అభివృద్ధి పథకాలు

ఆరోగ్యలక్ష్మి కార్యక్రమం

గర్భిణీ మరియు బాలింత సమయములో తగిన పోషకాహరం తీసుకోక పోవడం వలన తక్కువ బరువుతో పిల్లలు పుట్టడం, పిల్లలు లోపపోషణకు గురి అవ్వడం జరుగుతుంది. అలాగే గర్బిణీలు తక్కువ బరువు ఉండటం, రక్తహీనతకు గురి అవడం వలన ప్రసవ సమయములో చాలా ఇబ్బందులు ఎదురుకుంటున్నారు. ఇవన్నీ కూడ మాతృ మరియు శిశు మరణాలకు కారణమౌతున్నాయి. మన రాష్ట్రంలో మాత మరియు శిశు మరణాల రేటు అధికంగానే ఉన్నది. గర్భిణీ మరియు బాలింతలు పూర్తి ఆరోగ్య స్థాయిలో ఉన్నపుడు, తాను జన్మనిచ్చే పిల్లలు ఆరొగ్యంగా ఉంటారని, తద్వారా మాత మరియు శిశు మరణాల రేటు,, తక్కువ బరువుతో జన్మించ్చే పిల్లల సంఖ్యను తగ్గించగలమనే ముఖ్య ఉద్దేశముతో ప్రభుత్వం ఆరోగ్యలక్ష్మి కార్యక్రమాన్ని 2015, జనవరి ఒకటవతేదీన మొదలుపెట్టింది. ఈ కార్యక్రమం క్రింద గర్బిణీ మరియు బాలింతలకు ఒక పూట పూర్తి భోజనం ప్రభుత్వం అందిస్తున్నది. మహిళాభివృద్ది శిశు సంక్షేమ శాఖలో, ఐ.సి.డి.ఎస్. పథకం ద్వారా అన్ని అంగన్వాడి కేంద్రాలలో ఈ కార్యక్రమం మొదలయింది.

ఆరోగ్యలక్ష్మి కార్యక్రమములో ప్రతి అంగన్వాడి కేంద్రములో అన్నం, పప్పు, కూరగాయలు, గ్రుడ్డు మరియు పాలతో కూడిన ఒక పూ ట పూర్తి భోజనం అందించబడుతుంది. ఈ కార్యక్రమం ద్వారా ప్రతీ గర్భిణి మరియు బాలింత స్త్రీకి రోజుకు 1052 కిలో కాలరీలు శక్తి (రోజుకు అవసరమయ్యే కిలో కాలరీలలో 40%), మాంసకృత్తులు 32.8గ్రా.(రోజుకు అవసరమయ్యే మాంసకృత్తులలో 50%) కాల్షియం 501.06 మి.గ్రా. (రోజుకు అవసరమయ్యే 40% కాల్షియం) భోజనం ద్వారా ఇవ్వడం జరుగుతుంది. ప్రతి గర్భిణీ/బాలింతకి రోజుకి 15/- ఖర్చుచేయడం జరుగుతున్నది.

ఒక పూట పూర్తి భోజనం మోడల్ మెనూ:

ప్రతి రోజు

ఆహారరకం 1

ఆహారరకం 2

ఆహారరకం 3

ఆహారరకం 4

ఆహారరకం 5

1వ రోజు

అన్నం

కూరగయలతో సాంబారు

-

గుడ్డుకూర

పాలు(200ml)

2వ రోజు

అన్నం

పప్పు

ఆకుకూర

గుడ్డు

పాలు(200ml)

3వ రోజు

అన్నం

ఆకుకూర పప్పు

గుడ్డుకూర

గుడ్డు

పాలు(200ml)

4వ రోజు

అన్నం

కూరగయలతో సాంబారు

100ml పెరుగు

గుడ్డుకూర

పాలు(200ml)

5వ రోజు

అన్నం

పప్పు

ఆకుకూర

గుడ్డు

పాలు(200ml)

6వ రోజు

అన్నం

ఆకుకూర పప్పు

100ml పెరుగు

గుడ్డు

పాలు(200ml)

(ఒక్కరికి ఉపయోగించబడే సరుకులు గ్రాములలో: బియ్యం 125గ్రా, పప్పు 30 గ్రా, నూనె 16 గ్రా, కూ రగాయలు/ ఆకుకూరలు 50 గ్రా, పాలు 200ml, గుడ్డు 1.)

2015 సంవత్సరములో ప్రారంభించబడిన ఈ కార్యక్రమంలో పట్ట ణ, గ్రామ, గిరిజన ప్రాంతాలలో చాలమంది గర్భిణీ బాలింతలు లబ్ది పొందుతూ హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఏ పథకాన్నైనా ప్రజలు స్వంతంచెసుకుంటేనే దానికి నిజమైన లబ్థి చేకూరుతుంది. కనుక ఆరోగ్యలక్ష్మి ఉద్దేశ్యాలను ప్రతిఒక్కరు తమ వంతుగా అవగాహన కల్పిస్తే మాతా, శిశు సమరక్షణను సులువుగానే సాధించవచ్చు

వి. సింధూరాణి, విస్తరణ అధికారి, ఐ.సి.డి.ఎస్. ప్రాజెక్ట్, తాండుర్, ఆదిలాబాద్ జిల్లా, తెలంగాణ రాష్ట్రం.

Download File

Rating :2.94 1   1   1   1  
మీ సూచనను పోస్ట్ చేయండి

(ఈ పేజీ లో ఉన్న కంటెంట్ పై ఏమైన వ్యాఖ్యలు / సలహాలు ఉంటే, ఇక్కడ పోస్ట్ చేయండి)

Select Rating : 0 1 2 3 4