బాలలు అభివృద్ధి

బాల్య వివాహ నిషేద చట్టం

2007 జనవరి 10వ తేదీన ఆమోదం పొంది, 2007 నవంబర్ 1వ తేదీ నుంచి అమలులోకి వచ్చిన బాల్య వివాహ నిషేద చట్టం, 2006 (పి ఎస్ ఎం ఎ,2006)
భారతదేశంలో మతంతో సంబంధం లేకుండా పౌరులందరికీ ఈ చట్టం వర్తిస్తుంది. జమ్ము కాశ్మీర్ రాష్ట్రానికి, కేంద్ర పాలిత ప్రాంతమైన పాండిచ్చేరి వాసులకు ఈ చట్టం వర్తించదు.
చట్టం మూల సిద్ధాంతం బాలికలకు వివాహం చేయడం నేరం. బాలలు లేదా మైనర్ అంటే ఆడ పిల్లలైతే 18 ఏళ్ళ వయస్సులోపువారు, మగ పిల్లలైతే 21 ఏళ్ళ వయస్సులోపువారు.

 మూడు ప్రధాన అంశాలు: నిరోధం - రక్షణ -నేరస్థుల విచారణ

ఎ. నిరోధం
బాల్య వివాహాలుజరిపించే వారికి నిర్దిష్టమైన శిక్షలు విధించేలా చర్యలు తీసుకోవడం, వివాహాలనిరోధం మరియు నిషేధానికి బాధ్యత వహించేందుకు కొంతమంది అధికారులను నియమించడం ఈ చట్టం ముఖ్యోద్దేశం.

బాల్య వివాహాలకు అనుమతి ఇచ్చేవారు, ప్రోత్సహించేవారు బాల్య వివాహ నిషేద చట్టంలోని 11వ విభాగం కింద శిక్షార్హులు. కాబట్టి బాల్య వివాహం ఎక్కడైనా జరుగుతున్నా, జరగబోతున్నా, జరిగినా ఆ సమాచారాన్ని వెంటనే సంబంధిత అధికారులకు తెలియజేయడం ప్రతి ఒక్క పౌరుని బాధ్యత. అలా తెలియజేయకపోతే బాల్య వివాహాన్ని ప్రోత్సహించినట్టే అవుతుంది. ఈ నేరం కింద ప్రస్తుత చట్టం కిందే కాక భారత శిక్షాస్మృతి కింద కూడా శిక్షార్హులు అవుతారు.

 

బి. రక్షణ

వివాహ రద్దుకు పిల్లలకు అవకాశం ఇవ్వడం ద్వారా బాల్య వివాహాన్ని రద్దు చేసే ప్రతిపాదనకు, బాల్య వివాహాల కారణంగా పుట్టిన పిల్లలందరికీ చట్టపరమైన హోదా కల్పిస్తూ, వారి ఆలనా పాలనా చూసే బాధ్యతను అధికారులు చేపట్టే విధంగా చట్టం ఆస్కారం కల్పిస్తోంది. ఆడ పిల్ల తరపువారికి ఈ చట్టం కింద ఇల్లు, నిర్వహణ సదుపాయాలు కల్పిస్తున్నారు. అలా రక్షించిన బాలలకు వైద్య సహాయం, చట్టపరమైన సహాయం, తగిన సూచనలు, సలహాలు ఇవ్వడంతో పాటు పునరావాస సదుపాయం కూడా ఈ చట్టం కింద కల్పిస్తారు.

