పర్యావరణం

గణేష్ చతుర్థి - పర్యావరణానికీ పండుగ

దేశవ్యాప్తంగా భాద్రపద శుక్ల చతుర్థి నాడు జరుపుకునే పండుగ  గణేష్ చతుర్థి.   కొన్ని ప్రాంతాలలో వినాయక చవితి అని కూడా అంటారు.  విఘ్నాలనన్నింటిని తొలగించి, ఆశీస్సులు కురిపించాలని ప్రజలు భక్తి శ్రద్దలతో పూజిస్తారు. గణేష్ విగ్రాహాన్ని ప్రతిష్టించి రకరకాల పూలు, ఆకులతో అలంకరించి పదిరోజుల పాటు పూజించి, పదవనాడు నీటిలో నిమజ్జనం చేస్తారు.  ఇది అనాదిగా పాటిస్తున్న ఆచారం. అప్పటి కాలంలో ప్రజలు బావి, చెరువు, కాలువ లేదా సరస్సులో నీళ్ళు తాగేవారు. ఫూజకు ఉపయోగించే ఆకులు, పువ్వులు, కాయలకు ఔషదగుణాలుంటాయి కనుక, ప్రజలందరు వినాయకుణ్ణి వాటితో పాటు నిమజ్జనం చేస్తే నీరు శుద్దిపొందుతాయని సదుద్దేశ్యంతో ఆ ఆచారాన్ని పాటించేవారు. అంతే కాకుండా వర్షాకాలం అప్పటికే మొదలై వాననీరు, ప్రవాహాలద్వారా కొత్త నీరు కూడా చేరి నీరు కొంత అశుభ్రమౌతుంది.  ఔషధగుణాలు కలిగిన వృక్షభాగాలు వేయడం వలన నీరు పరిశుభ్రమౌతుంది. 

గణేష్ చతుర్థి - 21 పత్రాల వివరాలు

1. సంస్కృత  నామం

మాచీ పత్రం

తెలుగు నామం

మాచీ పత్రం (దవనం)

మంత్రం

శుముఖయ  నమ:

శాస్త్రియ  నామం

అర్టేమిసియ వల్గారిస్ / ఇమ్పరేట సిలిండ్రిక

ఔషధ గుణం 

 

చర్మ వ్యాధులకు (లెప్రసీ, బొల్లి), నాడీ వ్యాధుల నయం  చేయడానికి ఉపయోగిస్తారు, మరియు  ఉదర  సంబంధిత  వ్యాధులకు   కూడా  ఉపయోగిస్తారు.

 

 

2. సంస్కృత  నామం

బృహతీ పత్రం

తెలుగు నామం

వాకుడాకు

మంత్రం

గనధిపాయ నమ:

శాస్త్రియ  నామం

సొలానం ఇండికం/కరిస్స్సా కారనడస్స్

ఔషధ గుణం 

 

ఇది ఆస్త్మా, దగ్గు, మలబద్ధకం వంటి వ్యాధుల నివారణకు ఉపయోగిస్తారు మరియు బాలింత సమయంలో కూడా ఉపయోగిస్తారు.

 

3. సంస్కృత  నామం

బిల్వ పత్రం

తెలుగు నామం

మారెడు

మంత్రం

గౌరిపుత్రయా నమ:

శాస్త్రియ  నామం

ఎగ్లె మేర్మియ్లస్

ఔషధ గుణం 

 

రక్త విరొచనాలను నివారించడానికి ఉపయోగిస్తారు. ఇది నీటిని కూడా శుద్ధి చేస్తుంది.

       


 

4. సంస్కృత  నామం

దూర్వా పత్రం

తెలుగు నామం

గరిక

మంత్రం

గజననయా నమ:

శాస్త్రియ  నామం

శ్యనోడాన్ డాక్ఠిలోన్ /   శ్యనోడాన్   డాక్రి

ఔషధ గుణం 

 

చర్మ వ్యాధులు, రక్తస్రావం, రక్తహీనత వంటి వ్యాధుల నివారణకు ఉపయోగిస్తారు.

