అభ్యుదయం

ప్రపంచ రేడియో దినోత్సవం

రేడియో
కాంతి వేగ పౌనపున్యాలతో విద్యుత్ అయస్కాంత తరంగాలను సుతి కూర్చడం ద్వారా తీగల ఆధారాలు లేకుండా గాలిలో శబ్ద సంకేతాలను ప్రసారం చేసే దూర శ్రవణ ప్రక్రియ రేడియో తరంగాలు. ఇలాంటి ప్రసారాలను వినటానికి ఉపయోగించే  సాధనాన్ని రేడియో అంటారు.     

రేడియో చరిత్ర
జూన్ 2,1896 వ సంవత్సరంలో ఇటలీకి చెందిన మార్కోని అనే శాస్త్రవేత్త రేడియోను కనిపెట్టాడు. కానీ, మే 7,1896 న రష్యాకు చెందిన శాస్త్రవేత్త అలెగ్జాండర్ పోప్ రెడియో ప్రసారం పద్ధతిని కనుగొన్నాడని కొందరంటారు. ప్రపంచ రేడియో ప్రసారాలు 1921 వ సంవత్సరంలో ప్రారంభమయ్యాయి. కాని, భారతదేశంలో మొదటి రేడియో ప్రసారాలు 1923 వ సంవత్సరంలో జాన్ క్లబ్ ఆఫ్ బోంబాయి ద్వారా ప్రసారమయ్యేవి. 1927 లో కలకత్తా మరియు ముంబాయి నగరాలలో ఇండియన్ రేడియో ప్రసారాలు చేసింది. 1936 వ సంవత్సరంలో ఆకాశవాణి ప్రభుత్వ సంస్థగా ఏర్పడింది. భారతదేశానికి  స్వాతంత్ర్యం వచ్చే నాటికి 6 ఆకాశవాణి కేంద్రాలు ఏర్పడ్డాయి. నేటి కాలంలో రేడియో అత్యంత సమాచార వనరుగా మారింది. ప్రపంచ జనాభా లో 95% పైగా ప్రజలు రేడియోను వినియోగిస్తున్నారు. అభివృద్ది చెందుతున్న దేశాలకు 75% మందికి పైగా గృహిణులు వివిధ అంశాల సమాచారం కోసం రేడియోపై ఆధారపడుతున్నారు. మన తెలుగు రాష్ట్రాలలో ఆదిలాబాద్, కడప, విజయవాడ, విశాఖపట్నం, హైదరాబాద్, అనంతపురం, కర్నూలు, కొత్తగూడెం, నిజామాబాద్, తిరుపతి, వరంగల్ లో ఆకాశవాణి ప్రసార క్రేందాలు ఉన్నాయి.
ప్రపంచ రేడియో దినోత్సవం ఎప్పుడు ఎందుకు జరుపుకుంటారు?

 ప్రపంచ రేడియో దినోత్సవం ఫిబ్రవరి 13 న జరుపుకుంటారు. ఈనాడు నిత్య జీవితంలో రేడియో ఒక అత్యంత ప్రధాన భాగం అయింది. ప్రపంచ వ్యాప్తంగా పెరుగుతున్న వార్త సౌకర్యాల రంగంలో రేడియో తన విశిష్ట స్ధానాన్ని నిలబెట్టుకుంటుంది. ప్రపంచ వ్యాప్తంగా వార్తలను, విషయాలను అందజేసి మనష్యులకు రక్షణ, విఙ్ఞానాన్ని, వినోదాన్ని, ఆలోచనను అందించడం లో రేడియో పాత్ర ప్రధానమైనది. అంతేకాక మారుమూల ప్రాంతాలలో ఉండే ప్రజలలోకి తీసుకువెళ్ళి వారిలో విఙ్ఞానాన్ని పెంపొందించాలనే ముఖ్య ఉద్దేశ్యం తో రేడియో దినోత్సవం జరుపుకుంటారు. 

కుమారి బి. సుభాషిని, విద్యార్థి, ఐ.డి.నెం: హెచ్.హెచ్. 2013/127.

Download File

Rating :2.92 1   1   1   1  
మీ సూచనను పోస్ట్ చేయండి

(ఈ పేజీ లో ఉన్న కంటెంట్ పై ఏమైన వ్యాఖ్యలు / సలహాలు ఉంటే, ఇక్కడ పోస్ట్ చేయండి)

Select Rating : 0 1 2 3 4