అభివృద్ధి పథకాలు

కల్తీ

ఆహార పదార్దాలలో కల్తీ నానాటికీ పెరిగిపోతున్నది. కల్తీ వల్ల వినియోగదారులు ఆరోగ్యపరంగానూ, ఆర్దికంగానూ దోపిడీకి గురవుతున్నారు.బజారులో దొరికే ఆహార పదార్ధాలలో ఏది అసలైందో, ఏది నకిలీదో అర్ధం తెలియక వినియోగదారులు నానా అవస్థలకు గురవుతున్నారు. కాబట్టి వినియోగదారులు ఆహార పదార్ధాలలో కల్తీలను గురించి అవగాహన కలిగి ఉండాలి.

కల్తీని ఇంట్లోనే గుర్తించే పద్దతులు :

 • పాలల్లో కల్తీని కనుక్కోవడానికి కొన్ని పాల చుక్కలను పాలిష్ బండగల నేలపై పోస్తే కల్తీ లేని పాలు జారవు లేదా కొద్ది కొద్దిగా కారతాయి. తెల్లటి మచ్చ మిగులుతుంది.కల్తీ అయిన పాలు చక్కగా, వేగంగా క్రిందికి కారతాయి. తెల్లటి మచ్చ కూడా మిగలదు.
 • ఆవాలను ఆర్జమోన్ విత్తనాలతో కల్తీ చేస్తుంటారు. వీటి లోపల తెల్లటి పదార్ధం ఉంటుంది. ఆవాలలో పచ్చటి పదార్ధం ఉంటుంది. గింజలను నలిపి చూస్తే విషయం అర్ధమవుతుంది.
 • ఐస్ క్రీంలో కల్తీకి వాషింగ్ పౌడరును వాడతారు. కల్తీని కనుక్కోవడానికి నిమ్మరసాన్ని కొంచెం కలిపితే నురగ పైకి కనిపిస్తుంది.
 • పంచదారలో కల్తీకి చాక్ పౌడరును వాడతారు, నీటిలో పంచదారను వేస్తే చాక్ పౌడరు నీటి అడుగుభాగాన చేరుతుంది.
 • కాఫీ పొడిలో చికోరి ఎంత వాడారో తెలుసుకోవాలంటే, దాన్ని ఒక గ్లాసు నీటిలో జల్లండి. కాఫీ పొడి పైకి తేలుతుంది. చికోరి అనే కల్తీ పదార్ధం కొద్ది నిముషాలలో దిగువకు చేరుతుంది.
 • టీలో కల్తీకి కలర్ ఆకులు, ఇనుము రజను, ఒకసారి ఉపయోగించిన టీ పొడులు వాడుతున్నారు. తెల్లటి కాగితంపై ఆకులను నలిపితే, కల్తీ రంగు బైట పడుతుంది. స్వచ్ఛమైన టీ ఆకులకు రంగు ఉండదు. అయస్కాంతాన్ని వాడితే ఇనుము రజను అతుక్కుంటుంది.
 • మిరప పొడిలో ఇటుక పొడిని కలిపి కల్తీ చేస్తారు. పరిశ్రమలో వాడే డై (కలర్) పొడిని కూడా ఉప యోగిస్తారు. ఇటుక పొడి గ్లాసు నీటిలో వేస్తే తొందరగా క్రింది భాగానికి చేరుతుంది. హైడ్రో క్లోరిక్ ఆసిడ్ ను కారంపై జల్లితే, ఎర్రగా స్వచ్ఛగా ఉంటుంది; ఇటుక పొడిపై వేస్తే రంగు మారుతుంది.
 • మిరియాలలో బొప్పాయి విత్తనాలు కల్తీ చేస్తారు. నీటిలో మిరియాలు వేస్తే మునిగిపోతాయి; బొప్పాయి గింజలు తేలుతాయి.
 • ఉప్పులో కల్తీకి తెల్లటి పొడిని వాడతారు. నీటిలో కల్తీలేని ఉప్పు అయితే కరిగిపోతుంది, కల్తీదైతే గ్లాసులో దిగువ భాగాన కలుషితాలు చేరతాయి.
 • బియ్యంలో కల్తీకి రాళ్ళు కలుపుతారు.చేతిలోకి కొన్ని బియ్యపు గింజలను తీసుకుని, నీటిలో వేస్తే రాళ్ళు అడుగుభాగానికి చేరుతాయి.
 • కందిపప్పులో కల్తీ చేయడానికి మెటానిల్ పసుపు కలుపుతారు. 5 గ్రాముల పప్పులని 5 మిల్లి లీటర్ల నీరులో వేసి కలపాలి. దానికి కొన్ని చుక్కల హైడ్రో క్లోరిక్ ఆమ్లాన్ని కలపాలి. అది గులాబీ రంగులోకి మారితే కల్తీ జరిగినట్లు గమనించండి.

డాక్టర్.టి.నీరజ, ప్రొఫెసర్, వనరుల నిర్వహణ & వినియోగదారుల శాస్త్ర విభాగం
కుమారి. సి.హెచ్.సింధు, విద్యార్ధి, ఐ.డి.నెం: హెచ్.హెచ్.2010/073.

Download File

Rating :2.48 1   1   1   1  
D SWATHI HH/2011/103    2014-08-30 12:26:05
మన వస్తవుకి మనమే బాధ్యత వహిచాలి .కాబట్టి ప్రతి వస్తువ్ కి బిల్లు తీసుకోవడం మరిచిపోవదు.
...............................................
మీ సూచనను పోస్ట్ చేయండి

(ఈ పేజీ లో ఉన్న కంటెంట్ పై ఏమైన వ్యాఖ్యలు / సలహాలు ఉంటే, ఇక్కడ పోస్ట్ చేయండి)

Select Rating : 0 1 2 3 4