అభ్యుదయం

ప్రపంచ శాఖాహార దినోత్సవం

శాఖము మరియు ఆహారము అనే రెండు పదముల కలయిక శాఖాహారము. శాఖము అంటే చెట్టు. శాఖాహారం అంటే చెట్టు లేదా మొక్కల నుండి వచ్చే ఆహారము అని అర్ధం. శాఖాహారం వల్ల కలిగే ప్రయోజనాలని మానవజాతికి తెలియచెప్పి, ఈ ఆహారము జీవన విధానాన్ని ఏ విధంగా మెరుగు పరుస్తుందో వివరిస్తూ ప్రోత్సహించే ఉద్దేశంతో 1977 వ సంవత్సరంలో అక్టోబర్ 1 వ తేదిన ప్రపంచ శాఖాహార దినోత్సవంగా  ప్రకటించారు. ముందుగా 1974 లో నార్త్ అమెరికన్ శాఖాహార సొసైటీ  ఏర్పాటుచేసారు, దీనిని ఏర్పాటు చేయడానికి ప్రధానంగా రెండు ఉద్దేశ్యాలు ఉన్నాయి అవి; సొసైటీ సభ్యులకు మద్దతుగా నెట్ వర్క్ ఏర్పాటు చేసి సంబంధిత గ్రూపుల శాఖాహారులకు మద్దతు ఇవ్వడం ఒక భాగం కాగా శాఖాహారము ఏ విధమైన ప్రయోజనాలు ఇస్తుందో ప్రజలకు తెలియచెప్పడం రెండవది. 1997 లో నార్త్ అమెరికన్ సొసైటీ ప్రపంచ శాఖాహార దినోత్సవంగా, వార్షిక వేడుకగా ప్రకటించగా,  1978 లో ఇటర్నేషనల్ వెజిటేరియన్ యూనియన్ (International Vegitarian Union) ఆమోదాన్ని తెలిపి అక్టోబర్ 1 వ తేదిన ఈ వేడుక జరుపుకోవాలని అధికారికంగా ప్రకటించింది. పౌష్టికాహార విషయములో ఒక్కొక్క దేశానికి ఒక్కొక్క ప్రత్యేకత ఉన్నది. ఎక్కువగా వాడే నిమ్మ, భారతదేశములో వాడే లస్సి, జపాన్ లో వాడే పుట్టగొడుగులు, ఆస్ట్రేలియలో వాడే ఫ్రూట్ సలాడ్స్ అన్ని మంచి  విటమిన్లతో కూడుకున్నవే. అలాగే సులువుగా జీర్ణమయ్యే ఆహారము బార్లి లాంటివి అనేకము ఉన్నాయి. గోధుమతో పోల్చితే బార్లి శరీరములో పేరుకుపోయిన నీటిని బయటికి పంపిస్తుంది. ఆకు కూరలు, కాయగూరలు, గింజలు మరియు పప్పులు ఆరోగ్యానికి ఎంతో మంచిది. శాఖాహారం జీర్ణకోశ వ్యాధులను నయంచేస్తుంది. ఇలాంటి శాఖాహారానికి సంభందించిన విషయాలను ప్రపంచానికి తెలియచేస్తూ గత 38 సంవత్సరాలుగా   ప్రపంచ శాఖాహార దినోత్సవం జరపబడుతున్నది.

కుమారి బి.పావని, విద్యార్థి, ఐ.డి.నెం: హెచ్.హెచ్. 2013/041.

Download File

Rating :3.03 1   1   1   1  
మీ సూచనను పోస్ట్ చేయండి

(ఈ పేజీ లో ఉన్న కంటెంట్ పై ఏమైన వ్యాఖ్యలు / సలహాలు ఉంటే, ఇక్కడ పోస్ట్ చేయండి)

Select Rating : 0 1 2 3 4