అభ్యుదయం

పాత్రికేయులు

బర్ఖాదత్
జన్మదినం: 18 డిసెంబర్ 1971

ఎయిర్ ఇండియా ప్రసిద్ధ పాత్రికేయుడు అయిన యస్.పి దత్ మరియు టైమ్స్ ఆఫ్ ఇండియా జర్నలిస్ట్ అయిన ప్రభాదత్ దంపతులకు న్యూఢిల్లీ లో జన్మించారు. బర్ఖాదత్ ఒక భారతీయ టెలివిజన్ విలేఖరి మరియు శీర్షికా రచయిత. NDTV లో ఆమె ఒక కన్సల్టింగ్ ఎడిటర్ గా పనిచేస్తున్నారు. ఆమె మాస్ కమ్యూనికేషన్స్ అనే మాస్టర్
డిగ్రీని జామియా మిలియా ఇస్లామియా మాస్ కమ్యూనికేషన్ రీసెర్చ్ సెంటర్, న్యూఢిల్లీ నుండి పొందారు. ఆమె తన వృత్తిని NDTV లో జర్నలిస్ట్ గా ప్రారంభించారు.టి.వి పర్సనాలిటి ఆఫ్ ద ఇయర్ అనే బిరుదును మరియు బెస్ట్ టి.వి యాంకర్ గా అవార్డులను దక్కించుకున్నారు. దత్ అనేక జాతీయ మరియు అంతర్జాతీయ పురస్కారాలను గెలుచుకున్నారు. అలాగే భారతదేశం యొక్క నాల్గవ అత్యున్నత పౌర సన్మానం అయిన పద్మ శ్రీ ని కూడా గెలుచుకున్నారు.

శైలి చోప్రా
జన్మదినం: 21 జూలై 1981

చోప్రా అనిల్ & సుమన్ ఆనే దంపతులకు జలంధర్ లో జన్మించారు. ఆమె ఒక టెలివిజన్ వ్యాఖ్యాతగా, నివేదనగా మరియు రచన నిలువు రంగంలో దాదాపు 12 సంవత్సరాల పాటు అనుభవం కలిగి ఉన్న ప్రముఖ మహిళా భారతీయ వ్యాపార విలేఖరి. ఆమె తెహెల్కా బిజినెస్ ఎడిటర్ గా వ్యవహరించారు. ఆమె సెప్టెంబర్ 2011 వరకు సీనియర్ ఎడిటర్ గా చేసి ప్రస్తుతం ఎకనామిక్ టైమ్స్ బిజినెస్ న్యూస్ ఛానల్ లో ప్రధాన మహిళా వ్యాఖ్యాతగా ఉంటున్నారు. చోప్రా టెలివిజన్ పలు ప్రముఖ కార్యక్రమాలకు వ్యాఖ్యాతగా కూడా వ్యవహరించారు.
ఆమె ఎయిర్ ఫోర్స్ గోల్డెన్ జూబ్లీ ఇన్స్టిట్యూట్, న్యూఢిల్లీ లో తన పాఠశాల పూర్తి చేసి, జర్నలిజం చెన్నై ఏషియన్ కాలేజి నుండి ప్రసారము & టెలివిజన్ లో ఆమె మాస్టర్స్ డిగ్రీని పొందారు. ఆమె ఒక మంచి రచయిత, కవి కూడా. ఆమె బిజినెస్ జర్నలిజం లో ఎక్సలెన్స్ ప్రతిష్టాత్మకంగా రాంనాథ్ గోయెంకా అవార్డు దక్కించుకున్నారు. అలాగే "న్యూస్ టెలివిజన్ అవార్డు", "బెస్ట్ షో అవార్డు", "బెస్ట్ వ్యాపార యాంకర్ అవార్డు" వంటి అనేక అవార్డులను పొందారు.

