బాలలు అభివృద్ధి

చంటి బిడ్డ సంరక్షణ - చిట్కాలు

బొడ్డు శుభ్రం చేయడం :
సాధారణంగా బొడ్డు ఊడాకే బిడ్డకు స్నానం చేస్తారు. పుట్టిన తర్వాత ఒకటి నుండి నాలుగు వారాల మధ్య బొడ్డు ఊడిపోతుంది. ఊడిపోయిన తర్వాత అక్కడ పచ్చిగా, పుండులాగా ఉన్నట్లయితే స్నానం చేయించకూడదు. పూర్తిగా మానాక చేయించడం మంచిది. అప్పటి వరకు స్పాంజ్ లేదా మెత్తని బట్టను గోరు వెచ్చని నీటితో తడిపి ఒళ్ళు తుడుస్తుండాలి. బిడ్డకు కట్టే డైపర్ లేదా నాప్ కిన్ బొడ్డుకు తగలకుండా కట్టాలి. అందువలన మూత్రం బొడ్డుకు తగలదు. పుండుకు గాలి తగిలేలా చేయాలి.

గోర్లు కత్తిరించడం:
వేలి చర్మాన్ని కిందకు మృధువుగా అదిమిపెట్టి ఒక్కొక్క వేలి గోరును నెమ్మదిగా గోళ్ళ కత్తెరతో కత్తిరించాలి.

ముక్కు శుభ్రం చేయడం:
ముక్కు శుభ్రంగా ఉంటే గాలి పీల్చుకోవడానికి, పాలు త్రాగడానికి, నిద్రపోవడానికి సౌకర్యంగా ఉంటుంది.
ఇన్ ఫాంట్ ఏస్పిరేటర్ అనే రబ్బరు బల్బు మందుల షాపులలో దొరుకుతుంది. దాని కొసని బిడ్డ ముక్కులో జాగ్రత్తగా పెట్టి వత్తుతూ గాలిని ముక్కులోకి పంపాలి. బల్బును వత్తటం ఆపిన తర్వాత ముక్కులోకి వెళ్ళిన గాలి పడిశంతో బల్బును చేరుతుంది. ముక్కు శుభ్రమవుతుంది.

మసాజ్ చేయడం:
మసాజ్ చేయడం బిడ్డ శరీరానికే కాదు, మానసికంగా తల్లీ బిడ్డల మద్య ప్రేమ బంధాన్ని పెరిగేట్లుగా కూడా దోహదపడుతుంది.
బిడ్డ మెళుకువగా ఉండి, ఆడుకుంటూ ఆనందంగా ఉన్నప్పుడే మసాజ్ చేయాలి.
పాలు తాగిన లేదా ఏదైనా తిన్న గంట తర్వాత మసాజ్ చేయాలి.
బిడ్డను మసాజ్ కోసం పడుకోబెట్టే బట్ట మెత్తగా చదునుగా ఉండాలి.
మసాజ్ చేయని భాగాలను కప్పాలి.
మసాజ్ మొదలుపెట్టే ముందు మసాజ్ చేస్తున్నప్పుడు బిడ్డతో ప్రేమగా మాట్లాడుతూ చేయాలి.
మసాజ్ కోసం వాడే నూనె సెంట్ పరమళం లేకుండా ఉండాలి.
మసాజ్ చేస్తున్నప్పుడు నూనెను మృధువుగా రాస్తూ నెమ్మదిగా శరీరం పై చేతిని కదిలిస్తూ మసాజ్ చేయాలి.
మసాజ్ చేస్తున్న సమయంలో బిడ్డ అటూ ఇటూ కదులుతుంటే కదలికను ఆపవద్దు.

తేన్పించటం:
బిడ్డ పాలు తాగినపుడు లేదా ఏదైనా తిన్నప్పుడు గాలి పొట్టలోకి వెళుతుంది. ఆ గాలిని బయటకు రప్పించటానికి బిడ్డను తప్పనిసరిగా తేన్పించాలి.
భుజం మీద వేసుకుని నెమ్మదిగా బిడ్డ వీపు మీద తట్టుతూ మృదువుగా రుద్దుతూ ఉండాలి
ఆ వత్తిడికి గాలి తేంపు రూపంలో బయటకు వచ్చి బిడ్డకు తేలికగా ఉంటుంది.

డైపర్ మార్చటం:
బిడ్డలు ఎక్కువగా మూత్రం పోస్తూ ఉంటారు. ఎప్పటికప్పుడు మారుస్తూ పొడిగా ఉండేటట్లుగా చూడాలి.
నాప్ కిన్ వాడుతుంటే మూత్రం పోసిన వెంటనే మార్చాలి, డైపర్ వాడుతుంటే ప్రతీ నాలుగైదు గంటలకు మారుస్తూ ఉండాలి. మలవిసర్జన చేస్తే మాత్రం వెంటనే మార్చేయాలి. మార్చిన ప్రతీసారీ మెత్తని తడి బట్టతో లేదా దూదితో లేదా వైప్స్ తో పొడిగా తుడవాలి. చర్మం పూర్తిగా పొడిబారకుండా మాయిశ్చరైసర్ రాస్తుండాలి.

 

డాక్టర్. పి. అమల కుమారి, ప్రొఫెసర్, విస్తరణ మరియు ప్రసార నిర్వహణ విభాగం.

Download File

Rating :2.74 1   1   1   1  
మీ సూచనను పోస్ట్ చేయండి

(ఈ పేజీ లో ఉన్న కంటెంట్ పై ఏమైన వ్యాఖ్యలు / సలహాలు ఉంటే, ఇక్కడ పోస్ట్ చేయండి)

Select Rating : 0 1 2 3 4