పోషణ

మిల్లెట్ ప్లస్ రుచులు

              చిరుధాన్యాలు చూడటానికి చిన్నవే అయినా ఆరోగ్యానికి మేలు చేసే ఔషధ గుణాలు చాలా మెండు. చిరుధాన్యాలలో పోషకాలు చాలా ఎక్కువగా ఉంటాయి. ఇవి తినడం వల్ల ఆరోగ్యానికి ఎంతో మేలు జరుగుతుంది. చిరుధాన్యాలు ఔషధ గుణాల ఖజనా కూడా. ఇందులో శరీరానికి మేలు  చేసే గుణాలు  ఉంటాయి. ఈ ఔషద గుణాలు  కలిగి  ఉన్నందున  వీటిని న్యూట్రాస్యూటికల్స్ అని కూడా  అంటారు. న్యూట్రాస్యూటికల్స్  ఎన్నో వ్యాధులను  నివారించడంలో సహయం చేస్తాయి. ప్రస్తుతం  వైద్య రంగంలో అవలంబిస్తున్న  పద్ధతులు చాలా ఖర్చుతో కూడుకున్నవి. అలా కాకుండా చౌకగ లభించే పదార్దాలు ఆరోగ్యానికి సంపూర్ణంగా తోడ్పడుతున్నాయని తెలియడం వల్ల అందరూ ఈ న్యూట్రాస్యూటికల్స్ పైనే దృష్టిపెడుతున్నారు.   న్యూట్రాస్యూటికల్స్ అనేవి ఆహరపదార్ధాలలో నిక్షిప్తమై ఉన్న సహజ సిద్దమైన జీవక్రియాత్మక రసాయన పదార్దాలు. ఏదైన పోషకలోపా న్ని సవరించడానికి గాని మధుమేహం, గుండె సంబంధిత వ్యాధులకు గాని ప్రత్యేకమైన ఆహరంగా ఇస్తారు. వీటిలో ఉండే పోషకాలకు మరియు ఔషధ గుణాలకు మనిషి వ్యాధులకు గురికాకుండా కాపాడే శక్తి ఉంది. అంతేకాకుండా జీవన శైలిలో సంక్రమించే అనేక వ్యాధులను నివారించగల సామర్ధ్యం వీటికి ఉంది.
             ముఖ్యంగా ఊబకాయం, అర్థ్రరైటిస్,మధుమేహం, కొలెస్ట్రాల్ మొదలగు రోగాల నివారాణలో ముఖ్య పాత్ర వీటిదే. ఒక వేళ వ్యాధి సోకినప్పటికి న్యూట్రాస్యూటికల్స్ ఆ వ్యాధి నియంత్రణకు తోడ్పడతాయి. ఇన్ని ఉపయోగాల వల్ల  న్యుట్రాస్యూటికల్స్ వైద్యరంగానికి కొత్త మార్గాన్ని నిర్దేశించాయని తెలుసుకోవచ్చు. చిరుధాన్యాలలో ఒక్కో దానికి ఒక్కొక్క ప్రత్యేకమైన పోషకగుణం ఉంటుంది. అతి తక్కువ ధరకే ఆరోగ్యవంతమైన ఆహారం మనకి చిరుధాన్యాల వల్ల లబిస్తుంది. వరి, గోధుమలతో పోల్చుకుంటే వీటిలో 5 రెట్లు ఖనిజలవణాలు, విటమిన్లు, లాంటి పోషకాలు ఎక్కువగా ఉన్నాయి. వరితో పోల్చి చూస్తే రాగిలో కాల్షియం 30% ఎక్కువ, ఇతర చిరుధాన్యాలలో 2% ఎక్కువ. కొర్రలు మరియు సామలలో ఇనుము చాలా ఎక్కువగ ఉంటుంది. చిరుధాన్యాలు మొత్తంలో సజ్జలలో ఖనిజ లవణాలు అత్యధికంగా ఉంటాయి. ముఖ్యంగా సూక్ష్మఖనిజ లవణాలైన ఇనుము, జింక్, మెగ్నిషియం, ఫాస్పరస్, మరియు ఫోలిక్ యాసిడ్, రైబోఫ్లెవిన్, అను బి విటమిన్లు అధికంగా ఉంటాయి. రాగిలో క్రొవ్వులు తక్కువగా ఉంటాయి, ఉన్న క్రొవ్వులు కూడా అన్ సాచ్యురేటెడ్ క్రొవ్వు ఆమ్లాలే. వీటితో పాటు అవశ్యక అమైనో  ఆమ్లాలు  అయిన లైసిన్, త్రియోనైన్, వాలైన్, మితియోనైన్, ఎక్కువగాఉంటాయి. చిరుధాన్యాలలో గ్లూటిన్ అనే మాంసకృత్తులు ఉండవు. అందువల్ల గ్లూటిన్ అలర్జి కలిగిన వారికి ఇబ్బంది ఉండదు. ఇందులో ఉండే ఫినాలిక్ కౌంపౌడ్లను యాంటి ఆక్సిడెంట్స్ అని అంటాం. చిరుధాన్యాల పొట్టులో ఉన్న ఫినాలిక్, ఫ్లావినాయిడ్స్, టానిస్స్, ఎన్నో రకాలుగా శరీరానికి ఉపయోగపడుతాయి. ఇవి ఫ్రీ రాడికల్స్ ని ,ఖనిజ లవణాలను బంధించి కణాలను కాపాడుతాయి. ఆక్సీకరణ చర్యలను నివారించి, కణాల పొరలలో ఉండే క్రొవ్వులను స్థిరపరచడంవల్ల క్యాన్సర్ మరియు వయసు పైబడిన లక్షణాలను యాంటి ఆక్సిడెంట్లు నివారిస్తాయి . ఈ ఆక్సిడెంట్లు  లాభాలు మనకు లభించాలంటే చిరుధాన్యాలను పొట్టుతో  పాటు తీసుకోవాలి. ఎందుకంటే పొట్టు తీసివేసిన వాటిలో ఫినాలిక్ శాతం తక్కువగా ఉంటుంది. ఉదాహరణకు పొట్టు తీయని సజ్జలలో ఫినాలిక్ శాతం 297 మి. గ్రా/100గ్రా. అయితే పొట్టు తీసిన ప్రాసెసింగ్ చేసిన వాటిలో 257 మి.గ్రా/100గ్రా. పడిపోవడం జరుగుతుంది. 17% డీహల్లింగ్ చేసినప్పుడు 10% పొషకాలు తగ్గుతాయి. చిరుధాన్యాలలో ఉండే పాలికోసినాల్స్ అనే పధార్ధం గుండె జబ్బుల వైద్యంలో వాడే స్టాటిన్ తో సమానమైనవి, కాబట్టి ఇవి గుండెకు మేలు చేస్తాయి.  ఈ కారణంగానే తృణధాన్యాల వాడకం పై అందరు దృష్టిసారిస్తున్నారు. పులియబెట్టడం మొలకెత్తించడం వల్ల ఫినాలిక్ శాతం తగ్గినప్పటికి, ఇతర పొషకాల స్థాయిలు పెరిగి, శరీరం వాటిని అధిక మోతాదులో గ్రహించుకునేలా చేస్తాయి. చిరుధాన్యాలలో పీచు 15గ్రా/100గ్రా ఉంటుంది. పీచు అధికంగా ఉండడం వల్ల రోజుకు 100గ్రా. ల చిరుధాన్యాలు తీసుకుంటే మన శరీరానికి ఆ రోజుకు కావలసిన 1/4 % పీచు లబించినట్టే. పీచు గుండె జబ్బులను , క్యాన్సర్ ఊబకాయ నివారణలో సహాయం చేస్తాయి. చిరుధాన్యాలలో ఉండే పీచు పధార్ధాలు జీర్ణం అవ్వడానికి ఎక్కువ సమయం పడుతుంది. అందువల్ల రక్తంలో గ్లూకోస్ శాతం అదుపులో ఉంటుంది. మదుమేహ వ్యాదిగ్రస్తులకు వీటిని తీసుకొవడం చాలా శ్రేయస్కరం.
              ఇన్ని ఉపయోగాలు ఉండడం వల్ల ప్రొఫెసర్ జయశంకర్ వ్యవసాయ విశ్వవిద్యాలయం వారు  మిల్లెట్ + బ్రాండుతో చిరుధాన్యాల ఉత్పత్తులను తయారుచేయడానికి చిరుధాన్యాల ఉత్పత్తుల ఇంక్యుబేషన్ కేంద్రాన్ని ప్రారంభించారు. ఉత్పత్తులు అందుబాటులో ఉంచి, పోషక భధ్రత సాధించడం ముఖ్య ఉద్దేశ్యం.

