బాలలు అభివృద్ధి

పిల్లలు – పెరుగుదలలో మార్పులు

పుట్టిన నాటి నుంచి 6 నెలలు వచ్చే సరికి

పుట్టినప్పుడు ఉన్న బరువుకి రెట్టింపు అవుతారు.
కూర్చోపెట్టినప్పుడు తమ తల నిలుపగలుగుతారు.
సహాయంతో కూర్చోగలుగుతారు.
తమపై అందరూ శ్రద్ధ వహించాలని నవ్వుతారు.

6-8 నెలలు

వారంతట వారే కూర్చోగలుగుతారు.
కుతూహలాన్ని చూపించటం ఆరంభిస్తారు
అవతలి వారి పనుల్ని అనుకరిస్తారు.
బొమ్మల ను  నోటి దగ్గరకు తెస్తుంటారు.
ఎవేవొ శబ్ధాలు చేస్తూ మాట్లాడటం ఆరంభిస్తారు.
దంతాలు  కనిపిస్తాయి.

9-12 నెలలు

పాకటం ఆరంభిస్తారు.
వస్తువుల్ని చూపించటానికి వేలు ఉపయోగిస్తారు.
దోబూచులాటలాడుకుంటారు.
అమ్మ, తాత వంటి రెండు అక్షరాల పదాల్ని మాట్లాడగలుగుతారు.
ఏదైనా పట్టుకుని  నిలబడగలుగుతారు.
వేళ్ళతో వస్తువుల్ని తీయటం ప్రారంబిస్తారు.
పేరుతో  పిలిస్తే పలుకుతారు.
సొంతంగా తినటం మొదలుపడతారు.

13-15 నెలలు

సొంతగా నిలబడతారు
సహాయం లేకుండా నడవగలుగుతారు.
కొత్తవారి దగ్గర సిగ్గుపడతారు.
గిన్నెలు, చెంచాలు ఉపయోగించటం ఆరంభిస్తారు.
వివిధ ఆకృతుల్లో ఉండే పదార్థాల్ని కొరకగలుగుతారు.

18 నెలల నుండి

పరుగెడతారు.
చాలా  పదాలను  అనగలుగుతారు.
సులభమైన సూచనలను  పాటిస్తారు.
మృధువుగా,  మెత్తగా, కరకర ఉండే ఆహారాన్ని కొరకటానికి ప్రయత్నం చేస్తారు.

24నెలలు

పడిపోకుండా పరిగెడతారు.
సైకిల్ తొక్కగలరు.
దూకగలరు.
2-4 పదాలు కలిగిన  వాక్యాల్ని అనగలరు.
ఆహారం కిందపడేస్తున్నప్పటికి  స్వయంగా తినగలరు.


 

డాక్టర్. పి. అమల కుమారి, ప్రొఫెసర్, విస్తరణ మరియు ప్రసార నిర్వహణ విభాగం. 

Download File

Rating :3.19 1   1   1   1  
మీ సూచనను పోస్ట్ చేయండి

(ఈ పేజీ లో ఉన్న కంటెంట్ పై ఏమైన వ్యాఖ్యలు / సలహాలు ఉంటే, ఇక్కడ పోస్ట్ చేయండి)

Select Rating : 0 1 2 3 4