పోషణ

శీతాకాలంలో లభించే పండ్లు - వాటి పోషక విలువలు

మన పరిసరాలలో రకరకాల ఆకారాలలో, పరిమాణాలలో, ఆకర్షణీయమైన రంగులలో, తీపి, పులుపు, వగరు, చేదు రుచులలో పండ్లు లభిస్తాయి. ఇవి మన ఆహారంలో ఒక ముఖ్య భాగం కావాలి. ఎందుకంటే వీటిలో శరీరాన్ని సంరక్షించే ఖనిజ లవణాలు, విటమిన్లు అధికంగా వుంటాయి. చాలా పండ్లలో పిండి పదార్దాలు కూడా అధికమే. కేవలం తగినన్ని పండ్లు, తాజా కూరగాయలు తినకపోవడం వల్లనే ప్రపంచం మొత్తంలో ఏడాదికి 17 లక్షలమంది చనిపోతున్నారు. ఇది నోటి లెక్క కాదు. ప్రపంచ ఆరోగ్య సంస్ధ అంచనా. పండ్లు బాగా తింటే గుండె జబ్బుల ముప్పు తగ్గుతుంది. క్యాన్సర్లు దగ్గరికే రావు. ఈనాటి ప్రపంచాన్ని పీడిస్తున్న అతిపెద్ద సమస్యలకు పండ్లే విరుగుడు.

శీతాకాలంలో లభించే పండ్లు (నవంబర్ నుండి ఫిబ్రవరి వరకు)

ఖర్జూరం: ఖర్జూరం మన శరీరానికి ఎంతో బలాన్నిస్తుంది. ఇది ఎ & బి విటమిన్లను కలిగివుంటుంది. నీరసంతో బాధపడే వారు రోజుకు 15-20 ఖర్జూర పలుకులను నెల రోజులపాటు తింటే ఆ సమస్యను దూరం చేసుకోవచ్చు. ఖర్జూరం తినటం వల్ల మెదడులో నరాలు అభివృద్ది చెందుతాయి. చెట్టువేళ్లను నూరి పెట్టుకుంటే పంటినొప్పీ తగ్గుతుంది.ఖర్జూర తినడము వలన మలబద్ధకం తగ్గుతుంది, ఎముకలు బలంగ తయారవుతాయి మరియు ఉదర క్యాన్సర్ తగ్గుతుంది.ఖర్జూర పండు అధిక ఇనుము కలిగి ఉంటుంది. అందువలన ఇది రక్తహీనత తగ్గించడములో సహాయపడుతుంది.

దబ్బపండు: ఇది నిమ్మ జాతికి చెందిన ఒక పండు. నారింజ పండుకు బదులుగా దీనిని వాడవచ్చు. వేసవిలో దబ్బపండు రసం తేనేతో కలిపి తాగితే అది వంటిలోని వేడిని తగ్గిస్తుంది. విరేచనాలకు దీని రసం త్వరిత ఉపసమనం. ఇందులో విటమిన్‌-ఎ సమృద్ధిగా దొరుకుతుంది. ముఖ్యంగా ఇందులో ఉండే నారింజనిన్‌, నారింజిన్‌ అనే యాంటీ ఆక్సిడెంట్లు ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. ఇవి వూపిరితిత్తుల క్యాన్సర్‌, నోటి క్యాన్సర్లు రాకుండా కాపాడతాయి. వీటితోపాటు, లైకోపిన్‌, బీటా కెరోటిన్‌, క్సాంథిన్‌, ల్యూటిన్‌ వంటి ఫ్లేవొనాయిడ్‌లూ ఎక్కువే. అందుకే దీన్ని క్రమం తప్పకుండా తీసుకోవడం వల్ల కంటిచూపూ మెరుగుపడుతుంది.

 

కివీ: కివీని కంటికి వెలుగు అంటారు. కంటి చూపును కాపాడే లుటియిన్ అనే పదార్దం దీనిలో ఎక్కువగా వుంటుంది. రోజుకు 2-3కివీలు తిన్నవారిలో రక్తం గడ్డకట్టే ప్రమాధం తగ్గినట్లు నార్వే పరిశోదకులు తెలిపారు. కివీ పండు తొక్కలో యంటీ ఆక్సిడెంట్లు మరియు పీచుపదార్దంతో నిండిన గుజ్జు వుంటుంది. శరీరంలో ఏర్పడే నైట్రేట్ ఫ్రీ రాడికల్స్ ప్రభావాన్ని ఇవి తగ్గిస్తాయి. క్యాన్సర్‌కు దారి తీసే జన్యు మార్పులను నిరోధించే పదార్థం కివీలలో ఉంటుంది. చర్మ, కాలేయ, ప్రోస్టేట్ క్యాన్సర్లు రాకుండా అడ్డుకుంటుంది.గుండెకు ప్రయోజనం చేకూరుస్తుంది. రక్తపోటును నియంత్రించేందుకు ఉపకరిస్తుంది. గర్భిణీ స్త్రీలకు కివీ పండ్లను ఇస్తే మంచి పౌష్టికాహారం లభించడమే కాక బిడ్డ ఎదుగుదలకు అది తోడ్పడుతుంది.

