• plain-light-blue-backgrounds
 • background_1
 • Hindhu
plain-light-blue-backgrounds1 background_12 Hindhu3

మా గురించి

రాష్ట్రీయ కృషి వికాస యోజన

వ్యవసాయ రంగంలో 4% అభివృద్ధిని సాధించడానికి కేంద్ర ప్రభుత్వం పదకొండవ పంచవర్ష ప్రణాళిక కాలంలో 2007 సంవత్సరం నుండి రాష్ట్రీయ కృషి వికాస యోజన పథకాన్ని అమలులోకి తెచ్చింది. దీని ప్రకారం వ్యవసాయ మరియు సంబంధిత వ్యవసాయేతర రంగాలలో- పాడి, పశుసంవర్ధకం, ఉద్యానవనాలు, చేపలు మొదలైన రంగాలలో సమగ్రాభివ్రుధ్ధిని సాధించడానికి వీలుగా కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వాలకు అదనపు నిధులు మంజూరు చేస్తుంది. పూర్తిగా రాష్ట్ర ప్రభుత్వాలు స్వీయ ప్రాతిపదికన అమలు చేసే పథకం.

ఉద్దేశ్యాలు

 • వ్యవసాయం మరియు ఆధారిత రంగాల ప్రణాళికళను రూపొందించి, అమలుపరచడంలో జిల్లాలకు, రాష్ట్రాలకు తగిన స్వేచ్చనివ్వడం
 • ఆగ్రొక్లైమాటిక్ స్థితిగతులనుబట్టి, వనరులనుబట్టి ప్రణాళికలను జిల్లాలు, రాష్ట్రాలు రూపొందించే విధానాన్ని ప్రొత్సహించడం.
 • స్థానిక అవసరాలు, పంటలు, ప్రాముఖ్యతలు ప్రాతిపదికగా రాష్ట్రాలు ప్రణాళికలను రూపొందించడంలో చేయూతనివ్వడం.
 • తగిన ప్రక్రియల ద్వారా పంటల దిగుబడిలో తగ్గుదలను నియంత్రించడం.
 • వ్యవసాయం మరియు ఆధారిత రంగాల రైతుల ఉత్పత్తులు పెంచేవిధంగా సాంకేతిక పరి జ్ఞానం అందించి ప్రోత్సహించడం
 • పరిశోధన, విస్తరణ కార్యక్రమాల ద్వారా ఉత్పత్తిలోను, ఉత్పాదకతలోను గుణాత్మకమైన మార్పులు సాధించడం
 • ఆంధ్రప్రదేశ్ లో ఆచార్య ఎన్.జి. రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం రాష్ట్ర వ్యవసాయ శాఖ ద్వారా నిధులు పొంది వివిధి సంబంధిత పరిశోధనలను చేపట్టడం గత ఐదు సంవత్సరాలుగా జరుగుతున్నది. విస్తృత పరిశోధనల ద్వారా కనుగొన్న నవీన సాంకేతిక పధ్ధతులను రాష్ట్రంలోని రైతాంగానికి విస్తరణ ద్వారా అందిస్తూ ఉత్పత్తి, ఉత్పాదకతను పెంపొందిస్తున్నారు.
 • ఉత్పత్తి, ఉత్పాదకతలో ప్రధాన పాత్ర ఆరోగ్యానిదనేది అందరికి తెలిసిన సత్యం. కనుక గృహ విజ్ఞాన విభాగం, తమ పరిశోధనను రైతు కుటుంబాలను , ముఖ్యంగా రైతు మహిళలు, వారి కుటుంబ ఆరొగ్యం, ఆదాయాన్ని పెంపొందించే విలువల సమాహారాలు, మొదలైన అంశాలను దృష్టిలో పెట్టుకొని పరిశోధన సాగిస్తున్నారు.

