పర్యావరణం

బహిరంగ మల విసర్జన-అనర్ధాలు

ఒక సందర్భంలొ గాంధీ మహాత్ముడు"స్వాతంత్ర్యం కంటే పరిశుభ్రత  ముఖ్యం” అని అన్నారు. ఆ రోజుల్లో ఆయన అన్న ఆ మాటను ఆచరణలొ పెట్టి ఉంటే పుట్టిన వారు పుట్టబోయే వారు కూడా సంరక్షించబడేవారు. బహిరంగ మల విసర్జన వలన అనారోగ్యం, పొషక లొపం, శిశు మరణాలతో పాటు పిల్లలలొ పెరుగుదల కూడా ఆగిపోతున్నట్టుగా పరిశొధనలు తెలుపుతున్నాయి. అందుచేత బహిరంగ మల విసర్జనను అడ్డుకోవాలి.

              మన దేశంలో ప్రతి రోజు 600 మిలియన్ల ప్రజలు బహిరంగ మల విసర్జన చేస్తున్నారు. వ్యక్తిగత మరుగుదొడ్లు లేకపోవటo ఒక కారణమైతే, మరుగుదొడ్లు  ఉన్నప్పటికీ వాటిని ఉపయోగించక పోవడం మరొక కారణం. ఒక విధంగా ఇది అనాగరికతకు చిహ్నం. పాతకాలపు  రోజుల్లో దాదాపు అందరూ  బహిరంగ మల విసర్జన చేసే వారు. పిల్లలైతే ఇంటిముందు, పెద్దలు ఊరిబయట, కాల్వలవద్ద, రైలుకట్ట ప్రక్కన, రహదారుల వెంబడి, పొలాల్లోనూ, పొదలచాటున, చెరువుగట్టు మొదలగు ప్రాంతాలలో మల విసర్జన చేసే వారు. దీనికి కారణం అప్పట్లో మరుగుదొడ్డి వినియోగం గురించి ఎవరికీ అంతగా అవగాహనలేకపోవటo. అభివృద్ధి దిశగా పరుగు పెడుతున్న ప్రస్తుత కాలంలో కూడా అదే పద్ధతి అనుసరించడం అనాగరికతే!
            ఆహారం, విషయాలలో పెను మార్పులు వచ్చినా, విద్య, వ్యాపారం, టీవీలు, కంప్యూటర్లు, చరవాణి  ఇలా ఎన్నో మౌలిక వసతులను అమర్చుకుంటున్నా, బహిరంగమలవిసర్జన చేయడం మాత్రం మార్చుకోలేదు. మనం చేసినా, మరెవరో చేసినా బహిరంగమలవిసర్జన వలన మలం మనం తినే ఆహారంలోకి  చేరుతుంది అనేది సత్యం! ఇది ఎలా జరుగుతుందో తెలుసుకుందాం.
మల విసర్జితాల వలన పరిశుభ్రమైన నీరు, ఆహారము, ఆరొగ్యం కలుషితమయ్యే విధానం

బహిరంగ మల విసర్జన ద్వారా మలంలోని సూక్ష్మ క్రిములు, నీటి ద్వారా, కీటకాల ద్వారా, కాలి, చేతి వ్రేళ్ళ ద్వారా, నేలల ద్వారా, ఆహారాన్ని, వ్యక్తులని చేరుతాయి.

  • ఐతే మరుగు దొడ్డి వినియోగించుకుంటే మలం ద్రవాల ద్వారా, కీటకాల ద్వారా, మట్టి  ద్వారా ఆహారంలోకి, వ్యక్తులకు చేరకుండా అడ్డుకోవచ్చు.
  • సురక్షితమైన నీటి సరఫరా వలన నీటి  ద్వారా మలం ఆహారంలోకి, వ్యక్తులకి చేరకుండా అడ్డుకోవచ్చు.
  • వ్యక్తిగత శుభ్రత పాటిస్తే కాలి, చేతి వ్రేళ్ళ ద్వారా, కీటకాల ద్వారా మలంని ఆహారంలోకి, వ్యక్తులకి చేరకుండా అడ్డుకోవచ్చు.

         అందుకే బహిరంగ మల విసర్జనను అడ్డుకుందాం.

డాక్టర్. జి.మాధురి, అధ్యాపకులు, AMR-APARD, HYDERABAD
కుమారి. వై.లిల్లి నిర్మలా శాంతి, విద్యార్ది, ఐ.డి.నెం.హెచ్.హెచ్.2010/047.

Download File

Rating :2.59 1   1   1   1  
s.himabindhu    2014-08-30 11:37:53
పరిసరాలను పరిశుబ్రంగా ఉంచుదాం... మన ఆరోగ్యానికి మనమే మంచి పునాది వేసుకుందాం.
...............................................
e.deepika    2014-08-30 11:58:20
పచ్చని చెట్లను పెంచుదాం పర్యావరణాన్ని పరిరక్షించుధం. చెట్లను నరకివేయకండి
...............................................
e.deepika    2014-08-30 12:13:07
పచ్చని చెట్లను పెంచుదాం పర్యావరణాన్ని పరిరక్షించుధం. చెట్లను నరకివేయకండి
...............................................
P.Rajeshwari hh/2011-105    2014-08-30 12:36:23
మన చుట్టూ ఉండే పరిసరాలను పరిశుబ్రంగా ఉంచుకోవాలి.పరిశుబ్రంగా ఉంచుకోవడం వాళ్ళ అలాంటి వ్యాధులు రాకుండా ఉంటాయి.
...............................................
Bhavya    2014-08-30 14:34:33
Chetlanu premidam arogyamga undam...
...............................................
YAMINI    2014-09-02 11:57:27
నైస్ information
...............................................
పడాల ఈశ్వరరెడ్డి, పందలపాక    2015-01-31 12:03:53
పచ్చని చెట్లు స్వచ్చభారత్ కు మెట్లు
...............................................
Prashanthi    2015-12-11 08:53:03
Very informative
...............................................
Lalitha    2017-09-07 19:43:32
Sir Content OK Where is cleanness Ikkada entha motivate chesina janaalu maaradam ledhu.villages lo toilets kattinchina use cheyadam ledhu.pls do something
...............................................
Nikhil    2018-01-03 20:43:28
In all villages private bathrooms should be there
...............................................
D.SURESH nayay    2018-01-30 12:14:37
Super sir
...............................................
మీ సూచనను పోస్ట్ చేయండి

(ఈ పేజీ లో ఉన్న కంటెంట్ పై ఏమైన వ్యాఖ్యలు / సలహాలు ఉంటే, ఇక్కడ పోస్ట్ చేయండి)

Select Rating : 0 1 2 3 4