నారింజ: దీనిలో విటమిన్-సి అధికం. లోపలి పండులో కన్నా నారింజ తొక్కలో సి విటమిన్ ఎక్కువగా వుంటుంది. అంతేకాకుండా నారింజ పీచుపదార్దం & కాల్షియాన్ని కలిగివుంటుంది. జాము, జెల్లీ మరియు పండ్ల రసాల తయారీలో దీనిని ఎక్కువగా వాడుతారు. పొట్ట, పెద్దప్రేగు, చాతి, చర్మ, ఊపిరితిత్తుల మరియు నోటి క్యాన్సర్ కారకాలతో పోరాడుతుంది. నారింజ పండులో ఉండే ఫ్లావనాయిడ్ లను "హేర్పెరిడిన్" గా పేర్కొంటారు. హేర్పెరిడిన్, శరీరంలో ఉండే కొవ్వు పదార్థాల స్థాయిలను శక్తివంతంగా తగ్గించటం వలన హైపర్ టెన్షన్ ను సాధారణ స్థితిలో నిర్వహిస్తాయి.

రేగి పండు: కొన్నిప్రాంతాలలో దీనిని బదరీపండు అని కూడా అంటారు. దీనిలో ఎ & సి విటమిన్లను,  పొటాషియం అధికం. రేగి రోగనిరోదక శక్తిని పెంచుతుంది, ఒత్తిడిని తగ్గిస్తుంది. వీటిలో ఉండే కాల్షియం, పొటాషియం, పాస్పరస్, మెగ్నీషియం వంటి ఖనిజాలు కండరాలను, దంతాలను, ఎముకల్ని దృడపరుస్తాయి. మరియు రక్తాన్ని శుద్ది చేస్తాయి.

సీతాఫలం: దీనిని శీతాకాలం పండుగా పేర్కొంటారు. దీనితో స్వీట్లు, జెల్లీలు, ఐస్ క్రీంలు, జాములు తయారుచేస్తారు. సీతాఫలం మంచి రుచికరమైన ఆహారం. దీనిలోకాల్షియమ్సమృద్ధిగా ఉంటుంది.దీనిలో విటమిన్ 'సి' సంవృద్దిగా దొరుకుతుంది. ఆహారం తేలిగ్గా జీర్ణమయ్యేటందుకు దీనిలో కల పీచుపధార్ధం తోడ్పడుతుంది. సీతాఫలంలో సి విటమిన్‌, కాల్షియం, ఫాస్పరస్‌, పొటాషియం, మెగ్నీషియం సమృద్ధిగా లభిస్తాయి. నోటిలో జీర్ణరసాలను ఊరేలా చేసే శక్తి అధికం. పండులోని సల్ఫర్‌ చర్మవ్యాధుల్నీ తగ్గిస్తుంది.

ద్రాక్ష: దీనిలో చక్కెర నిల్వలు ఎక్కువగా ఉంటాయి. ద్రాక్ష పండు తొక్కను బాగా నమిలి తినాలి. ద్రాక్ష పానీయాలు, సలాడ్లు, మరియు వైన్ తయారుచేయవచ్చు. వీటిలో ఉండే పోషక పదార్థాల వల్ల ఎన్నో లాభాలు వున్నాయి. రక్తప్రసరణ మెరుగుపడుతుంది. మూత్రపిండాల పనితనం పెరుగుతుంది. కిడ్నీలలో రాళ్లు ఏర్పడవు. అజీర్తి, మల బద్ధకం తగ్గుతుంది. నోరు, గొంతు ఇన్‌ఫెక్షన్లు తగ్గుతాయి. వీటిలోని అనేక విటమిన్లు, ఖనిజాలు మీ ఆరోగ్యానికి పూర్తి రక్షణ కలిగిస్తాయి. ఇవి ఎండిన తర్వాత కిస్మిస్‌గా కూడా పోషక విలువలను కోల్పోవు. కేవలం నీటిని తప్ప. వీటిలోని పాలిఫినాల్‌లు కొలెస్టాల్‌ని అదుపు చేయడంలో, క్యాన్సర్‌ను ఎదుర్కోవడంలో సహకరిస్తాయి. వీటిలోని సోడియం, కొవ్వు పదార్ధాలు చాలా తక్కువ. విటమిన్‌ సి, కే చాలా ఎక్కువ.

పోషక విలువలు 100 గ్రాములకు

పండు

కార్బోహైడ్రేట్లు

కి.కెలోరీలు

ప్రోటీన్లు

గ్రాము

శక్తి

కి.కెలోరీలు

ఎ విటమిన్

యుజి

సి విటమిన్

మిల్లీ గ్రాము

చక్కెరలు

గ్రాము

ఖర్జూరం

3.3

2.0

300

0

0

73

దబ్బపండు

23

0.9

30

0

40

6.6

కివీ

8

1.1

40

5

70

8.8

నారింజ పండు

8.5

1.0

47

2

49

10.6

రేగి పండు

0.65

1.0

40

0

30

9.0

ద్రాక్ష

40

0.6

64

0

3

15.5

 

కుమారి బి. జ్యోతిర్మయి, విద్యార్థి, ఐ.డి.నెం: హెచ్.హెచ్. 2012/028.

Download File

Rating :1.33 1   1   1   1  
మీ సూచనను పోస్ట్ చేయండి

(ఈ పేజీ లో ఉన్న కంటెంట్ పై ఏమైన వ్యాఖ్యలు / సలహాలు ఉంటే, ఇక్కడ పోస్ట్ చేయండి)

Select Rating : 0 1 2 3 4