బాలలు అభివృద్ధి

అమ్మాయిలు - లైంగిక వేధింపులు - అప్రమత్తత

 • వివిధ పరిస్థితుల్లో, సందర్భాలలో అమ్మాయిని ఓర చూపులు చూడడం, కన్నుకొట్టడం, నీచమైన శబ్దాలు చేయడం, శృంగారపరమైన అర్ధాన్ని సూచించే జోక్స్, కామెంట్లు, వ్యాఖ్యలతో కించపరచడం, బహిరంగంగా జననాంగాన్ని చూపడం, జననాంగాల్ని రుద్దుకోవడం, అసభ్యకరమైన ఫోన్ కాల్స్ చేయడం మొదలైనవి లైంగిక వేధింపులుగా పరిగణిస్తారు. 
 • ఎవరివలనైనా లైంగిక వేధింపులతో బాధపడుతున్నారా? వేధింపులు పదే పదే  జరిగితే వెంటనే తల్లిదండ్రులకు, ఉపాధ్యాయులకు లేదా పోలీసులకు ఫిర్యాదు చేయాలి. లైంగికవేధింపుల నివారణకు పాఠశాల స్థాయిలో  లైంగిక విద్యను అమలుపరచాలి.
 • లైంగికేచ్చతో  ఒక వ్యక్తి మిమ్ములను  గిచ్చడం, తట్టడం, చెక్కిళ్ళను, పెదవులను, రొమ్ములను, మర్మావయవాలను రుద్దడం చేస్తే మీ పక్కన వున్నా పెద్దవారికి లేదా తల్లితండ్రులకు వెంటనే తెలియచేయాలి.
 • తల్లితండ్రులు, ఉపాధ్యాయులు, బాలికలలో లైంగిక వేధింపులను ఎదుర్కునేందుకు అవసరమైన నైపుణ్యాన్ని, ధైర్యాన్ని  పెంపొందించాలి. అమ్మాయి లైంగిక వేధింపులను గురించి ఫిర్యాదు చేస్తే నిర్లక్ష్యం చెయ్యి, లేదా పట్టించుకోకుండా వదిలేయి అని మాత్రం చెప్పకూడదు. అత్యవసర సేవల కోసం స్రీల హెల్ప్ లైన్ 1091 నంబరుకు డయల్ చేయండి .
 • లైంగిక వేధింపుకు గురైన బాలికతో తల్లితండ్రులు, ఉపాధ్యాయులు తీర్పునిచ్చే విధంగా కాకుండా అనుకూల స్పందనలతో, ఆసరా నిచ్చే విధంగా వ్యవహరించి, ఎవరో చేసే తప్పుడు పనులకు, ప్రవర్తనలకు వారి తప్పేంలేదని  బాలికలకు తోడుగా వుండాలి. అత్యవసర సేవల కోసం  స్రీల హెల్ప్ లైన్ 1091, పిల్లల హెల్ప్ లైన్ 1098 నంబర్లకు  డయల్ చేయండి
 • కౌమార బాలలను ఎవరైనా కొద్దిక్షణాల పాటు చేతుల్ని పట్టుకొని ఊపడం, తలమీద, వీపుమీద మృదువుగా తట్టడం, బుగ్గమీద ముద్దివ్వడం, కౌగిలించుకోవడం చేస్తే ఆ తేడాను గ్రహించి వాళ్లకి దూరంగా వుండాలి. లేదా పెద్దలకి చెప్పాలి.
 • యుక్తవయసు అమ్మాయిలతో ఎవరైనా అసౌకర్యం కలిగించే విధంగా ముట్టుకొని లేక మాట్లాడి దానిని రహస్యంగా ఉంచమని కోరితే అలా చెయ్యకుండా వెంటనే పెద్దవారితో ఆ విషయాన్ని చెప్పండి.
 • లైంగిక వేధింపులకు గురవుతున్నప్పుడు వివిధ కోణాల నుండి పరిష్కరించుకోవచ్చు అని కౌమారబాలికలకు తెలిస్తే ఏపద్దతిని ఉపయోగించి అయినా సమర్దవంతంగా ఆ వేదింపులను ఎదుర్కోగలమనే ఆత్మవిశ్వాసం వారిలో పెరుగుతుంది.
 • యుక్త వయస్సు  అమ్మాయిలారా! అపరిచితులు మీకు  స్వీట్స్ లేక డబ్బును ఇచ్చి మోసగించడానికి ప్రయత్నిస్తే వారు అడిగిన దానికి నిరాకరించి, వాళ్ళిచ్చేది తీసుకోకుండా తల్లితండ్రులకు ఫిర్యాదు చేయాలి.
 • మిమ్మల్ని ఇష్టపడ్డ వ్యక్తుల నుండి కౌగిలింతలు, ముద్దులు లభిస్తే ఆ విషయాన్ని రహస్యంగా ఉంచకండి. మీకు నమ్మకం వున్నపెద్ద వారితో ఆ విషయం చెప్పాలని గుర్తుంచుకోండి.
 • యుక్త వయస్కులైన అమ్మాయిలను ఎవరైనా మగవారు  అసౌకర్యం కలిగించే విధంగా ముట్టుకొని, మాట్లాడి, దానిని రహస్యంగా ఉంచమని కోరితే అలా చెయ్యకుండా పెద్దవారితో ఆ విషయాన్ని చెప్పండి.
 • తమకు బాగా తెలిసిన పెద్దవాళ్ళు విచిత్రంగా ప్రవర్తిస్తున్నారని తల్లితండ్రులకు పిల్లలు ఫిర్యాదు చేస్తే వారు నమ్మరు. కాని తల్లితండ్రులు తమ పిల్లలు చెప్పింది నమ్మి ఆ పెద్దవాళ్ళకు దూరంగా, సురక్షితంగా ఉంచేందుకు తగిన చర్యలు తీసుకోవాలి.
 • అమ్మాయిలు ఒంటరిగా కాకుండా ఒక గుంపుగా కలిసి వెళ్ళడం ద్వారా చాలా వరకు లైంగిక వేధింపులకు దూరంగా ఉండవచ్చు. అదేవిధంగా లైంగిక వేధింపులను ఎదుర్కునేందుకు అవసరమైన నైపుణ్యాలతో పాటు ఆత్మస్థైర్యాన్ని పెంపొందించుకోవాలి.

 

 

డాక్టర్ ఎం. ఎస్. చైతన్య కుమారి, అసోసియేట్ ప్రొఫెసర్, విస్తరణ మరియు ప్రసార నిర్వహణ విభాగం.
వి. సింధూరాణి, విస్తరణ అధికారి, ఐ.సి.డి.ఎస్. ప్రాజెక్ట్, తాండుర్,ఆదిలాబాద్ జిల్లా, తెలంగాణ రాష్ట్రం.
కుమారి ఎం. సుజాత, విద్యార్ధి, ఐ.డి.నెం: హెచ్.హెచ్. 2010/89. 

Download File

Rating :2.81 1   1   1   1  
మీ సూచనను పోస్ట్ చేయండి

(ఈ పేజీ లో ఉన్న కంటెంట్ పై ఏమైన వ్యాఖ్యలు / సలహాలు ఉంటే, ఇక్కడ పోస్ట్ చేయండి)

Select Rating : 0 1 2 3 4