పర్యావరణం

పర్యావరణ పారిశుధ్యం

          ఆరోగ్యమే మహాభాగ్యం! అది మనము జీవించే వాతావరణం ఫై ప్రధానంగా ఆధారపడి వుంటుంది . ఆరోగ్యవంతమైన మానవ మనుగడకు పారిశుధ్యం చాలా అవసరం. పరిశుభ్రమైన,సురక్షితమైన నీరు, గాలి, ఇల్లు, ఇంకా వ్యర్ధపదార్ధాల విసర్జనను సక్రమంగా నిర్వహించుకోవడాన్ని పర్యావరణ పారిశుధ్యం అని అంటాము.

        పరిసరాలు పరిశుభ్రంగా వుంటే గాలి, నీరు, ఆహారం కూడా సురక్షితంగా వుంటాయి. మనుషులతో పాటు చెట్టు, చేమలు,జంతువులు ఆరోగ్యంగా వుంటాయి. అపరిశుభ్రమైన పరిసరాలు సూక్ష్మజీవులకు, పురుగులు,పేలు, ఈగలు, దోమలు, బొద్దింకలు వంటి అవాంఛనీయ కీటకాలకు నివాసంగా మారుతాయి. వాటి కారణంగా కలరా, టైఫాయిడ్, విరోచనాలు, కామెర్లు వంటి వ్యాధులు సోకుతాయి ఆ వ్యాధులు ఒక మనిషి నుండి మరొక మనిషికి, ఒక చోట నుండి మరోచోటకి వ్యాపిస్తాయి.

                గ్రామీణ ప్రాంతాలలో అత్యధిక ప్రజలు శారీరక శ్రమ ద్వారానే జీవనోపాధి పొందుతున్నారు. పారిశుధ్య సంబంధమైన వ్యాధుల వలన వారు జబ్బు పడి ఉత్పాదకత , పని గంటలు తగ్గి ఆదాయాన్ని కోల్పోతున్నారు. వ్యాధులను నయం చేయవచ్చు; ఐతే అందుకోసం చేసే చికిత్సకు డబ్బు,  సమయం  ఖర్చవుతాయి. ముఖ్యంగా చిన్న పిల్లలు వ్యాధి వలన కోల్పోయిన శక్తిని తిరిగి పొందడానికి సమయం పడుతుంది . పరిసరాలను శుభ్రంగా ఉంచుకోవడమే దీనికి తగిన తరుణోపాయం. అది అందరి బాధ్యత కూడా.
పరిసరాల పారిశుధ్యానికి పది సూత్రాలు - వీటిని అందరూ అచరించగలరు.

1) మొదటి సూత్రం : బహిరంగ మల విసర్జనను అడ్డుకుందాం.

2) రెండవ సూత్రం: మరుగు దొడ్డిని వినియోగిద్దాం

3) మూడవ సూత్రం : చేతుల పరిశుభ్రతను నినదిద్దాం

4) నాలుగవ సూత్రం : మురుగు నీటి పారుదలను పాటిద్దాం.

5) ఐదవ సూత్రం: నీరు, ఆహరం సురక్షితం చేసుకుందాం .

6) ఆరవ సూత్రం: వ్యర్ధాలను, విసర్జితాలను ఎరువుగా వాడుకుందాం.

7) ఏడవ సూత్రం : భూగర్భజలాన్ని భద్రపరచుకుందాం

8) ఎనిమిదవ సూత్రం : ఆవరణంలో మొక్కలను పెంచుకుందాం.

9) తొమ్మిదవ సూత్రం: వ్యాధికారక కీటకాలను, జంతువులను  నిరోధిద్దాం.

10) పదవ సూత్రం: ప్లాస్టిక్ వినియోగాన్ని నియంత్రిద్దాం.

 

డాక్టర్. జి.మాధురి, అధ్యాపకులు ,AMR-APARD,HYDERABAD
కుమారి. వై.లిల్లి నిర్మలా శాంతి, విద్యార్ది, ఐ.డి.నెం: హెచ్. హెచ్. 2010/047.

Download File

Rating :3.38 1   1   1   1  
మీ సూచనను పోస్ట్ చేయండి

(ఈ పేజీ లో ఉన్న కంటెంట్ పై ఏమైన వ్యాఖ్యలు / సలహాలు ఉంటే, ఇక్కడ పోస్ట్ చేయండి)

Select Rating : 0 1 2 3 4