అభ్యుదయం

వైజ్ఞానిక మరియు విద్యా దినోత్సవాలు

ప్రపంచ రేడియో దినోత్సవం: ఫిబ్రవరి 13


ప్రపంచ రేడియో దినోత్సవం ఫిబ్రవరి 13 న జరుపుకుంటారు.  ఈ దినోత్సవాన్ని నవంబర్ 3 2011 లో జరిగిన UNESCO 36 వ సమావేశంలో నిర్ణయించారు. దీనిని మొదట స్పెయిన్ సామ్రాజ్యంలో  ప్రతిపాదించారు. 2012  ఫిబ్రవరి 13 వ తేదీన ఇటలీలోని పిసా విశ్వవిద్యాలయంలో రేడియో దినోత్సవాన్ని జరుపుకున్నారు. రేడియోను మారుమూల ప్రాంతాల ప్రజలలోకి కూడా తీసుకువెళ్ళి వారిలో విజ్ఞానాన్ని పెంచాలనేది ముఖ్య ఉద్దేశంగా రేడియో దినోత్సవాన్ని జరపడం ప్రారంభించారు. రేడియో ద్వారా సమాచారాన్ని అతి తక్కువ ఖర్చుతో త్వరగా చేరవేయడానికి సులువైన మార్గముగా వాళ్ళు భావించారు.  ప్రపంచంలోనే అంతరఖండాల రేడియో స్టేషన్ ని మొదలుపెట్టారు.
జాతీయ సైన్స్‌ దినోత్సవం: ఫిబ్రవరి 28  


మనదేశంలో ప్రతి ఏటా ఫిబ్రవరి 28 వ తేదీన జాతీయ సైన్సు దినోత్సవాన్ని రామన్ ఎఫెక్ట్ రూపు దాల్చిన సందర్భంగా జరుపుకుంటున్నారు. సముద్రపు నీటిపై సూర్యకాంతి పడినప్పుడు ఆ కాంతి లోని నీలం రంగు ఎక్కువగా పరిక్షేపం (scattering) చెంది మన కంటికి చేరడం వల్లనే సముద్రం నీలంగా కనిపిస్తుందని ప్రఖ్యాత భారతీయ భౌతిక శాస్త్రవేత్త సర్‌ సి. వి. రామన్‌ సిద్ధాంతీకరించారు. ఇలా ద్రవాలపై పడిన కాంతి కిరణాలు ఎలా పరిక్షేపం చెందుతాయో తెలిపే పరిశోధన ఫలితాన్నే 'రామన్‌ ఎఫెక్ట్‌' అంటారు. దీన్ని కనుగొన్నందుకు ఆయన 1930 లో నోబెల్‌ బహుమతిని అందుకున్నారు.
ఫిబ్రవరి 28, 1928 న సర్‌ సి.వి.రామన్‌, తన 'రామన్‌ ఎఫెక్ట్‌' ను కనుగొన్నాడు.  ప్రపంచ వ్యాప్తంగా భారతదేశానికి ఎనలేని గుర్తింపు తెచ్చిన ఆవిష్కరణ అది.  దానికి గుర్తుగా ఈ రోజును భారత ప్రభుత్వం ‘జాతీయ సైన్స్‌’ దినోత్సవంగా ప్రకటించింది. భారతదేశానికి సంబంధించి ముఖ్యమైన సమస్యల పరిష్కా రంలో, మిగతా దేశాలతో మన దేశాన్ని సమవుజ్జీగా నిలపడంలో, ప్రపంచస్థాయిలో అగ్ర నాయకత్వ స్థితికి చేర్చడంలో, ఇలా ఇంకా ఎన్నో సాధించాలనుకోవడంలో, సాధించడంలో శాస్త్ర సాంకేతిక రంగాల పాత్ర, శాస్తజ్ఞ్రుల పాత్ర విలువకట్టలేనిది. ప్రతి సంవత్సరం దేశ వ్యాప్తంగా ఈ రోజు అనుదిన జీవితంలో సైన్సు యొక్క ప్రాధాన్యతను చాటి చెప్పుతారు. మన దేశంలో 1987 ఫిబ్రవరి నుండి ప్రతీ సంవత్సరం జాతీయ సైన్స్‌ దినోత్సవంగా భారత ప్రభుత్వం, ప్రజలు నిర్వహిస్తున్నారు. జాతీయ స్థాయిలో సైన్స్‌ స్ఫూర్తిని చాటడం, వ్యాప్తి చేయడం ఈ  జాతీయ సైన్స్ డే ముఖ్య లక్ష్యం.
జాతీయ వైజ్ఞానిక దినోత్సవం (టెక్నాలజీ డే): మే 11
1998 మే 11వ తేదీన భారత్‌ రెండవసారి (మొదటి అణు పరీక్షలు మే 18, 1974 ) రాజస్థాన్‌లోని పోఖ్రాన్‌ వద్ద అణుపరీక్షలు నిర్వహించింది. అప్పటి నుండి ఈ తేదీన జాతీయ వైజ్ఞానిక దినోత్సవం జరుపబడుతుందని భారత ప్రభుత్వం ప్రకటించింది. ఈ అణుపరీక్షలకు 'ఆపరేషన్‌ శక్తి' అని పేరుపెట్టారు. ఈ అణు పరీక్షలతో భారత్‌ న్యూక్లియర్ దేశంగా అవతరించింది. ఆ రోజు శాస్త్రవేత్తలకు, ఇంజనీర్లకు, పరిపాలన, దేశ నిర్మాణంలో నిమగ్నమయ్యే అందరికి ముఖ్యమైనది. 
ప్రపంచ టెలీ కమ్మ్యూనికేషన్ మరియు సమాచార సొసైటీ దినోత్సవం: మే 17
టునిస్ లో జరిగిన ప్రపంచ సమాచార సమావేశంలో ఐక్యరాజ్య సమితి వారు  మే 17 వ తేదీని ప్రపంచ సమాచార సమాజ రోజును జరపాలని నిర్ణయించారు. తర్వాత 17 మే 1865 లో ఇంటర్నేషనల్ టెలికమ్యూనికేషన్స్ యూనియన్ యొక్క వ్యవస్థాపన జ్ఞాపకార్ధంగా ప్రపంచ టెలికమ్యూనికేషన్ దినోత్సవాన్ని జరుపుకుంటున్నారు. ఇంటర్నెట్ , కొత్త సాంకేతికత  ద్వారా తీసుకు రాబడిన సామాజిక మార్పుల గురించి ప్రపంచానికి అవగాహన పెంచడమే దీని లక్ష్యం.
ఉపాధ్యాయ దినోత్సవం: సెప్టెంబర్‌ 5     


