గించి, అలసటను కూడా తగ్గిస్తుంది. దానిమ్మ సహజ యాస్పిరిన్. రక్తసరఫరాను తగినంతగా వేగవంతం చేస్తుంది. పావు కప్పు రసం రోజూ తాగితే మీ గుండె ఎంచక్కా భద్రంగా బీరువాలో ఉన్నట్టే.ఎముకల ఆరోగ్యానికి కూడా దానిమ్మ చాలా మంచిది. ఆస్టియోఆర్థ్రయిటిస్తో బాధపడేవారికి అత్యంత రుచికరమైన మందు దానిమ్మ పండు, రసం.వయసు పెరిగే కొద్దీ ఏర్పడే ముడతలను కూడా నివారిస్తుంది దానిమ్మ రసం. నీళ్లవిరేచనాలతో బాధపడేవారికి మంచి మందు. దానిమ్మ రసాన్ని శరీరం మీద రాయడం వలన అలర్జీలు, కిటకాలు కుట్టడం వలన వచ్చిన పొక్కులు మానిపోతాయి.దానిమ్మ పండు తొక్క గాయాలకు ఔషధం, వాపును అరికడుతుంది.గొంతు రోగాలకు ఔషధం దానిమ్మ. దానిమ్మ పళ్ళు, పువ్వులు, ఆకులు, వేర్లు అన్ని ఔషధ గుణాలు కలిగినవై ఉంటాయి.
బత్తాయి: ఇది నిమ్మ జాతికి చెందిన ఒక పండు. వేసవిలో బత్తాయి రసాన్ని తాగినట్లయితే శరీరానికి చల్లదనాన్నిస్తుంది. దీనిలో ఉండే సి విటమిన్ శరీరంలో వ్యాధినిరోదక శక్తిని పెంచుతుంది. జలుబు, జ్వరం వచ్చినపుడు త్వరగా కోలుకోవడానికి దీన్ని రసాన్ని ఇస్తారు.విటమిన్-సి లోపంతో వచ్చేస్కర్వీవ్యాధిని అరికట్టడంలో ఈ పండు బాగా పనిచేస్తుంది. ఇది మలబద్ధకాన్ని నివారిస్తుంది. ఈ జ్యూస్ వల్ల చిగుళ్ళ నొప్పులు, గొంతు సంబంధ ఇన్ఫెక్షన్లు త్వరగా తగ్గుతాయి. బత్తాయి రసం చర్మానికి కూడా మంచిదే. క్రమం తప్పకుండా తీసుకోవడం వల్ల మచ్చల్ని మాయం చేస్తుంది.
చెర్రీస్: చెర్రీస్ బీటాకెరోటిన్ ని కలిగివుంటాయి. దీనిలో గల యాంటీఆక్సిడెంట్లు కాన్సర్ ని దూరం చేస్తాయి. వీటిని కేకులు,చాక్లేట్ల తయారీలో ఎక్కువగా ఉపయోగిస్తారు.
స్ట్రాబెర్రీ: దీనిలో ఎ విటమిన్ ఎక్కువగా వుంటుంది. దీనిలో పీచుపదార్దం ఎక్కువగా వుండటం వల్ల ఇది రక్త ప్రసరణకు సహాయపడుతుంది. రుచిగల ఐస్క్రీంలలో, మిల్క్ షేక్ లలో, స్మూతీస్ లలో మరియు పెరుగుల తయారీలో స్ట్రాబెర్రీని ఎక్కువగా ఉపయోగిస్తారు.
పోషకవిలువలు 100 గ్రాములకు
పండు |
కార్బోహైడ్రేట్లు కి.కెలోరీలు |
ప్రోటీన్లు గ్రాము |
శక్తి కి.కెలోరీలు |
ఎ విటమిన్ యుజి |
సి విటమిన్ మిల్లీ గ్రాము |
చక్కెరలు గ్రాము |
దానిమ్మ |
8.6 |
1.0 |
81 |
10 |
7 |
17.0 |
చెర్రీస్ |
0.6 |
0.0 |
52 |
0 |
15 |
4.0 |
స్ట్రాబెర్రీ |
0.6 |
0.7 |
23 |
10 |
60 |
5.1 |
బత్తాయి |
8.5 |
1.0 |
37 |
0 |
40 |
7.0 |
కుమారి బి. జ్యోతిర్మయి, విద్యార్థి, ఐ.డి.నెం: హెచ్.హెచ్. 2012/028.