అభివృద్ధి పథకాలు

కల్తీని కనుగొనుట

కల్తీ అంటే ఏమిటి?
ఆరోగ్యానికి హానికరమైన పదార్థాన్ని ఆహార పదార్ధముతో కలపటము లేక ఆహార పదార్ధములో అంతర్భాగమైన ఒక ముఖ్యమైన పదార్ధాన్ని తీసి వేయటం అనే పక్రియను కల్తీ అని అంటారు.

                                                              ఆహర పదార్ధములలో జరుగు కల్తీ

పాలు

డిటర్జెంట్ పౌడర్, పిండి పదార్ధాలు, అపరిశుభ్రమైన నీరు

టీపొడి                 

 రంగువేసిన వాడిన టీపొడి, రంపపు పొట్టు, ఇనుప రజను

కారప్పొడి

ఇటుక పొడి, రంపపు పొట్టు

పసుపు పొడి

బియ్యపు పిండి, మెటానిల్ ఎల్లో, రంపపు పొట్టు

నెయ్యి/వెన్న

వనస్పతి

రవ్వ

ఇనుప రజను

పంచదార

డిటర్జంటు పౌడరు

వంటనూనె

ఆర్జిమోన్(బ్రహ్మ జెముడు)నూనె

కంది పప్పు

కేసరి పప్పు

మిరియాలు

బొప్పాయి గింజలు

ఆవాలు

ఆర్జిమోన్ (బ్రహ్మ జెముడు) గింజలు

కొబ్బరి నూనె

మినరల్ ఆయిల్

ఇంగువ పొడి

చాక్ పొడి, ఇసుక, ధూళి

గోధుమపిండి

గంగ పొడి

కిట్ ద్వారా ఆహార పదార్ధాల కల్తీని కనుగొనే పద్ధతులు
కల్తీ కిట్ అంటే?
ఆహారపదార్థాములో కలిపే పదార్థమును కనుకొనుటకు ఉపయోగించే సామాగ్రిని కల్తీ కిట్ అంటారు.
కల్తీ కిట్ లోని వస్తువులు

 • సూచనల పత్రము
 • గాఢ హైడ్రోక్లోరికామ్లము
 • అయోడిన్
 • కార్బన్ టెట్రా క్లోరైడ్
 • డై ఇథైల్ ఈథర్
 • ఫర్ ప్యురాల్
 • నత్రికామ్లము
 • గాజుకడ్డీ
 • కొలిచేపాత్ర
 • డ్రాపర్
 • పరీక్షనాళికలు
 • పరీక్షనాళిక పట్టకారు
 • ప్లాస్టిక్ స్పూన్
 • అయస్కాంతం
 • ఫిల్టర్ పేపర్          
 • భూతద్దము
 • రెడ్ లిట్మస్ కాగితం

టీ పొడి
టీ పొడిలో సాధారణంగా ఇనుప రజను కలుపుతారు. దీన్ని పరీక్షించటానికి,

 • టీ పొడి నమూనాను తెల్ల కాగితములోనికి తీసుకోవాలి.

 • టీ పొడిని కాగితముపై పలచగా పరుచుకోవాలి.

 • అయస్కాంతమును టీ పొడి దగ్గరగా అటూ ఇటూ తిప్పాలి.

 • టీ పొడిలో ఇనుపరజను కలిసి ఉంటే అయస్కాంతమునకు అతుక్కుని ఉంటుంది.  

 • ఇనుపరజను లేకుంటే ఆ టీ పొడిలో కల్తీ లేనట్టే.

కారం
కారంలో సాధారణంగా ఇటుకపొడి, రంపపుపొట్టు కల్తీ చేస్తారు. వీటిని పరీక్షించటానికి, 

 • బీకరులోనికి కారం నమూనాను తీసుకోవాలి.

 • బీకరులో నీటిని కలపాలి.

 • కారం నీటిలో మునిగిపోతుంది. ఒకవేళ రంపపుపొట్టు కలిసి ఉంటే నీటిపైకి తేలుతుంది. ఇటుకపొడి కలిసి ఉంటే బీకరు అడుగుభాగమునకు చేరుతుంది.

నెయ్యి/వెన్న
నెయ్యిని వనస్పతితో కల్తీ చేస్తారు. దీన్ని పరీక్షించటానికి,

 • నమూనా నుండి కరిగిన నెయ్యి ఒక టీ స్పూన్ ను పరీక్ష నాళికలో తీసుకోవాలి.

 • 5మి.లీ. గాఢ హైడ్రోక్లోరికామ్ల ద్రావకమును పరీక్ష నాళికలో వేయాలి 

 • తరువాత 8-10 చుక్కల ఫర్ ప్యురాల్ ద్రావకమును కలపాలి.

