అభివృద్ధి పథకాలు

భద్రతా ప్రమాణాలు

  • ఉత్పత్తులపై వేసిన సర్టిఫికేషన్ గుర్తు వాటి వాడకం సురక్షితమైనదని స్పష్టీకరిస్తుంది.
  • ఎలక్ట్రికల్,ఎలక్ట్రానిక్, టెక్స్ టైల్స్, కెమికల్స్, క్రిమిసంహారకాలు, సిమెంట్- కాంక్రీట్ ఉత్పత్తులు, ఆప్టికల్ సామగ్రి, ఆటోమొబైల్ భాగాలు, ఆహార పానీయాలు వగైరా ఉత్పతుల పైన "ఐ.ఎస్.ఐ బ్యూరో ఆప్ ఇండియన్ స్టాండర్డ్స్(బి.ఐ.ఎస్)" సర్టిఫికేషన్ గుర్తు చూసి కొనాలి.
  • జాములు, పండ్ల రసాలు, స్క్వాష్ లు, బాటిళ్ళు, క్యాన్లు, కూరగాయలు, పచ్చళ్ళు, సూపులు, నీరు నిర్జలీకరణ చేసిన కూరగాయలు కొనేటప్పుడు వాటిపైన "ఎఫ్. పి. ఓ” గుర్తును చూడండి.
  • కూరగాయలు, నూనె, నెయ్యి, మీగడ, వెన్న, బెల్లం, వేరు శెనగకాయలు, పండ్లు,మసాలాలు, పప్పులు, అటవీ ఉత్పత్తులు మీద "ఆగ్ మార్క్" గుర్తు గమనించి కొనండి.
  • సబ్బులు, డిటర్జెంట్లు, కాగితం, కొవ్వును కలిగిన నూనె, ప్యాకింగ్ వస్తువులు, పౌడరు, కోటింగ్ బాటరీలు, ఆహార అడిటివ్ లు, వస్త్రాలు, అగ్నిమాపక పరికరాలు, చర్మ వస్తువులు, ప్లాస్టిక్ వస్తువులు కొనేట్టపుడు "ఎకో మార్క్ (ఎకో లేబిలింగ్ ) చూసి కొనండి.
  • మాంసం, మేక మాంసం, టిన్ లలో భధ్రపరచబడిన సాసేజ్ లు, హ్యామ్ మొదలైన ఉత్పతులపై "ఎం.పి. ఓ. మాంస ఉత్పత్తుల ఉత్తర్వు గమనించండి.
  • ఉన్ని వస్త్రాలు, దుస్తులు కొనేటప్పుడు "ఉన్ని మార్కు" చూసి కొనండి.
  • బంగారు ఆభరణాలు, వెండి వస్తువులు కొనేటప్పుడు " హాల్ మార్కు హెచ్. ఎ. సి.సి.పి." గుర్తు గమనించి కొనండి.

డాక్టర్.టి.నీరజ, ప్రొఫెసర్, వనరుల నిర్వహణ & వినియోగదారుల శాస్త్ర విభాగం
కుమారి. సి.హెచ్.సింధు, విద్యార్ధి, ఐ.డి.నెం: హెచ్.హెచ్.2010/073.

Download File

Rating :2.81 1   1   1   1  
మీ సూచనను పోస్ట్ చేయండి

(ఈ పేజీ లో ఉన్న కంటెంట్ పై ఏమైన వ్యాఖ్యలు / సలహాలు ఉంటే, ఇక్కడ పోస్ట్ చేయండి)

Select Rating : 0 1 2 3 4