అభ్యుదయం

పర్యావరణ సంబంధిత దినోత్సవాలు

ప్రపంచ వన్యప్రాణి దినోత్సవం: మార్చి 3


డిసెంబర్ 20, 2013 న యునైటెడ్ నేషన్స్ జనరల్ అసెంబ్లీలో జరిగిన 68 వ సమావేశంలో మార్చి 3 వ తేదీని ప్రపంచ వన్యప్రాణి దినోత్సవంగా ప్రకటించడానికి నిర్ణయించారు. తరువాత బ్యాంకాక్ లో జరిగిన కాన్ఫరెన్స్ అఫ్ ద పార్టీస్ టు సీఇటీఏస్ సమావేశంలో చేసిన తీర్మానం ప్రకారం మార్చు 3 ను ప్రపంచ వన్యప్రాణి దినోత్సవంగా ప్రకటించారు. ఈ రోజున అంతరించిపోతున్న జంతు, వృక్ష (Fauna & Flora) జాతుల మీద అవగాహన పెంచడానికి, అటవీ వృక్ష, జంతు సంతతి యొక్క రక్షణ అవసరమని, వన్యప్రాణుల నేరం తీవ్రమైనదిని పరిగణిస్తూ ఈ దినోత్సవాన్ని జరుపుకుంటారు.
మొదటి ప్రపంచ వన్యపాణి దినోత్సవం జరుపుకోవడానికి ఒక చిహ్నాన్ని రూపొందించారు. ఆ చిహ్నం 6 అధికారిక భాషలలో - అరబిక్, చైనీస్, ఇంగ్లీష్, ఫ్రెంచ్, రష్యన్ మరియు స్పానిష్, రూపకల్పన చేయబడింది
ప్రపంచ పిచ్చుకల దినోత్సవం: మార్చి 20
పిచ్చుకలు ఒకనాడు పంట చేలల్లో, పల్లె ముంగిళ్లలో, ధాన్యపు రాశుల్లో కిలకిలమంటూ సందడి చేసేవి. ఇవి జీవ వైవిద్యంలో ప్రధాన పాత్రనే పోషిస్తాయి. కాని అంతరించి పోతున్నాయని 1990 వ దశకంలో శాస్త్రవేత్తలు గ్రహించారు. ధాన్యాల పంట పొలాల్లో, ధాన్యపు రాశులలో కనిపించే క్రిమికీటకాలను పట్టి తినేస్తాయి. ఇవి అంతరించిపోవడం వలన రసాయన కీటకనాశనులను వాడవలసి వస్తున్నది. దీనిని గుర్తించిన ప్రపంచ దేశాలు ప్రతి సంవత్సరం మార్చి 20 న ప్రపంచ పిచ్చుకల దినోత్సవాన్ని నిర్వహిస్తున్నాయి. భారత ప్రభుత్వం తపాలా బిళ్లను కూడా విడుదల చేసింది. జనావాసాల మధ్య నివసిస్తున్న పిచ్చుకల మనుగడకు ప్రమాదం ఏర్పడితే అది మానవ మనుగడకు ఎందుకు ప్రమాదం కాదు అని గుర్తించిన ప్రపంచ దేశాలు "ప్రపంచ పిచ్చుకల దినోత్సవము" నాడు పిచ్చుకల మనుగడకు అవసరమైన ప్రాధాన్యత అంశాలపై చర్చించి అందుకు అవసరమైన కార్యక్రమాలను చేపడుతున్నాయి.
ప్రపంచ నీటి దినోత్సవం: మార్చి 22