 

5. సంస్కృత  నామం

దతూర పత్రం

తెలుగు నామం

ఉమ్మెత్త

మంత్రం

హరసున్వె నమ:

శాస్త్రియ  నామం

స్ట్రామొనియం

ఔషధ గుణం 

 

కీళ్ళ నొప్పులు, ఉదర, చర్మ వ్యాధులు, జుట్టు పతనం వంటి వ్యాధులకు ఉపయోగిస్తారు మరియు విష కాటు సమయంలో కూడా ఉపయోగిస్తారు.

 

6. సంస్కృత  నామం

బదరి పత్రం

తెలుగు నామం

రేగు

మంత్రం

లంభోదరాయా నమ:

శాస్త్రియ  నామం

Z.జుజ్బ

ఔషధ గుణం 

 

జీర్ణ రుగ్మతలను, గాయాలను, రక్త మలినాలను తొలగించడానికి ఉపయోగిస్తారు.

 

7. సంస్కృత  నామం

అపమర్గ పత్రం

తెలుగు నామం

ఉత్తరెని

మంత్రం

గుహగ్రజాయా నమ:

శాస్త్రియ  నామం

ఆక్య్రింథస్ అస్పెర

ఔషధ గుణం 

 

జీర్ణ రుగ్మతల నివారణకు ఉపయోగిస్తారు మరియు విష కాటు సమయంలో కూడా ఉపయోగిస్తారు.

 

8. సంస్కృత  నామం

తులసి పత్రం

తెలుగు నామం

తులసి

మంత్రం

గజకర్నాయా నమ:

శాస్త్రియ  నామం

అసిమం సేంక్టం

ఔషధ గుణం 

 

శ్వాసకోశ వ్యాధులు, చర్మ వ్యాధులు,  నివారణ కోసం వాడుతారు గాలి, నీరు మరియు పరిసరాలు శుభ్రపర్చడానికి  ఉపయోగిస్తారు

 

9. సంస్కృత  నామం

ఛూట పత్రం

తెలుగు నామం

మామిడాకు

మంత్రం

ఏకదంతాయా నమ:

శాస్త్రియ  నామం

మ్యాగ్నిఫెరా ఇండికా

ఔషధ గుణం 

 

పగుళ్లకు గొంతు వ్యాధులకు మరియు మధుమేహం వంటి వ్యాధుల నివారణకు ఉపయోగిస్తారు

 

10. సంస్కృత  నామం

కరవీర  పత్రం

తెలుగు నామం

గన్నేరు

మంత్రం

వికటాయా నమ:

శాస్త్రియ  నామం

నెరియం ఇండికం

ఔషధ గుణం 

 

లెప్రసీ, గాయాలు మరియు, జుట్టు పతనం వంటి వ్యాధుల నివారణకు ఉపయోగిస్తారు.

 

11. సంస్కృత  నామం

విష్ను క్రంత  పత్రం

తెలుగు నామం

విష్నుకంత 

మంత్రం

భిన్నదంతాయా  నమ:

శాస్త్రియ  నామం

కొన్వొల్వులస్ ప్లురికౌకిస్

ఔషధ గుణం 

 

నాడీ సంబంధిత వ్యాధులకు మరియు జ్ఞాపకశక్తి పెరుగుదల కోసం ఉపయోగిస్తారు

 

12. సంస్కృత  నామం

దాదిమ్మే పత్రం

తెలుగు నామం

దానిమ్మ

మంత్రం

వతావె నమ:

శాస్త్రియ  నామం

పునిక గ్రాంటం

ఔషధ గుణం 

విరేచనాలు, వాతం, కఫం వంటి దోషాల నివారణకు వాడుతారు

 

13. సంస్కృత  నామం

దెవదారు పత్రం

తెలుగు నామం

దేవదారు

మంత్రం

సర్వెస్వరాయా నమ:

శాస్త్రియ  నామం

సిడ్రస్ డీయొడర్

ఔషధ గుణం

చర్మ వ్యాధులు, గాయాలకు వాడుతారు

 