మరిన్ని వివరాల కోసం: http://rkvy.nic.in/

గుణాత్మక జీవనశైలి- ఎలక్ట్రానిక్ మాధ్యమాల ద్వారా విస్తరణ

పెరుగుదల, అభివ్రుధ్ధి మానవ జీవితంలో ముఖ్యమైన ప్రక్రియలు. ఇవి రెండూ మెరుగ్గా ఉండటమనేది జీవన శైలిమీద ఆధారపడి ఉంటుంది. గుణాత్మక జీవనశైలి ఆరోగ్యాన్ని పెంపొందించి ఉత్పత్తిని, ఉత్పాదకత శక్తిని పెంచుతుంది.

గతంలో లేని ఎన్నో ఆరోగ్య సమస్యలను నేడు చూస్తున్నాం. గ్రామం-పట్టణం, పేద-గొప్ప, ఆడ-మగ, అక్షరాస్యత-నిరక్షరాస్యత మొదలైన తరతరమ బేధాలు లేకుండా అనూహ్యమైన అనారోగ్య సమస్యలు తలెత్తుతున్నాయి. కారాణాలు ఎన్నిఉన్నప్పటికి, అన్నింటిని ఏకీకృతంచేసి చెప్పగలిగిన ఒక కారణం మన అలవాట్లు- భొజనం, విశ్రాంతి, పరిశుభ్రత, వ్రుత్తి పనులు, పరికరాలు, పరిసరాలు, పెంపకం, వనరులు, వనరుల వినియోగం మొదలైనవి మచ్చుకు కొన్ని మాత్రమే. మారుతున్న పరిస్దితులకు అనుగుణంగా జీవనశైలిని మార్చుకోవడం తప్పనిసరి. అదే పరిష్కారం కూడా!

నానాటికి మానవాభివృద్దిలో కలుగుతున్న మార్పులను అధ్యయనం చేస్తూ, వాటి కారణాలను విశ్లేశిస్తూ, పరిష్కారాలను పరిశోధనల ద్వారా అన్వేషిస్తూ , గృహ విజ్ఞాన విభాగం ఎంతో సాంకేతిక పరిజ్ణానాన్ని రూపొందించింది. కృషి విజ్ఞాన కేంద్రాల ద్వారా కొందరికి అందించడం జరిగింది. రాష్ట్రంలోని అశేష ప్రజానీకానికి అందించాలనే ఉద్దేశ్యంతో www.vigyanasaadhitha.com అనే వెబ్ పోర్టల్ ను రాష్ట్రీయ కృషి వికాస యోజన ఆర్ధిక సహకారంతో గుణాత్మక జీవనశైలి- ఎలక్ట్రానిక్ మాధ్యమాల ద్వారా విస్తరణ అనే బాహుళ్య విస్తరణ పరిశోధనలో భాగంగా రూపొందించింది.

మా సేవలు:

 • ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ విశ్వవిద్యాలయంలో రూపొందిస్తున్న గుణాత్మక జీవనశైలికి సంబందించిన సాంకేతిక సమాచారాన్ని అందుబాట్లో ఉంచడం
 • గుణాత్మక జీవనశైలికి సమాచారాన్ని నలుగురికి పంచే అవకాశం నమోదు ద్వారా ఇతరులకు కల్పించడం (నియమాలకు లోబడి)
 • మొబైలు ద్వారా టెక్స్ట్ & వాయిస్ సందేశాలను లక్ష్య సమూహాలకు పంపించడం
 • నిపుణులతో అంతర్జాలం ద్వారా చర్చించే సౌకర్యాన్ని సంస్థలకు కలిగించడం
నిర్వాహకులు:
డా. పి. అమల కుమారి
ప్రొఫెసర్, విస్తరణ & ప్రసార నిర్వహణ విభాగం గృహ విజ్ఞాన కళాశాల, సైఫాబాద్,
మొబైల్: +91 9492927422
ఇమేల్: amala_puthota@yahoo.com
డా. ఎ. మేరి స్వర్ణలత
ప్రొఫెసర్ & హెడ్, విస్తరణ & ప్రసార నిర్వహణ విభాగం, గృహ విజ్ఞాన కళాశాల, సైఫాబాద్, హైదరాబాద్
మొబైల్: +91 9849552251
ఇమేల్: marylata57@yahoo.co.in