పర్యావరణం

మరుగు దొడ్డి వినియోగం

మానవ విసర్జితాలను క్రమబద్దీకరించటం ముఖ్యమైన గ్రామీణ ప్రజారొగ్యాంశం. అనారోగ్యవంతుడైన ఒక వ్యక్తి మలం ద్వారా వ్యాప్తి చెందే సూక్ష్మ క్రిములు ఆ ప్రాంతాన్నంతా కలుషితం చేసి, ముఖ్యంగా 5 సంవత్సరాల లోపు బిడ్డలకు అనారోగ్యం కలిగిస్తుంది.

మరుగుదొడ్డి వాడటమే మంచి పరిష్కారం. అంతే కాక మరుగుదొడ్డి మహిళలకు సంబందించిన ఆత్మ గౌరవాంశం కూడా. ఎందుకంటే స్త్రీలను, ఆడపిల్లలను హింసకు గురిచేసే కారణాల అన్వేషణలొ మరుగుదొడ్డి లేకపొవటం ఒకటిగా UN నివేదిక పేర్కొంటున్నది.

ప్రపంచ ఆరోగ్య సంస్థ నిర్వచిoచిన మానవ అభివృద్ధి సూచికలో మరుగుదొడ్డి వినియోగం ఒక ముఖ్యమైన అంశం. ఏ దేశంలో అయితే మరుగుదొడ్డిని వినియోగిస్తున్నారో ఆ దేశం అభివృద్ధి పధంలో నడుస్తుందనేది వారి భావన, కాని ప్రపంచ వ్యాప్తంగా '2' బిలియన్ల ప్రజలకు మరుగుదొడ్డి సదుపాయం లేదు. మన గ్రామాల్లో సగటున ప్రతిరోజు ప్రతి గ్రామంలో 3 క్వింటాళ్ళ మలం వెలువడుతుంది. ఇది కాలి వేళ్ళు, ద్రవాలు, కీటకాలు, పొలాల నుండి ఆహారాన్ని చేరి, దానిని కలుషితం చేస్తుంది. ఇందులో 1%మన ఆహార పానీయాల్లో చేరితే, సుమారు 3 గ్రాముల మలం ప్రతి మనిషి రోజు తినే ఆహారంలో కలుస్తున్నట్లు పర్యావరణ శాస్త్రవేత్తలు చెబుతున్నారు. ఒక గ్రాము మలములో కోటి వైరస్ లు, 10 లక్షల బాక్టీరియాలు, 10వేల పరాన్న జీవుల సిస్టులు, 100 పరాన్న జీవుల గ్రుడ్లు వుంటాయి. ఈ సూక్ష్మ జీవులు మన శరీరంలోకి చేరితే ఘోరమైన జబ్బుల బారిన పడతాo.

సూక్ష్మ క్రిములు మన శరీరం లోకి వెళ్ళకుండా ఉండాలంటే దానికి సరియైన మార్గం మరుగు దొడ్డి వినియోగమే! ఇంట్లోని ప్రతి ఒక్కరు- ఆడవారు, మగవారు, పిల్లలు, పెద్దలు, ముసలి వారు, పసి పిల్లలతో సహా అందరు మరుగు దొడ్డిని వాడాలి. ఒక వేళ పసి పిల్లలు మల విసర్జన బయట చేసినట్లైతే ఎత్తి మరుగు దొడ్డిలో వెయ్యాలి.

మరుగు దొడ్డి వినియోగం:

మల విసర్జన చేసే ముందు మల విసర్జన చేసే  బేసిన్లో కొంచెం నీరు పొయ్యాలి, అందువలన మలం దానిని అంటుకోకుండా ఉంటుంది. మల విసర్జన తరువాత ఎక్కువ నీటిని వేగoగా పోస్తూ శుభ్రపరచుకోవాలి.

మరుగుదొడ్డిని తరచు రోజూ ఉదయం లేదా సాయంత్రం శుభ్రం చేసుకోవాలి . అలా చేయడం ద్వారా సూక్ష్మ జీవుల వ్యాప్తిని అరికట్టవచ్చు. మనల్ని మనం జబ్బులు రాకుండా కాపాడుకోవచ్చు. ప్రతి ఇంట మరుగు దొడ్డి సదుపాయాన్ని కల్పించటానికి ప్రభుత్వం నిర్మల్ భారత్ అభియాన్ ద్వారా సహకారాన్ని అందిస్తుంది.

డాక్టర్. జి.మాధురి, అధ్యాపకులు, AMR-APARD, HYDERABAD
కుమారి. వై.లిల్లి నిర్మలా శాంతి, విద్యార్ది, ఐ.డి.నెం.హెచ్.హెచ్.2010/047.

Download File

Rating :2.81 1   1   1   1  
shashi    2015-08-24 14:05:25
Hi, Thanks for sharing the information...... Good Website frnds...... Thanx for Admin.....Please keep in update
...............................................
బి. లక్ష్మణ్. బోరంచ లింగారెడ్డి జిల్లా    2016-11-07 22:07:23
నేను మరుగుదొడ్డి నిర్మించుకున్నాను కాని బిల్లు చెల్లించడంలేదు
...............................................
మీ సూచనను పోస్ట్ చేయండి

(ఈ పేజీ లో ఉన్న కంటెంట్ పై ఏమైన వ్యాఖ్యలు / సలహాలు ఉంటే, ఇక్కడ పోస్ట్ చేయండి)

Select Rating : 0 1 2 3 4