14. సంస్కృత  నామం

మరువక పత్రం

తెలుగు నామం

మరువం

మంత్రం

సురెస్వరాయా నమ:

శాస్త్రియ  నామం

సిడ్రస్ డీయొడర్

ఔషధ గుణం 

కీళ్ళ నొప్పులు, చర్మ వ్యాధులు, గుండె వ్యాధులకు ఉపయోగిస్తారు

 

15. సంస్కృత  నామం

సింధువర పత్రం

తెలుగు నామం

వవిలి

మంత్రం

హెరంబయా నమ:

శాస్త్రియ  నామం

విట్కెస్స్ నిర్గుండొ

ఔషధ గుణం 

 

వాతం కు సంబంధించిన సమస్యలకు మరియు  విష వ్యతిరేక మందులకు ఉపయోగిస్తారు

 

16. సంస్కృత  నామం

జాజి పత్రం

తెలుగు నామం

జాజి

మంత్రం

సుర్పకర్నాయా నమ:

శాస్త్రియ  నామం

జస్మినం గ్రాండిఫ్లొరం

ఔషధ గుణం 

 

చర్మ వ్యాధులకు, నోటికి సంబంధించిన సమస్యలకు మరియు అజీర్థికి  ఉపయోగిస్తారు.

 

17. సంస్కృత  నామం

గందకి పత్రం

తెలుగు నామం

దెవకంచనం

మంత్రం

 

శాస్త్రియ  నామం

లత దుర్వ

ఔషధ గుణం 

 

 

గుండె సంబంధిత, మూలశంక, చర్మ వ్యాధుల నివారణ కోసం ఉపయోగిస్తారు

 

18. సంస్కృత  నామం

షమి పత్రం

తెలుగు నామం

జమ్మి ఆకు

మంత్రం

ఇభవక్త్రయా నమ:

శాస్త్రియ  నామం

ఫ్రొసొపిస్ స్పెచిగెర

ఔషధ గుణం 

శ్వాసకోశ సమస్యల నివారణ కోసం ఉపయోగిస్తారు.

 

19. సంస్కృత  నామం

అస్వత పత్రం

తెలుగు నామం

రావి ఆకు

మంత్రం

వినాయకాయా నమ:

శాస్త్రియ  నామం

ఫైకస్ రెలిగియోసా

ఔషధ గుణం 

 

దీని బెరడు అనేక మందులు తయారీలో ఉపయోగిస్తారు. ఇది రక్తస్రావాన్ని కూడా అరికడుతుంది.

 

20. సంస్కృత  నామం

అర్జున పత్రం

తెలుగు నామం

తెల్ల మద్ది

మంత్రం

సురసెవితయా నమ:

శాస్త్రియ  నామం

మొరిండ టింక్టొరియా

ఔషధ గుణం 

 

జాయింట్ సంబంధించిన నొప్పులు, వాత / పిట్టా / కఫా, గుండె వ్యాధులు, గాయాలు మరియు సెప్టిక్ అయిన పరిస్థితులలో ఉపయోగిస్తారు.

 

21. సంస్కృత  నామం

అర్క పత్రం

తెలుగు నామం

జిల్లెడు

మంత్రం

కపిలాయా నమ:

శాస్త్రియ  నామం

కేలొట్రొపిస్ ప్రొకెర

ఔషధ గుణం 

 

చర్మ వ్యాధులు, కుష్టు, కణితులు, కీళ్ళ నొప్పులు, క్యూరింగ్, విష కాటు, గాయాలకు ఉపయోగిస్తారు. ఇది ఔషధ వాడుక యొక్క 64 రకాలను కలిగి ఉంది అని చెబుతారు. దీనిని ఒక వైద్య మూలిక అంటారు.