మన దేశ తొలి ఉపాధ్యక్షుడు, రెండవ అధ్యక్షుడు అయిన సర్వేపల్లి రాధాకృష్ణ సెప్టెంబర్‌ 5న జన్మించారు. వృత్తిరీత్యా ఉపాధ్యాయుదైన ఆయన జన్మించిన రోజును దేశవాసులు 'ఉపాధ్యాయ దినోత్సవం' గా జరుపుకుంటున్నారు. 

                                         గురు:బ్రహ్మ, గురు:విష్ణు, గురుదేవో మహేశ్వర:

                                         గురు సాక్షాత్ పరబ్రహ్మ, తస్మై శ్రీ గురువే నమ:

గురువును పరబ్రహ్మగా భావించి బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులతో పోల్చి వారి గొప్పతనాన్ని కొనియాడారు మన పూర్వీకులు. వ్యక్తిత్వాన్ని, నడవడికను, ప్రవర్తనను తీర్చిదిద్ది మనలో మార్పుతీసువచ్చే వాడు గురువు. అందుకే జన్మనిచ్చిన తల్లి, తండ్రిల తర్వాత స్థానం గురువుకు ఇచ్చి గౌరవిస్తున్నారు. ఒక దేశం అభివృద్ధి పథంలో దూసుకెళ్లడంలో గురువు పాత్ర ఎంతో కీలకం. ఒక వ్యక్తి లేదా సమాజం ఉన్నతంగా ఎదగడంలో మంచి గురువు పాత్ర ఎప్పటికీ ఉంటుంది. గురువుకు పూజ చేయడం ఎప్పటి నుంచో వస్తున్న ఆచారం. అందుకే గురువులను ఈ ఉపాధ్యాయ దినోత్సవం సందర్బంగా ఇలా కృతజ్ఞతలు తెలుపుకుంటారు.
అంతర్జాతీయ అక్షరాస్యత దినోత్సవం: సెప్టెంబర్ 8
భాషను ఉపయోగించేందుకు అవసరమైనవి చదవటం, రాయటం, వినటం, మాట్లాడటం అనే నాలుగు ప్రాథమికాంశాలు తెలుసుకోవటాన్నే అక్షరాస్యత అంటారు. ప్రతి యేడాది సెప్టెంబర్ 8వ తేదీని "అంతర్జాతీయ అక్షరాస్యతా దినోత్సవం"గా జరుపుకుంటున్నాం. 1965వ సంవత్సరం, నవంబర్ 17వ తేదీన యునెస్కో సభ్యదేశాల విద్యాశాఖా మంత్రుల మహాసభ అనంతరం అంతర్జాతీయ అక్షరాస్యతా దినోత్సవం ప్రకటించబడింది. వ్యక్తులలో, సంఘాలలో, సమాజంలో అక్షరాస్యత గురించి అవగాహన పెంచడానికి ఈ దినోత్సవాన్ని జరుపుకుంటారు. 
మలాల దినోత్సవం: జులై 12  