 • పరీక్ష నాళికను బాగా కదపాలి. ద్రావకపు పొరలో గులాబి లేక ఎరుపు రంగు ఏర్పడితే అది వనస్పతితో కల్తీ అయినట్లు రంగు లేకపోతే కల్తీ జరగనట్లు.

 • 5 మి.లీ నీళ్ళు కలిపిన తరువాత కూడా ఆ రంగు అలాగే ఉంటుంది.

పంచదార
పంచదారను సాధారణంగా బట్టల సోడాతో కల్తీ చేస్తారు. దీన్ని పరీక్షించటానికి,

 • నమూనా నుండి ఒక స్పూన్ పంచదారను పరీక్ష నాళికలో తీసుకోవాలి.

 • గాఢ హైడ్రోక్లోరికామ్ల ద్రావకమును నమూనాకు కలిపి చర్యను గమనించాలి. కల్తీ జరిగినట్లయితే నమూనా నుండి పొగలు వస్తాయి.

 • నమూనాకు కొంత నీటిని కలపాలి.

 • ఎర్ర లిట్మస్ కాగితాన్ని పరీక్ష నాళికలో ముంచాలి. కల్తీ నమూనాలోని లిట్మస్ కాగితం నీలం రంగుకి మారుతుంది. స్వచ్చమైన నమూనాలో రంగు మారదు.

వంటనూనె
వంటనూనెను బ్రహ్మజెముడు నూనెతో కల్తీ చేస్తారు. దీన్ని పరీక్షించటానికి,

 • నమూనాను ఒక పరీక్ష నాళికలో తీసుకోవాలి.

 • నత్రికామ్ల ద్రావకమును నమూనాకు కలిపి జాగ్రత్తగా కలపాలి.

 • ద్రావకపు పొరల్లో ఎరుపు లేదా మట్టిరంగు వస్తే ఆ నమూనాలో కల్తీ జరిగినట్లు, రంగు లేనట్లయితే కల్తీ లేనట్లే.

కందిపప్పు
కందిపప్పులో సాధారణముగా కేసరి పప్పును కలుపుతారు. దీన్ని పరీక్షించటానికి,

 • నమూనాను ఒక పరీక్ష నాళికలోకి తీసుకోవాలి.

 • 5 మి.లీ. గాఢ హైడ్రోక్లోరికామ్ల ద్రావకమును నమూనాకు కలపాలి.

 • నమూనాను 15 నిమిషాల తరువాత పరీక్షించాలి.

 • నమూనాలో గులాబిరంగు కనిపిస్తే అందులో కల్తీ జరిగినట్లు, రంగు మారకపోతే కల్తీ జరగనట్లు.

 • భూతద్ధం సాయంతో కూడా కందిపప్పును పరీక్షించవచ్చు. కందిపప్పు గుండ్రగా ఉండగా, కేసరిపప్పు ఆకారము పలకలుగా ఉంటుంది.

మిరియాలు
మిరియాలలో బొప్పాయి విత్తనాలు కలిపి కల్తీ చేసారు. దీన్ని పరీక్షించటానికి,

 • బీకరు తీసుకొని దానిలో నీరు పోయాలి. నమూనాను బీకరులో వేయాలి.

 • మిరియాలు నీళ్ళలో మునుగుతాయి. బొప్పాయి విత్తనాలు నీళ్ళపై తేలుతాయి.

 • నీళ్ళపై తేలిన విత్తనాలు గల నమూనాలో కల్తీ జరిగినట్లే.

ఆవాలు
ఆవాలను సాధారణంగా బ్రహ్మ జెముడు విత్తనాలతో కల్తీ చేసారు. దీన్ని పరీక్షించటానికి,

 • ఒక బీకరుని తీసుకుని నమూనాను బీకరులో వేసి, నీటిని కలపాలి.

 • కల్తీ జరిగిన నమూనాలోని బ్రహ్మజెముడు విత్తనాలు నీటిపై తేలుతాయి. ఆవాలు మునుగుతాయి.

 • కల్తీ జరగని నమూనాలోని ఆవాలు నీళ్ళలో మునుగుతాయి.

కొబ్బరి నూనె  
కొబ్బరి నూనెలో సాధారణముగా ఖనిజ నూనె కల్తీ చేస్తారు. దీన్ని పరీక్షించటానికి,

 • నమునాను గిన్నెలో తీసుకొని రిఫ్రిజరేటర్లో అరగంట ఉంచి తీసి చూడాలి.

 • స్వచ్చమైన కొబ్బరినూనె గడ్డ కడుతుంది.

 • కల్తీ జరిగిన కొబ్బరినూనె గడ్డ కట్టదు.