 

ఒకప్పుడు ఈ పండుగ కుటుంబం వరకే పరిమితం అయి ఉండేది. శివాజి కాలం నుండి ఇది సమాజ పండుగగా మారింది.  దాంతో ఇంటితోపాటు వీధుల్లో, వాడల్లో పెద్ద పెద్ద పందిళ్ళువేసి , పెద్దపెద్ద విగ్రహాలు ప్రతిష్టించి సామూహికంగా సంబరంగా జరుపుకోవడం  ఆరంభమైంది.  ఇంట్లో అయితే బావుల్లో నిమజ్జనం చేసేవారు, వీధుల్లో విగ్రహాలను ఊరేగింపుగా తీసికువెళ్ళి చెరువులు, సరస్సులు, నదులు వంటి త్రాగునీటివనరుల్లో నిమజ్జనం చేసేవారు. కేవలం మట్టితోనే విగ్రహాన్ని చేయాలనే ఆచారాన్ని కూడా పాటించేవారు. మట్టి సహజవనరు. భూమినుండి లభ్యమౌతుంది. మట్టితో చేసిన విగ్రహం  మట్టిలో చాలా సులువుగా కలిసిపోతుంది, మట్టిగా మారిపోతుంది. పైగా పూజలందుకున్నది కాబట్టి, మట్టిలో కలసినపుడు సాత్వికతను వెలువరిస్తుందని ఒక నమ్మకం. కాలక్రమంలో, జనాభ పెరుగుదల, నివాస స్థలాల విస్తరణ, వలసలు మొదలైన ఎన్నో విషయాల కారణంగా మట్టి విగ్రహాలు కనుమరుగై ప్లాస్టర్ ఆఫ్ పారిస్ విగ్రహాలు వెలుగులోకి వచ్చాయి. ప్లాస్టర్ ఆఫ్ పారిస్ ఎన్నో రసాయానాల కలయిక. దీనితో చేసిన విగ్రహం నీటిలో వేసినపుడు కరగడానికి ఎన్నో రోజులు పట్టడంతో పాటు, దానిలోని రసాయానాలు కూడ నీటిలో కలిసిపోయి నీటిని కలుషితం చేస్తాయి. క్రమేణా భుగర్భజల వనరు కూడా కలుషితమౌతుంది. ప్లాస్టర్ ఆఫ్ పారిస్ ను జిప్సం, సల్ఫర్, ఫాస్ఫరస్, మెగ్నీషియంలతో చేస్తారు. ఆకర్షణీయంగా ఉండడానికి రసాయానాల రంగులనే వాడతారు. ఇలాంటి విగ్రహాన్ని నీటిలో నిమజ్జనం చేసినపుడు నీరు ఎంతో కలుషితమౌతుంది. ఎన్నో రాష్ట్ర ప్రభుత్వ కాలుష్య నియంత్రణ మండళ్ళ అధికారులు గణేష్ నిమజ్జనం తర్వాత, నీటిని సేకరించి పరిశోధనలు జరిపారు. వాటికి సంబధించిన కొన్ని ఫలితాలు ఇక్కడ పొందుపరచబడ్డాయి.

నీటిలో ఆమ్లాల శాతం పెరగడం

 • నీటిలో కరుగవలసిన ఘనపదార్థాలు నూరు శాతానికి పెరగడం. మట్టి కరిగినంత త్వరగా ప్లాస్టర్ ఆఫ్ పారిస్ కరగదు కొన్ని నెలలు లేదా సంవత్సరాలు కూడా పట్టవచ్చు. దీనితో పాటు ఇతర ఖనిజాలు ఒక పొరలాగా నీటి అడుగు భాగానా  చేరి, నీటిలో ఉండే జీవరాశులకు హాని కలిగిస్తాయి.    

 • నిమజ్జనం జరుగుతున్నపుడు నీటి కదలిక అధికంగా ఉండడం వలన నీటిలోకరిగే ఆక్సిజన్ పగటి పూట పెరగడం, ఆర్గానిక్ వాయువులు వెలువరింత  పెరిగే కొద్ది రాత్రి పూట తగ్గడం.

 • ఇనుము, జింకు, సీసం, క్రోమియం, పాదరసం వంటి ఖనిజాల శాతం పెరగడం. వీటి అవశేషాలు 200 నుండి 300% వరకు పెరుగుతున్నాయని అంచనా. 