సి. నేరస్తుల విచారణ

18 ఏళ్ళ వయస్సు పై బడిన వ్యక్తి బాలికను వివాహం చేసుకున్నట్లయితే అటువంటి వ్యక్తి శిక్షార్హుడని చట్టం చెబుతుంది. బాల్య వివాహాలను జరిపించడం, నిర్వహించడం, ప్రోత్సహించడం వంటి పనులు చేసే వారు కూడా ఈ చట్టం కింద శిక్షార్హులే. బాల్య వివాహం నిర్వహించడం, ప్రోత్సహించడం వంటి పనులు చేస్తున్న వారిలో తల్లిదండ్రులు, సంరక్షకులు, ఇతర ఎవరైనా వ్యక్తులు, సంస్థలు ఎవరైనా సరే ఈ చట్టంలో శిక్షలను నిర్దేశించారు. పైన పేర్కొన్న ఎటువంటి నేరాలకు పాల్పడినా మహిళలైతే మాత్రం వారికి జైలు శిక్ష విధించరాదని, జరిమానా రూపంలో శిక్ష విధించాలని ఈ చట్టంలో స్పష్టంగా పేర్కొన్నారు.

 బాల్య వివాహాం గురించి తెలపడం

బాల్య వివాహం ఎక్కడైనా జరగబోతున్నా, జరిగినా అటువంటి సంఘటనలను ఎవరైనా సరే సంబంధిత అధికారులకు, తక్షణ సమాచారాన్ని పోలీసులకు,  బాల్య వివాహ నిషేద అధికారి లేదా సహాయకులకు, ఫస్ట్ క్లాస్ జ్యుడిషియల్ మేజిస్ట్రేట్ లేదా మెట్రోపాలిటన్ మేజిస్ట్రేట్ కు, బాలల సంక్షేమ సంఘం లేదా 2006 లో సవరించిన విధంగా బాలల న్యాయం (బాలల పరిరక్షణ) చట్టం 2000 కింద నియమించిన బాలల సంక్షేమ సంఘం సభ్యునికి, ఛైల్డ్ లైన్ కు తెలియజేయాలి

బాల్య వివాహం గురించి విశ్వసనీయ సమాచారం అందినట్లైతే ఫస్ట్ క్లాస్ జ్యుడిషియల్ మేజిస్ట్రేట్ కు స్వయంగా విచారణ చేపట్టే అధికారం ఉంది. బాల్య వివాహాలను నిషేధించడంతోపాటు వాటి గురించి సమాచారం ఇచ్చే బాధ్యత కూడా బాల్య వివాహ నిషేదం అధికారికి ఉంది.  ఒకవేళ ఉమ్మడి వివాహాలు కనుక జరుగుతున్నట్టు సమాచారం అందినట్లయితే బాల్య వివాహ నిషేధం అధికారికి ఉన్న అధికారాలన్నీ కూడా జిల్లా మేజిస్ట్రేట్ కు ఉంటాయి కాబట్టి అటువంటి వివాహాలు జరగకుండా ఆపివేసే అధికారాలు కూడా మేజిస్ట్రేట్ కు ఉంటాయి.

ఫిర్యాదు చేయడం

ఫిర్యాదు ఎవరు చేయాలి?

తల్లిదండ్రులు లేదా సంరక్షకులు, ఉపాధ్యాయులు, వైద్యులు, ఎ ఎన్ ఎం లు, అంగన్ వాడీ కార్యకర్తలు, గ్రామస్థాయి కార్యకర్తలు, ఎస్ హెచ్ జి సభ్యులు, గ్రామపెద్దలు, ఇరుగు పొరుగు వారు తదితరులు, సరైన సమాచారం ఉన్న ప్రభుత్వేతర సంస్థ.

సామాజిక న్యాయం ప్రయోజనానికే విఘాతం కలిగించే విధంగా ప్రతీకార చర్యలు చోటుచేసుకోకుండా చూడడానికి ఫిర్యాదుదారులకు తగిన రక్షణ కల్పించడం కూడా ముఖ్యం.

8. ఫిర్యాదు ఎక్కడ చేయాలి?