మిల్లెట్ + ఉత్పత్తులు       
జొన్న ముతక రవ్వ  

ధర: రూ 37/-(అన్ని పన్నులు కలిపి)

బరువు: 500 గ్రా.

నిలువ కాలం: 3 నెలలు

వంటలు: కిచిడి, ఉప్మా, అన్నం తయారు చేసుకోవచ్చు.     

జొన్న ఫైన్ రవ్వ

ధర: రూ 37/-( అన్ని పన్నులు కలిపి)

బరువు: 500 గ్రా.

నిలువ కాలం: 3 నెలలు

వంటలు: ఉప్మా, పాయసం, కీర్ తయారు చేసుకోవచ్చు.

జొన్న ఇడ్లీ రవ్వ

ధర: రూ 37/-( అన్ని పన్నులు కలిపి)

బరువు: 500 గ్రా.

నిలువ కాలం: 3 నెలలు

వంటలు: ఇడ్లీ, దోశ తయారు చేసుకోవచ్చు.

జొన్న సేమియా

ధర: రూ 37/-( అన్ని పన్నులు కలిపి)

బరువు: 200 గ్రా.

నిలువ కాలం: 3 నెలలు

వంటలు: ఉప్మా, పాయసం, కీర్ తయారు చేసుకోవచ్చు.

జొన్న పాస్త

ధర: రూ 37/-( అన్ని పన్నులు కలిపి

బరువు: 200 గ్రా.

నిలువ కాలం: 3 నెలలు

వంటలు: పాయసం, ఇటాలియన్ పాస్త, ఉప్మా పులావ్, టమాటో/మసాల/వెజ్ బాత్ తయారు చేసుకోవచ్చు.

జొన్న ఉప్పు బిస్కెట్లు (పెద్దవి)

ధర: రూ 160/- (అన్ని పన్నులు కలిపి)

బరువు: 500 గ్రా.

నిలువ కాలము: 3 నెలలు

జొన్న ఉప్పు బిస్కెట్లు (చిన్నవి)
చిన్న ప్యాకేట్

ధర: రూ 30/- (అన్ని పన్నులు కలిపి)

బరువు: 100 గ్రా.

నిలువ కాలము: 3 నెలలు

జొన్న తీపి బిస్కెట్లు (పెద్దవి)

పెద్ద ప్యాకేట్

ధర: రూ 160/- (అన్ని పన్నులు కలిపి)

బరువు: 500 గ్రా.

నిలువ కాలము: 3 నెలలు

జొన్న తీపి బిస్కెట్లు (చిన్నవి)

చిన్న ప్యాకేట్

ధర: రూ 30/- (అన్ని పన్నులు కలిపి)

బరువు: 100 గ్రా.

నిలువ కాలము: 3 నెలలు

జొన్న కొబ్బరి బిస్కెట్లు (పెద్దవి)

పెద్ద ప్యాకేట్

ధర: రూ 160/- (అన్ని పన్నులు కలిపి)

బరువు: 400 గ్రా.

నిలువ కాలము: 3 నెలలు

జొన్న కొబ్బరి బిస్కెట్లు (చిన్నవి)

చిన్న ప్యాకేట్

ధర: రూ 30/- (అన్ని పన్నులు కలిపి)

బరువు: 100 గ్రా.

నిలువ కాలము: 3 నెలలు

జొన్నపల్లి బిస్కెట్లు ( పెద్దవి)

పెద్ద ప్యాకేట్

ధర: రూ 160/- (అన్ని పన్నులు కలిపి)

బరువు: 400 గ్రా.

నిలువ కాలము: 3 నెలలు

జొన్నపల్లి బిస్కెట్లు (చిన్నవి)

చిన్న ప్యాకేట్

ధర: రూ 30/- (అన్ని పన్నులు కలిపి)

బరువు: 100 గ్రా.

నిలువ కాలము: 3 నెలలు

జొన్న ఎక్ష్ట్రుడెడ్ స్నాక్స్

ధర: రూ 12/- (అన్ని పన్నులు కలిపి)

బరువు: 25 గ్రా.

నిలువ కాలము: 3 నెలలు

బహుళ ధాన్యాల పిండి

ధర: రూ 75/- (అన్ని పన్నులు కలిపి)

బరువు : 1 కిలొ.