 • పూల దండలు, ప్లాస్టిక్ వస్తువులు, బొంగు కర్రలు వంటివి నీటిపై తేలుతూ కాలుష్యం కలిగించడం.

 • ఆహార పదార్థాలు కూడా విసిరివేయడం వలన, విగ్రహం పై వేసిన రసాయన రంగుల వలన నీటిపై నూనె, కందెన పదార్థం తెట్టెలా తేలుతూ ఉండి కాలుష్యాన్ని కలిగించడం.

నీరు ప్రాణాధారం. అటువంటి నీరు కలుషితమౌతుండడం వలన ఎన్నో వ్యాధులు ప్రబలి పోతున్నాయి. అప్రమత్తమైన ప్రభుత్వం, సామాజిక  స్పృహకలిగిన స్వచ్చంద సేవా సంస్థలు కొన్ని ప్రతిపాదనలను చేశారు.   

       1. ప్లాస్టర్ ఆఫ్ పారిస్ కు బదులుగా మట్టి విగ్రహాలనే వాడడం.  

 2. ఫ్లాస్టిక్, ధర్మోకోల్ వంటి భూమిలో కరగని (non-degradable) పదార్థాలను నీటిలో పారవేయకుండా వేరుగా  సేకరించడం 

3. భూమిలో కరిగిపోయే పూలు, ఆకులు, పండ్లు మొదలైనవాటిని  ఎరువుగా మార్చడం, రీసైక్లింగ్ ద్వారా పేపరు తయారు చేయడం.

ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణా రాష్ట్ర వ్యవసాయ విశ్వవిద్యాలయం వినూత్న ప్రతిపాదనను పరిశోధన ద్వారా వెల్లడించింది. మొక్కలనుండి రంగులను తయారు చేసి, ఆ సహజ రంగులనే విగ్రహాలకు వేయడం ద్వారా కాలుష్యాన్ని అరికట్టవచ్చని పలు ప్రయోగాల ద్వారా నిరూపించింది.

సహజ రంగుల వాడకం ప్రాచీనకాలం నుండి ఉంది.  ప్రాచీన దేవాలయాలలో గోడలకు, విగ్రహాలకు ఈరంగులే వాడారు. ఇప్పటికి కూడా చెక్కుచెదరకుండా, వన్నె, వర్ణం తగ్గకుండా నూతనంగానే అనిపిస్తాయి. కాకపోతే వాటిని తయారు చేయడంలో ఉన్న అధిక శ్రమ, సమయం దృష్ట్యా, ఆధునిక పోకడ, నానాటికి పెరిగిపోతున్న జనాభా అవసరాలను తీర్చడం కోసం ఇవి కనుమరుగై పోయాయి.
యాంత్రీకరణ దృష్టితోకూడా పరిశోధనలు చేయడం వలన  శ్రమ, సమయం ఆదా అయ్యే మార్గాలు కూడా సూచించబడ్డాయి. ప్రామాణిక పద్దతులలో రంగులను పొడి, ద్రవం, ముద్ద రూపంలో తయారుచేసుకొని నిల్వ చేసే విధానాలు శాస్త్రీయంగా రూపొందిచబడ్డాయి.

    సహజరంగులంటే …

మొక్కలనుండి, అకశేరుకాలనుండి, ఖనిజాలనుండి, శిలీంద్రాలనుండి తయారుచేసే రంగులనే సహజరంగులంటాం.  సహజరంగులు ఎక్కువగా మొక్కల నుండి చేసినవే- మొక్కల వేర్లు, బెరడు, ఆకులు, పూలు గింజలు, పండ్ల తొక్కలు మొదలైన వివిధ భాగాలనుండి ఒక పద్దతి ప్రకారం రంగును తీస్తారు. వీటిలో ఎలాంటి రసాయనాలుండవు. నీటిలో వేయగానే త్వరగా కరిగి పోతాయి. సహజమైనవే కావడం వలన నీటికికాని, నీటి వనరుకుగాని ఎలాంటి నష్టం వాటిల్లదు.   