సాగరిక ఘోస్
జన్మదినం: 8 నవంబర్ 1964

ఆమె ఒక ఇండియన్ జర్నలిస్ట్, వ్యాఖ్యాత, మరియు రచయత. ఆమె 1991 నుండి టైమ్స్ ఆఫ్ ఇండియా, ఔట్ లుక్ మరియు ఇండియన్ ఎక్స్ ప్రెస్ లలో విలేఖరిగా పనిచేశారు. ఘోస్ జర్నలిజంలో అనేక భారతీయ అవార్డులను గెలుచుకున్నారు. ఈమె రెండు నవలల రచయత కూడా. ఇప్పుడు సంప్రదింపుల అధికారిణిగా టైంస్ ఆఫ్ ఇండియాలో పనిచేస్తున్నారు. ఘోస్ తన బ్యాచిలర్ డిగ్రీని సెయింట్ స్టిఫెన్స్ కాలేజి, ఢిల్లీలో మరియు ఎం.ఫిల్ సెయింట్ ఆంటోని కాలేజీ, ఆక్స్ ఫర్డ్ లో చదువుకున్నారు.2004 లో క్వశ్చన్ టైం ఇండియా అనే కార్యక్రమానికి ఆతిధ్యమిచ్చిన తొలి మహిళగా నిలిచారు.
2008 లో ఆమె కృషికి Gr8-ITA జర్నలిజంలో అవార్డులు అందుకున్నారు.

షెర్రీన్ భాన్
జన్మదినం: 20 ఆగష్టు 1976

షెరీన్ భాన్ పాత్రికేయురాలు మరియు వార్తా వ్యాఖ్యాత. ఆమె కాశ్మీర్ లోని ఒక హిందూ కుటుంబంలో జన్మించారు. ఆమె వార్తా పరిశోధకురాలుగా తన కెరీర్ ను ప్రారంభించారు. ఆమె వ్యాఖ్యాతనే కాకుండా CNBC-18 వివిధ కార్యక్రమాల్లో తన వంతు సాయం చేశారు. ఏప్రిల్ 2005 లో ఆమె ఫిక్కి ఉమెన్ ఆఫ్ ద ఇయర్ అవార్డు పొందారు.
2009 లో వరల్డ్ ఎకనామిక్ ఫారం యంగ్ గ్లోబల్ నాయకులలో ఒకరిగా ఆమె పేరు పెట్టారు. ఇంగ్లిష్ 2013 అవార్డ్స్ లో షెరీన్ భాన్ ఉత్తమ యాంకర్ గా ఎంపిక అయ్యారు. ఆమె కమ్యూనికేషన్స్ స్టడీస్ లో మాస్టర్ డిగ్రీ చేసారు. ఆమె ఢిల్లీ బ్యూరో చీఫ్ మరియు హెడ్ సి.ఎన్.బి.సి- టివి 18. తరువాత సెప్టెంబర్ 1, 2013 నుండి CNBC-18 కి మేనేజింగ్ ఎడిటర్ గా బాధ్యతలు చేపట్టారు.

హోమాయ్ వ్యారవల్ల
జన్మదినం: 9 డిసెంబర్ 1913

భారతదేశపు మొదటి మహిళ ఫొటో జర్నలిస్ట్. ఆగష్టు 15, 1947 ఎర్ర కోట వద్ద జెండా ఎగరవేసే వేడుకను మొదటి సారి ఫొటో తీసిన ఫొటోజర్నలిస్ట్. ఆమె పార్సి కుటుంబానికి చెందిన వ్యక్తి. బాంబే విశ్వవిద్యాలయం మరియు ఆర్ట్ సర్ జె.జె స్కూల్లో విద్యను అభ్యసించారు. ఆమె వృత్తిని 1930లో ప్రారంభించారు. కుటుంబంతో కలిసి 1942 లో ముంబైకి వచ్చారు. ఆ ముప్ఫై సంవత్సరాల్లో ఆమె మహత్మాగాంధీ, నెహ్రు, జిన్నా సహా అనేక రాజకీయ మరియు జాతీయ ఫొటోలను తీసారు. ఆమె బ్రిటిష్ సమాచార సేవలలో ఉద్యోగినిగా పని చేశారు. ఆమె 1939 మరియు 1970 మధ్య కాలంలో ప్రొఫెషనల్ మహిళా ఫొటోజర్నలిస్ట్ గా పనిచేశారు. పదవి విరమణలోపు ఆమె దాదాపు నాలుగు దశాబ్దాలు వృత్తిలో కొనసాగారు. ఊపిరితిత్తుల వ్యాధి బారిన పడి 15 జనవరి 2012 లో మరణించారు.