నిలువ కాలము : 3 నెలలు

జొన్న నూడుల్స్

ధర: రూ 32/- (అన్ని పన్నులు కలిపి)

బరువు : 250 గ్రా.

నిలువ కాలము : 3 నెలలు

రాగి మాల్ట్

ధర: రూ  65.00/- (పెద్ద ప్యాకేట్), 32.00/- (చిన్న ప్యాకేట్)(అన్ని పన్నులు కలిపి)

బరువు: 500 గ్రా. /250 గ్రా.

నిలువ కాలము : 3 నెలలు

జొన్న ఫ్లాక్స్

ధర: రూ 85/- (అన్ని పన్నులు కలిపి)

బరువు: 500 గ్రా.

నిలువ కాలము: 4 నెలలు

కొర్ర బియ్యం

ధర: రూ 40/- (అన్ని పన్నులు కలిపి)

బరువు: 500 గ్రా.

నిలువ కాలము: 3నెలలు

కొర్ర కుక్కీస్

ధర: రూ 23/- (అన్ని పన్నులు కలిపి)

బరువు: 100 గ్రా.

నిలువ కాలము: 2 నెలలు

జొన్న కుక్కీస్

ధర: రూ23/- (అన్ని పన్నులు కలిపి)

బరువు: 100 గ్రా.

నిలువ కాలము: 2 నెలలు

రాగి కుక్కీస్

ధర: రూ 23/- (అన్ని పన్నులు కలిపి)

బరువు: 100 గ్రా.

నిలువ కాలము: 2 నెలలు

కొర్ర వెర్మిసెల్లి

ధర : రూ 37/- (అన్ని పన్నులు కలిపి)

బరువు: 500 గ్రా.

నిలువ కాలము: 3 నెలలు

రాగి వెర్మిసెల్లి

ధర: రూ 37/- (అన్ని పన్నులు కలిపి)

బరువు: 500 గ్రా.

నిలువ కాలము: 3 నెలలు

డీహల్లడ్ జొన్న పిండి

ధర: రూ 32/- (అన్ని పన్నులు కలిపి)

బరువు: 500 గ్రా.

నిలువ కాలము: 3 నెలలు

బహుళ ధాన్య మురుకులు

ధర: రూ 25/- (అన్ని పన్నులు కలిపి)

బరువు: 100 గ్రా.

నిలువ కాలము: 3 నెలలు

 

డాక్టర్ టి. వి. హైమావతి, ప్రొఫెసర్, ఆహారము & పోషణా విభాగము.

Download File

Rating :2.88 1   1   1   1  
Usha Rani    2017-10-20 19:25:17
మీరు అందిస్తున్న సమాచారం చాలా వివరాలు వీలైనంత క్లుప్తంగా అందివ్వడం బాగుంది. అదే కాక, formatting కూడా బాగుంది. నేను చాలానే posts చదివాను. విడివిడిగా వ్యాఖ్యానించకుండా ఇక్కడ అన్నిటికీ కలిపి నా అభిప్రాయం వ్రాస్తున్నాను. ఇటువంటి విలువైన విజ్ఞానం తో పాటుగా ఆచరణలోకి రావడానికి కూడా మీ విద్యార్థులు project లో భాగంగా ప్రయత్నం చేస్తే ఇంకా మేలైన ఫలితాలు రావచ్చు. ఇంకా మంచి విషయాలు ఇక్కడ పొందు పరుస్తారని ఆశిస్తాను.
...............................................
కృష్ణ ప్రసాద్ , తాడేపల్లి గూడేం    2018-01-21 14:51:48
జొన్న,రాగి,కొర్ర మరియు ఇతర చిరు ధాన్యాల ఉత్పత్తులు మాకు ఎక్కడ లభిస్తాయి? వాటిని అమ్మే దుకాణంను మేము ప్రారంభించాలని అనుకుంటున్నాము. మాకు సహకరించండి.నా mail id - krishnaprasady2k@gmail.com& phone no.99510 12414
...............................................
మీ సూచనను పోస్ట్ చేయండి

(ఈ పేజీ లో ఉన్న కంటెంట్ పై ఏమైన వ్యాఖ్యలు / సలహాలు ఉంటే, ఇక్కడ పోస్ట్ చేయండి)

Select Rating : 0 1 2 3 4