    ఏ మొక్క ఏభాగాన్నుండి ఏరంగు వస్తుంది, ఆ వివరాలు ఇవ్వబడ్దాయి.

పువ్వులు- రంగులు

సాధారణంగా పువ్వులలో ఎరుపు, ఆరెంజ్, పసుపు వర్ణాలనిచ్చే వర్ణద్రవ్యం ఉంటుంది. కనుక ఆయారంగులు, వాటి మేలవింపుతో వివిధ ఛాయలు తయారు చేసుకోవచ్చు.

వ. సం.

ఆంగ్ల నామం

శాస్త్రియ నామం

తెలుగు నామం

1

Flame of forest

Butea monosperma

మోదుగ పువ్వు

2

Red silk cotton

Bombax malabaricum

కొండబూరుగ

3

Marigold

Tagetus erecta

బంతిపువ్వు

4

Cosmos

Cosmos sp.

కాస్మోస్ పుష్పం

5

Acacia

Acacia Arabica

అనచండ్ర

6

Singhapushpi

Pholgacanthus

శంఖు పువ్వు

7

Safflower

Carthamus tinctorius

కుసుంభ పువ్వు

8

Ixora

Ixora sp

నూరు వరహాలు

9

Gulmohar

Delonix regia

పెద్దతురాయి

10

Dhalia

Dahlia

దాలియా పువ్వు

11

Golden rod

Solidago species

బంగారు పువ్వు

12

Balsam

Impatient balsamina

చిలుక ముక్కు పువ్వు

 

బెరళ్ళు – రంగులు

బెరళ్ళనుండి ఎరుపు, పసుపు కలకలిపిన బ్రౌన్ రంగు తయారవుతుంది.

వ. సం.

ఆంగ్ల నామం

శాస్త్రియ నామం

తెలుగు నామం

1

Barberry

Berberis aristrata

కస్తూరి పసుపు

2

3.Arjun

Terminalia arjun

తెల్ల మద్ది

3

Black kikar

Acacia nilotica

నల్ల తుమ్మ

4

Peepal

Ficus religoiosa

రావి చెట్టు

5

Monkey jack

Atrocarpus lakoocha

పనస

6

Cochin goroka

Garcinia ranthechymus

ఇవరుమామిడి

7

Mango

Mangifera indica

మామిడి

8

Eucalyptus

Eucalyptus globules

యూకలిప్టస్

9

Walnut

Juglan regia

ఆక్రోటు చెట్టు

10

English Oak

Guercus Robur

సింధూర వృక్షం

11

Cashew tree bark

Anacardium occidentale

జీడి మామిడి

12

Beef bark

Casuarina equisetifolia

సరుగుడు చెట్టు

13

Neem

Azardirachta indica

వేప

14

Indian laburnum

Cassia fistula

రేల బెరడు

15

Copper pod tree

Peltophorum pterocarpum

పచ్చ సుంకేశుల

16

Red sanduers

Pterocarpum marsupium

ఎర్ర చందనం

 

ఆకులు - రంగు
ఆకుల ద్వారా ఆకుపచ్చ, పసుపు, బ్రౌన్ రంగులు చేసుకోవచ్చు.

వ.సం

ఆంగ్ల నామం

శాస్త్రియ నామం

తెలుగు నామం

1

Neem

Azardirachta indica

వేప ఆకు

2

Eupatorium

Eupatoriumadoratum

క్రోటన్ చెట్లు

3

Lantana

Lantana camera

పులికంప

4

Teak

Tectona grandis

టేకు ఆకులు

5

Trailing eclipta

Eclipta prostrata

గలగర ఆకు

6

Indigo

Indigofera Tinctoria

నీలి మందు ఆకులు

7

Black berry

Rubus Fructicosus

నల్ల నేరేడు ఆకులు

8

Lilly

Convallaria Majalis

లిల్లీ ఆకులు

9

Henna

Lawsonia inerma

గోరింటాకు ఆకులు

10

Acalypha

Acalypha wilkaseanas

క్రోటన్ చెట్లు

11

Colocasia

Colocassia esculenta

చేమగడ్డ ఆకులు

 

మరికొన్ని రంగులు

 • దానిమ్మ తొక్కనుండి పసుపు రంగు వస్తుంది

 • నీలి మొక్క ప్రతి భాగం నీలి రంగునిస్తుంది

 • అనాట గింజల నుండి ఆరెంజ్ రంగు తీయవచ్చు.