ఇంగువ పొడి
ఇంగువ పొడిని సాధారణంగా చాక్ పొడితో కలిపి కల్తీ చేస్తారు. దీన్ని పరీక్షించటానికి,

 • బీకరు తీసుకొని ఇంగువ పొడి నమూనాను అందులో వేయాలి.

 • కార్బన్ టెట్రా క్లోరైడ్ ద్రావకమును ఆ నమూనాలో కలపాలి.

 • ఇంగువ పొడి బీకరులోని ద్రావకములో తేలుతుంది.

 • గాఢ హైడ్రోక్లోరికామ్ల ద్రావకమును వాచ్ గ్లాస్ లోని ఇంగువ పొడికి కలపాలి.

 • కల్తీ జరిగిన పొడిలో నుండి పొగలు వస్తాయి. స్వచ్చమైన పొడి నుండి ఎటువంటి పొగలు రావు.

గోధుమపిండి
సాధారణంగా గంజి పొడిని గోధుమ పిండితో కలిపి కల్తీ చేస్తారు. దీన్ని పరీక్షించటానికి,

 • ఒక చెంచా గోధుమ పిండిని పరీక్ష నాళికలో తీసుకోవాలి.

 • ఆయోడిన్ ద్రావకమును నమూనాకు కలపాలి.

 • ద్రావకము నీలం రంగుకు మారినట్లయితే కల్తీ జరిగినట్లే, కల్తీ లేని నమూనాలో ద్రావకము రంగు మారదు.

పాలు
పాలను సాధారణంగా గండి పొడితో కల్తీ చేస్తారు. దీన్ని పరీక్షించటానికి,

 • 5 మి.లీ. పాలను ఒక పరీక్ష నాళికలో తీసుకోవాలి.

 • పట్టకారు సాయంతో పరీక్ష నాళికను పట్టుకుని పాలను వేడిచేయాలి.

 • కొన్ని చుక్కల ఆయోడిన్ ద్రావకము నమూనాకు కలపాలి.

 • పాలలో కల్తీ ఉంటే అందులో నీలం రంగు కనిపిస్తుంది.  

 • కల్తీ లేకపోతే పాలరంగు మారదు.

ఏలకులు
సాధారణంగా పెద్ద ఏలకులను చిన్న ఏలకులను కల్తీ చేస్తారు. ఏలకుల నుండి నూనెను వేరు చేయటం ద్వారా కల్తీ చేస్తారు. దీన్ని పరీక్షించటానికి,

 • నమూనా ఏలకులకు ఒక వాచ్ గ్లాసులో తీసుకోవాలి. పరిశీలన ద్వారా చిన్న ఏలకులను వేరు చేయాలి.

 • పెద్ద ఏలకులు నున్నగా లావుగా ముడతలు లేకుండా ఉంటాయి.

 • చిన్న ఏలకులు పగుళ్ళు విచ్చి ఎండిపోయినట్లుంటాయి.

ధనియాల పొడి
ధనియాల పొడిని సాధారణంగా రంపపు పొట్టుతో కల్తీ చేస్తారు. దీన్ని పరీక్షించటానికి,

 • నమూనాను ఒక బీకరులోని నీటిలో వేయాలి.

 • ధనియాల పొడి నీటిలో మునుగుతుంది.  

 • కల్తీ ఉంటే రంపపు పొట్టు నీటిపై తేలుతుంది.  

పసుపు పొడి
పసుపు పొడి సాధారణంగా మొటానిల్ ఎల్లో కలిపి కల్తీ చేస్తారు. దీన్ని పరీక్షించటానికి,

 • నమూనాను పరీక్ష నాళికలో తీసుకొని నీటిని కలపాలి.  

 • గాఢమైన పసుపురంగు ఏర్పడితే నమూనాలో మెటానిల్ ఎల్లో తో కల్తీ చేసినట్లు తెలుస్తుంది.

 • తేలికైన పసుపురంగు కల్తీ లేనట్లు సూచిస్తుంది.

డాక్టర్.  పి. రాధా రాణి, ప్రొఫెసర్, వనరుల నిర్వహణ & వినియోగదారుల శాస్త్ర విభాగం.

Download File

Rating :3.33 1   1   1   1  
sathya    2017-03-20 15:05:15
information good ... need phone numbers to clarify our doubts
...............................................
వరదా నాగేశ్వర రావు    2018-01-19 11:37:50
చాలా బాగుంది మంచి సమాచారం...
...............................................
మీ సూచనను పోస్ట్ చేయండి

(ఈ పేజీ లో ఉన్న కంటెంట్ పై ఏమైన వ్యాఖ్యలు / సలహాలు ఉంటే, ఇక్కడ పోస్ట్ చేయండి)

Select Rating : 0 1 2 3 4