ప్రతి సంవత్సరం మార్చి 22 వ తేదీని ప్రపంచ నీటి దినోత్సవాన్ని నిర్వహించాలని ఐక్యరాజ్యసమితి తీర్మానించింది. ప్రపంచ నీటి దినోత్సవాన్ని అంతర్జాతీయంగా పాటించాలన్న ఆలోచన, పర్యావరణం, ప్రగతి అనే అంశంపై 1992లో రియో డీ జెనేరో లో జరిగిన ఐక్యరాజ్య సమితి మహసభ (UNCID) లో రూపుదిద్దుకున్నది. మంచి నీటి ప్రాముఖ్యత గురించి మరియు స్థిరమైన మంచి నీటి వనరుల గురించి అవగాహన పెంచడానికి ఈ దినోత్సవాన్ని జరుపుకుంటున్నారు. ప్రతి సంవత్సరం ఒక్కొ సమస్య మీద దృష్టి పెడుతూ, 1994 వ సంవత్సరం నుండి 2014 వరకు మొత్తం 20 వివిధ అంశాల మీద ప్రపంచ వ్యాప్తంగా సదస్సులను నిర్వహించారు. 2015 సంవత్సరానికి నీరు - సుస్థిర అభివృద్ధి ప్రధానాంశం.
ప్రపంచ భూమి దినోత్సవం: ఏప్రిల్ 22
సమస్త జీవకోటి భారాన్ని మోసేది భూమి. మరి ఇలాంటి భూమి పరిరక్షణపై ఎంతమందికి అవగాహన ఉంది అంటే సమాధానం శూన్యం. పర్యావరణం, వాతావరణంతో పాటు ఇటు జీవన శైలిలోనూ మార్పులతో భూ పరిరక్షణపై అవగాహన కోసం కూడా ప్రత్యేక కార్యక్రమాలు అవసరమవుతున్నాయి. ఈ క్రమంలోంచి వచ్చిందే ‘ప్రపంచ భూమి దినోత్సవం. 1970 వ సంవత్సరం నుండి భూమి దినోత్సవం ఏప్రిల్ 22న దాదాపు 192 దేశాలు నిర్వహిస్తున్నాయి.’ భూమి పరిరక్షణకు సంభందించిన పలు అంశాలపై అవగాహనను పెంపొందించుకొని భూమిని పరిరక్షించుకొనే భాద్యతను ప్రతి ఒక్కరు చేపట్టటమే దీని ముఖ్య ఉద్దేశ్యం.
ప్రపంచ పర్యావరణ దినోత్సవం: జూన్ 5
జూన్ 5వ తేదీని "ప్రపంచ పర్యావరణ దినోత్సవం"గా ఐక్యరాజ్యసమితి జనరల్ అసెంబ్లీ 1972 లో ప్రకటించినప్పటి నుండి ఏదేని ఒక నిర్ణీత నగరంలో పర్యావరణానికి సంబంధించిన అంతర్జాతీయ సమావేశం జరుగుతుంది. ఈ అంతర్జాతీయ సమావేశంలో పర్యావరణానికి సంబంధించిన పలు కీలకమైన అంశాలను చర్చించటమేగాకుండా, పర్యావరణాన్ని కాపాడుకునేందుకు పలు మార్గదర్శక సూత్రాలను రూపొందిస్తుంటారు. 1972వ సంవత్సరంలోనే స్థాపించబడిన "ఐక్యరాజ్యసమితి పర్యావరణ పథకం" కూడా పర్యావరణాన్ని దృష్టిలో పెట్టుకొని అమలు చేశారు. రాజకీయ నాయకులకు, ప్రజలకు అప్రమత్తతను పెంచే దిశగా తగు చర్యలను చేపడుతుంది. 1972వ సంవత్సరం నుంచి క్రమం తప్పకుండా ప్రపంచ పర్యావరణ దినోత్సవాన్ని పాటిస్తున్నారు.
ప్రపంచ సముద్ర దినోత్సవం: జూన్ 8