 • బీట్ రూట్ నుండి ముదురు గులాబి రంగు వస్తుంది 

సహజ రంగులను తయారు చేసుకోవడం

 • రంగులనిచ్చే మొక్క భాగాలను సేకరించాలి

 • తేమ పోయేంతవరకు నీడలో ఆరబెట్టుకోవాలి

 • చిన్న ముక్కలుగా/తుంపులుగా/ పొడిగా/ముద్దలుగా చేసుకొని  పొడి ప్రదేశంలొ నిల్వచేసుకోవాలి.

 • రంగు ముద్దలు తయారు చేసుకోవాలనుకున్నప్పుడు దీనిని వేడినీటిలో చిక్కగా, ముద్దగా అయ్యేంతవరకు మరిగించాలి. ఆ తర్వాత పూర్తిగా ఆరాక సీసాలలో నిల్వ చేసుకోవాలి.

 • అవసరమైనపుడు నీటితో కలుపుకొని వాడుకోవాలి.

వన్నె, వన్నెల సహజ వర్ణాలతో ముస్తాబైన వినాయక విగ్రహాలు 

సహజ రంగులద్దిన విగ్రహాలు అందంగా ఎంతో ఆకర్షణీయంగా ఉంటాయి.

ప్రకృతిలో లభించే మట్టితో, మొక్కలనుండి గ్రహించిన రంగులతో దేవుని విగ్రహం  చేయడం భక్తి, పర్యావరణ కాలుష్యానికి విముక్తి.                 

సహజ రంగులవలన లాభాలు 

 • అటు పర్యావరణానికి కాని, మానవ ఆరోగ్యానికి  ఎలాంటి హాని చేయవు.

 • విగ్రహానికి రంగువేసేపుడు కూడా శ్వాసకు ఎలాంటి ఇబ్బంది ఉండదు. 

 • కేవలం తాజ పువ్వులను, ఆకులను వాడాలి అనేమి లేదు. వాడి, వడలిపోయినవి కూడా రంగునిస్తాయి. మూలవనరు ఖర్చు తక్కువే. ఆసక్తి కలవారు ఇంట్లోనే చేసుకొని, మట్టీ విగ్రహానికి స్వయంగా రంగు వేసుకోవచ్చు.

 • నీటిలో త్వరగా కరిగి పోతాయి కనుక, భూగర్భజల వనరుపై తెట్టెలాగా పేరుకోదు

 • రంగులను తయారు చేసేపుడుకూడా ఎలాంటి ఆరోగ్యసమస్యలు తలెత్తవు

 • అవశేషాలను ఎరువుగా కూడా వినియోగించవచ్చు.

డా. ఎ. శారదాదేవి, సహజరంగుల పరిశోధకురాలు & విశ్రాంత  డీన్, గృహవిజ్ఞాన కళాశాల, ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణా రాష్ట్ర వ్యవసాయ విశ్వవిద్యాలయం.

డా. పి. అమల కుమారి, ప్రొఫెసర్, విస్తరణ & ప్రసార నిర్వహణ విభాగం,  ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణా రాష్ట్ర వ్యవసాయ విశ్వవిద్యాలయం.

Download File

Rating :3.07 1   1   1   1  
M.yellanna Teacher    2017-07-26 04:50:27
మేడమ్ వీటిపై అవగాహన కల్గించాము
...............................................
మీ సూచనను పోస్ట్ చేయండి

(ఈ పేజీ లో ఉన్న కంటెంట్ పై ఏమైన వ్యాఖ్యలు / సలహాలు ఉంటే, ఇక్కడ పోస్ట్ చేయండి)

Select Rating : 0 1 2 3 4