దగ్గరలోని పోలీసు స్టేషన్ లో ఫిర్యాదు చేయాలి. పోలీసులు ప్రతి పోలీసు స్టేషన్లో ఉండే డైలీ డైరీ రిజిస్టర్ లో కేసును నమోదు చేయాలి. ఆ ఫిర్యాదు ఆధారంగా ఎఫ్ ఐ ఆర్ (ఫస్ట్ ఇన్ ఫర్మేషన్ రిపోర్ట్) నమోదు చేయాలి.

ఫస్ట్ క్లాస్ జ్యుడీషియల్ మేజిస్ట్రేట్ లేదా మెట్రొపాలిటన్ మేజిస్ట్రేట్ వద్ద కూడా కేసును నమోదు చేయవచ్చు.

మౌఖికంగా కాని, రాతపూర్వకంగా కాని, టెలిఫోన్ ద్వారా కాని, ఉత్తరం లేదా టెలిగ్రాం ద్వారా కాని, ఈ-మెయిల్ లేదా ఫాక్స్ ద్వారా కాని ఫిర్యాదు చేయవచ్చు

బాల్య వివాహం – నేరం - శిక్ష

  • బాల్య వివాహాన్ని ప్రోత్సహించే వారు, చేసే వారు కఠిన కారాగార శిక్షకు అర్హులు. ఈ నేరానికి రెండేళ్ళ వరకు జైలు శిక్ష కాని లేదా లక్ష రూపాయల వరకు జరిమానా కాని లేదా రెండూ కాని విధించవచ్చు.
  • బాల్య వివాహాలను నిషేదిస్తూ న్యాయస్థానాలు ఉత్తర్వులు జారీ చేయవచ్చు( పి సి ఎం ఎ 2006 విభాగం 13)
  • ఈ చట్టం కింద నేరస్థులకు శిక్షతో కూడిన మరియు బెయిలుకు వీలు లేని శిక్ష విధిస్తారు ( పి సి ఎం ఎ 2006 విభాగం 15)

ఈ చట్టం కింద శిక్షార్హులైన వ్యక్తులు:

  • ఇరుపక్షాల తల్లిదండ్రులు/సంరక్షకులు
  • పురోహితులు
  • ఇరుపక్షాల ఇరుగు పొరుగు వారు
  • అటువంటి వివాహలు కుదర్చడానికి బాధ్యత వహించే పెళ్ళి సంఘాలు/వ్యక్తులు
  • అక్రమంగా తరలించేవారు
  • 18 ఏళ్ళ కంటే ఎక్కువ వయసు ఉన్న పెళ్ళికొడుకు

 


డాక్టర్. పి. అమల కుమారి, ప్రొఫెసర్, విస్తరణ మరియు ప్రసార నిర్వహణ విభాగం. 

Download File

Rating :2.77 1   1   1   1  
U krishnaveni    2018-02-11 20:48:28
Good information
...............................................
Prasad    2018-03-03 17:42:57
సర్ మీరు వివరాలు అన్ని తెలిపారు. కానీ .సమాచారం అందించిన వారికి ఎటువంటి అవాంతరాలు లేకుండా రక్షణ కల్పించాలని కోరుతూ మరియు విషయాలు తెలుపుటకు ఫోన్ నెంబర్ కు ఇక్కడ రాయండి
...............................................
రవినాయక్    2018-03-20 07:09:03
బాల్య వివాహాలు జరిపించే పూజారులు లేదా బ్రాహ్మణులు లేదా మత పెద్దలు లేదా నిర్వాహకులకు ఈ చట్టంలో ఎందుకు శిక్షలు నిర్ణయించలేదు
...............................................
M.naveen kumar    2018-12-22 18:59:59
Balya vivahalu chtam manchidana
...............................................
మీ సూచనను పోస్ట్ చేయండి

(ఈ పేజీ లో ఉన్న కంటెంట్ పై ఏమైన వ్యాఖ్యలు / సలహాలు ఉంటే, ఇక్కడ పోస్ట్ చేయండి)

Select Rating : 0 1 2 3 4