ప్రపంచ సముద్ర దినోత్సవాన్ని 1992 నుండి కెనడాలోని రియో డి జనీరో, బ్రెజిల్ లో ఎర్త్ సమ్మిట్ వద్ద అనిధికారికంగా జూన్ 8 న వేడుకలు జరుగుతున్నాయి. అధికారికంగా 2008 లో, ప్రతి సంవత్సరం జూన్ 8 వ తేదీని ప్రతీ ఏటా ప్రపంచ సముద్ర దినోత్సవంగా జరపాలని ఐక్య రాజ్య సమితి నిర్ణయించింది. ఆహార భద్రత ఆరోగ్యం, అన్నిటికి సాగరుని అవసరం ఎంతో ఉంది, అందుకే సముద్ర ప్రాముఖ్యత తెలిపేందుకు ఈ దినోత్సవం నిర్వహిసున్నారు. ప్రతి సంవత్సరం సముద్ర రక్షణ గురించి కొత్త నేపథ్యంతో ఈ దినోత్సవాన్ని జరుపుతున్నారు.  
ప్రపంచ జనాభా దినోత్సవం: జూన్ 11
ఒక దేశ ఆర్ధిక ప్రణాళికలు, సామాజిక పథకాలు రూపొందించడానికి జనాభా లెక్కలు అవసరము. అటువంటి లెక్కలను ప్రతిదేశమూ సిద్ధం చేసుకుంటుంది. జనాభా లెక్కల ఆధారము గానే ప్రభుత్వ పథకాల రూపకల్పన, వెనకబడిన ప్రాంతాలు, వర్గాలు గుర్తింపు వంటివి జరుగుతాయి. అందువల్ల జనాభా లెక్కలకు అంత ప్రాధాన్యత, ప్రాముఖ్యత ఉన్నది.
నానాటికి పెరుగుతున్న జనాభా. తద్వారా తలెత్తే దుష్పరిణామాలను ప్రజలకు వివరించేందుకు, వారికి ఆయా సమస్యలపై అవగాహన కలిగించేందుకు ప్రతి ఏటా జూలై 11వ తేదీన "ప్రపంచ జనాభా దినోత్సవాన్ని" నిర్వహిస్తున్నారు. ప్రపంచవ్యాప్తంగా జనాభా పెరుగుదలకు, తరుగుదలకు సంబంధించిన విషయాల గురించి ప్రజలలో చలనం తెచ్చేందుకుగాను ఐక్యరాజ్యసమితి 1989వ సంవత్సరంలో దీనిని ప్రారంభించింది.
11-07- 1987న జన్మించిన ఒక శిశువుతో ప్రపంచ జనాభా 500 కోట్లకు చేరింది. అందువలన నాటి నుండి జూలై 11వ తేదీన ప్రపంచ జనాభా దినోత్సవంగా పాటిస్తున్నారు. ప్రపంచ జనాభాలో 40 శాతం మూడవ ప్రపంచ దేశాలైన ఇండియా, చైనాలలోనే ఉన్నారు. ప్రపంచ జనాభా ప్రతి సంవత్సరం 9 కోట్ల 20 లక్షలు అదనంగా పెరుగుతోంది. ఐక్యరాజ్య సమితి విడుదల చేసిన జనాభా నివేదిక ప్రకారం ఈ శతాబ్ధానికి ప్రపంచ జనాభా 700 కోట్లకు చేరుకుంటుందని అంచనా.
1987వ సంవత్సరంలో ప్రపంచ జనాభా ఐదు బిలియన్లకు చేరుకున్న రోజు "జూలై 11" కాబట్టి ఆరోజును "ప్రపంచ జనాభా దినం"గా ఐక్యరాజ్యసమితి గుర్తించింది. ఇక అప్పటినుంచి క్రమం తప్పకుండా ప్రతి ఏడాది జూలై 11వ తేదీన ఈ దినోత్సవాన్ని జరుపుకుంటున్నారు.
ప్రపంచ పులుల దినోత్సవం: జులై 29
ప్రపంచ పులుల దినోత్సవాన్ని ప్రపంచ వ్యాప్తంగా జులై 29 న జరుపుకుంటారు. అంతరించిపోతున్న పులుల పరిరక్షణకు సూచికగా ఈ దినోత్సవాన్ని జరుపుకుంటారు. ఇది 2010 లో సెయింట్ పీటర్స్బర్గ్ టైగర్ సమ్మిట్ వద్ద స్థాపించబడింది.
ప్రపంచ ఏనుగుల దినోత్సవం: ఆగస్టు 12