మలాల దినోత్సవాన్ని జులై 14, 2014 సంవత్సవరంలో ప్రారంభించారు. అత్యంత చిన్న వయసులో నోబెల్ బహుమతి గెలుచుకున్న వ్యక్తిగా పాకిస్థాన్ సాహస బాలిక మలాలా యూసుఫ్ జాయ్ చరిత్ర సృష్టించారు. 2008 సెప్టెంబర్‌లో పెషావర్ ప్రెస్‌క్లబ్‌లో ఇచ్చిన ఉపన్యాసంలో మలాలా వేసిన ప్రశ్న ‘చదువుకోవడానికి నాకు ఉన్న హక్కుని లాక్కోవడానికి తాలిబన్లు ఎవరు?'  ఇదే ప్రశ్న చానెళ్ల ద్వారా స్వాత్ లోయ మొత్తం ప్రతిధ్వనించింది. అప్పటి నుంచే ఆమె, ఆమె కుటుంబ సభ్యులు తాలిబన్లకు శత్రువులయ్యారు.
మహిళా విద్యకు తన మద్దతును ప్రకటించడమే కాకుండా, పాకిస్థాన్‌లో ఉగ్రవాదుల అరాచకాలపై గళమెత్తిన మలాలా యూసుఫ్ జాయ్ ను హత్య చేస్తామని తెహ్రీక్ తాలిబన్ తీవ్రవాద సంస్థ ప్రకటించారు. ఉగ్రవాదుల అరాచకాలపై గళమెత్తినందుకు ఆమెపై తీవ్రవాదులు దాడి చేసి తీవ్రంగా గాయపరిచిన, మలాల తన పోరాటాన్ని ఆపలేదు. స్త్రీలు ఖచ్చితంగా విద్యా వంతులు అవ్వాలని మలాల గళం ఎత్తారు. స్త్రీ విద్య యొక్క ప్రాముఖ్యాన్ని తెలియజేసెందుకు ఈ మలాల దినోత్సవాన్ని జరుపుకుంటారు. ధైర్య సాహసాలు మరియు స్త్రీల అక్ష్యరాస్యతకు ప్రతీకగా ఈ దినోత్సవాన్ని జరుపుకుంటారు. మలాలా యూసఫ్ జాయ్ తన జీవిత చరిత్రను "ఐ యామ్ మలాలా" పేరిట పుస్తక రూపంలో అవిష్కరించారు.   
అంతర్జాతీయ రైతు దినోత్సవం: డిసెంబర్ నెలలోని మొదటి శుక్రవారం

 
అంతర్జాతీయ రైతు దినోత్సవం డిసెంబర్ నెలలోని మొదటి శుక్రవారంలో జరుపుకుంటున్నారు. జీవితకాలమంతా రైతుల సమస్యలు, వ్యవసాయ రంగ ఇబ్బందుల గురించే ఆలోచించి రైతులకోసం ప్రత్యేక ఉద్యమాలు నిర్మించి రైతు నాయకుల మద్దతుతో సొంతగా రాజకీయపార్టీని ప్రారంభించి, ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో శక్తివంతమైన నాయకుడిగా ఎదిగిన వ్యక్తి చౌదరి చరణ్ సింగ్. రైతు కుటుంబము నుండి వచ్చి ప్రధానిగా పని చేసి రైతులకు ఆయన చేసిన సేవలకు గుర్తుగా ప్రభుత్వము చరణ్ సింగ్ జన్మదినోత్సవాన్ని రైతుదినోత్సవంగా జరుపుకోవాలని ప్రకటించింది. చరణ్ సింగ్ రైతు నాయకుడిగానే 1987 మే 29 న మరణించారు.
దేశ సామాజిక, ఆర్థిక అభివృద్ధిలో రైతులు పోషిస్తున్న పాత్ర గురించి ప్రజలందరికీ తెలియచెప్పటం రైతుల దినోత్సవ ముఖ్య ఉద్దేశ్యం. రైతులకు ప్రోత్సాహం అందించే పథకాల అమలును గురించి సమీక్షించటం ఆ రోజున చేస్తారు. రైతులకు వ్యవసాయంపై అవగాహన  పెంచటం, వ్యవసాయ రంగంలో వస్తున్న కొత్త విధానాలను తెలియచెప్పటం, తక్కువ పెట్టుబడులతో అధిక ఉత్పత్తిని సాధించేందుకు రూపొందించిన వైజ్ఞానిక వ్యవసాయం గురించి ప్రచారం చేయటం కూడా రైతు దినోత్సవం లక్ష్యం.

కుమారి ఎ. ప్రశాంతి, విద్యార్ధి, ఐ.డి.నెం: హెచ్.హెచ్.2012/047
సమీక్ష: డాక్టర్ ఎ. మేరి స్వర్ణలత, ప్రొఫెసర్ & హెడ్, విస్తరణ మరియు ప్రసార నిర్వహణ విభాగము

Download File

Rating :3.8 1   1   1   1  
మీ సూచనను పోస్ట్ చేయండి

(ఈ పేజీ లో ఉన్న కంటెంట్ పై ఏమైన వ్యాఖ్యలు / సలహాలు ఉంటే, ఇక్కడ పోస్ట్ చేయండి)

Select Rating : 0 1 2 3 4