మిని మీనన్

మీనన్ కేరళకు చెందిన ఒక మలయాళీ కుటుంబంలో జమ్మూలో జన్మించారు. ఆమె సెయింట్ స్టిఫెన్స్ కాలేజీ, డిల్లీ నుంచి పట్టభద్రురాలయింది. తర్వాత మాస్టర్స్ చేయడానికి పుణె విశ్వవిద్యాలయంలో కమ్యూనికేషన్ రీసెర్చ్ కి వెళ్ళారు. ఈమె ఒక భారతీయ విలేఖరి. గత 16 సంవత్సరాలుగా రాజకీయ మరియు వ్యాపార రంగాలలోఅనుభవం కలిగి ఉన్నారు. ఆమె ప్రస్తుతం బ్లూంబర్గ్ టివి ఇండియా లో ఎగ్జిక్యూటివ్ ఎడిటర్ గా పనిచేస్తున్నారు. మీనన్ వ్యాఖ్యాతగా మరియు పాత్రికేయురాలిగా అవార్డులు అందుకున్నారు. 2003లో భారతీయ మార్కెటింగ్, ప్రచారం మరియు మీడియాలో 10 అత్యంత ప్రభావంతమైన మహిళలో ఒకరిగా నిలిచారు.
సంవత్సరం తర్వాత కళాశాలలో జరిగిన మిస్ ఇండియాలో పాల్గొని గెల్చారు. 2008 నుండి 2009 లో ఇండియన్ బ్రాడ్ కాస్ట్ ఫెడరేషన్ నుంచి బెస్ట్ బిజినెస్ అవార్డు, రాజీవ్ గాంధీ అవార్డు, మిస్ ఇండియా ఆసియా పసిఫిక్ అవార్డు కైవసం చేసుకున్నారు.

అనురాధ సేన్ గుప్తా
జన్మదినం: 23 జనవరి 1979

కలకత్తా లో జన్మించారు. అనురాధ సేన్ గుప్తా ఇండియన్ వార్తా టెలివిజన్లో అత్యంత బహుముఖ వ్యాఖ్యాత ల్లోఒకరు. CNBC TV18 లో మార్గదర్శక వ్యాఖ్యాతలలో ఒకరు. 2001లో స్టోరీబోర్డ్ అనే కార్యక్రమాన్ని నిర్వహించి మొదటి షోకే చాలా సులభంగా గుర్తింపబడ్డారు. అనురాధ స్టార్ ఫ్లస్ లో జరిగిన అమూల్ ఇండియా అనే కార్యక్రమాన్ని నిర్వహించారు. ఆమె సోఫియా పాలిటెక్నిక్ నుండి సామాజిక కమ్యూనికేషన్ మీడియా చేసారు. బాంబే విశ్వవిద్యాలయం నుండి రాజనీతి శాస్త్రంలో బి.ఎ మరియు అర్థశాస్త్రం చేశారు.

కుమారి కె. భవ్య, విద్యార్ధి, ఐ.డి.నెం: హెచ్.హెచ్.2012/022.

Download File

Rating :3.25 1   1   1   1  
మీ సూచనను పోస్ట్ చేయండి

(ఈ పేజీ లో ఉన్న కంటెంట్ పై ఏమైన వ్యాఖ్యలు / సలహాలు ఉంటే, ఇక్కడ పోస్ట్ చేయండి)

Select Rating : 0 1 2 3 4