ప్రపంచ ఏనుగుల దినోత్సవం ఆసియా, ఆఫ్రికా ఏనుగుల దుస్థితిని దృష్టిలో పెట్టుకొని ఈ రోజున ప్రారంబించారు. ఇది అధికారికంగా ఆగస్టు 12, 2012 న ప్యాట్రిసియా సిమ్స్ మరియు ఏనుగుల పునఃప్రవేశ ఫౌండేషన్(Patricia Sims and the Elephant Reintroduction Foundation) ద్వారా స్థాపించబడింది. ప్రపంచ ఏనుగుల దినోత్సవం యొక్క ప్రథమ లక్ష్యం ఆఫ్రికా, ఆసియా ఏనుగుల యొక్క దుస్థితి మీద తక్షణ అవగాహన పెంచడానికి, వాటి భద్రత, సంరక్షణ మరియు నిర్వహణ గురించి విజ్ఞానం పెంచడం.
అంతర్జాతీయ ఒజోన్ పొర సంరక్షణ దినోత్సవం: సెప్టెంబర్ 16
కొన్ని దశాబ్దాల క్రితం శాస్త్రవేత్తలు భూమి యొక్క ఓజోన్ పొర సన్నబడటాన్ని గుర్తించారు. ఓజోన్ పొర ప్రకృతి సహజంగానే ఏర్పడిన వాతారణపు పొర. ఇది రెండవ వాతావరణపు పొర (stratosphere) క్రింద, భూమికి 3 కి.మీ ఎత్తులో ఉంటుంది. వాతావరణంలో అత్యధిక ఓజోన్ కలిగిన ప్రదేశం ఇదే. సూర్యకాంతిలోని అతినీలలోహిత కిరణాల వికిరణను దాదాపు 97-99% వరకు గ్రహిస్తుంది. ఆలా ఈ పొర భూమి వేడెక్కకుండా కాపాడుతుంది. శాస్త్రవేత్తలు క్లోరోఫోరో కార్బన్(CFC) అనే రసాయనం వల్ల ఓజోన్ పొర దెబ్బ తింటుందని, తత్కారణంగా భూమి వేడెక్కుతున్నదని కనుగొని ఈ క్లోరోఫోరో కార్బన్(CFC) లు తగ్గించాలని ప్రతిపాదన చేశారు. అందుకు UN జనరల్ అసెంబ్లీ ఒప్పుకుని ఓజోన్ పొర క్షీణతకు కారణమవుతున్న పరిస్థితులను అన్ని దేశాలు అదుపుచేయాలని మాంట్రియల్ ప్రోటోకాల్ పై సంతకం చేసి సెప్టెంబర్ 16, 2014 ను అంతర్జాతీయ ఓజోన్ పొర కాపాడే రోజుగా ప్రకటించారు. 
ప్రపంచ మంచి నీటి దినోత్సవం:
ప్రపంచ మంచి నీటి పర్యవేక్షణ దినోత్సవాన్ని 2003 లో America's Clean Water Foundation వారు ప్రారంభించారు. మంచినీటి పర్యవేక్షణ దినోత్సవాన్ని మొదట సెప్టంబర్ 18 లో ప్రారంభించారు. ఇది US లో మొదలు పెట్టారు తరువాత ప్రపంచమంతటా పాటిస్తున్నారు. నీటి సంరక్షణ మీద అవగహన పెంచడానికి, ప్రపంచ వ్యాప్తంగా ఉన్న నీటి వనరులను భావితరాలకు అందించే విధంగా సంరక్షించవలసిన ఆవశ్యకతను తెలియజేయడానికి ఈ దినోత్సవాన్ని జరుపుకుంటారు.

కుమారి ఎ. ప్రశాంతి, విద్యార్ధి, ఐ.డి.నెం: హెచ్.హెచ్.2012/047. 

Download File

Rating :3.25 1   1   1   1  
మీ సూచనను పోస్ట్ చేయండి

(ఈ పేజీ లో ఉన్న కంటెంట్ పై ఏమైన వ్యాఖ్యలు / సలహాలు ఉంటే, ఇక్కడ పోస్ట్ చేయండి)

Select Rating : 0 1 2 3 4