ఆరోగ్యం

జెస్టేషనల్ డయాబెటిస్

జెస్టేషనల్ డయాబెటిస్ నేడు ప్రధాన సమస్య. దాదాపు 7% గర్భవతులు దీనివలన బాధపడుతున్నారని అంచనా. హార్మోన్లలో సంభవించే తేడాల వల్ల గర్భధారణ సమయంలో కొంతమందిలో సుమారు 4వ నెల నుండి ప్రారంభమై ప్రసవం వరకు ఉంటుంది.  ప్రసవానంతరం తగ్గిపోతుంది.

ఎవరిలో రావచ్చు?

 • స్థూలకాయులలో
 • అంతకు ముందు అధిక బరువు కలిగిన పిల్లలను ప్రసవించినవారిలో
 • గత గర్భధారణలో ఈ సమస్య ఉన్నవారిలో
 • గతంలో అంటే గర్భ ధారణకు ముందు లేదా సమయంలో మూత్రంలో చక్కెర గలవారిలో
 • కుటుంబంలో మధుమేహులున్నట్లయితే  

 అయితే ఇలా గర్భధారణ సమయంలోమధుమేహం వచ్చిన వారిలో సగానికి సగం మందిలో తరువాత వయసులో టైప్-2 మధుమేహం వచ్చే అవకాశం ఉంటుంది . కనుక వారు ఆహార, వ్యాయామాల విషయంలో తగు జాగ్రత్తలు పాటిస్తుండాలి. ఆందోళన చెందకుండా ఆహారంలో తగిన మార్పులు చేసుకుని రక్తంలో చక్కెర సాధారణ స్థాయికి నియంత్రంచుకోవడం వీరు పాటించవలసిన ముఖ్యమైన జాగ్రత్త. వైద్యుల సలహా మేరకు తగు మోతాదు ఇన్సులిన్ ఇంజక్షన్ చేయించుకోవాలి. అలా చేయడం వలన గర్భధారణ, ప్రసవ సమయంలో ఎలాంటి సమస్యలు తలెత్తవు.

 • బోజనాన్ని 6-7 తడవులగా తీసుకోండి.
 • పిండి పధార్థం అధికంగా గల ఆహార పధార్ధాలను తగ్గించి(బియ్యం వంటివి) పీచు, పిండి పదార్థం కలిగిన ఆహార పదార్ధాలు (జొన్న, రాగి, వరిగ  మొదలైన చిరుధాన్యాలు) తీసుకోండి. అందువలన జీర్ణక్రియకు సమయం ఎక్కువ పడుతుంది.త్వరగా ఆకలి కాదు. అలా అని పోషక పదార్థాలు అందవేమో అని అనుమానం అక్కర్లేదు. ఎందుకంటే చిరుధాన్యాలు సమపోషకాలు.
 • గ్లైసిమిక్ ఇండెక్స్ (GI) తక్కువగాగల ఆహారపదార్థాలను ఎన్నుకోండి.
  మనం తీసుకున్న ఆహారం శరీరంలో గ్లూకోస్ రూపంలోకి మార్చబడుతుంది. ఆహారం గ్లూకోస్ గా మారుతుందో దానిని గ్లైసిమిక్ ఇండెక్స్ అంటారు. కొన్ని ఆహారపదార్థాలు త్వరగా మారుతాయి,  వాటిని అధిక  గ్లైసిమిక్ ఆహారపదార్థాలని, ఆలస్యంగా మారే వాటిని అల్ప గ్లైసిమిక్ ఆహారపదార్థాలని అంటారు.
  మధుమేహులు అల్ప గ్లైసిమిక్ ఆహారపదార్థాలు తీసుకోవడం మంచిది. అవి నెమ్మదిగా జీర్ణమై రక్తంలో గ్లూకోస్ శాతాన్ని సమతుల్యం చేస్తాయి .అధిక గ్లైసిమిక్ ఇండెక్స్ పదార్థాలైతే త్వరగా జీర్ణమై రక్తంలో గ్లూకోస్ పరిమాణం ఒక్కసారిగా పెరిగి అసమతుల్యతకు దారి తీస్తుంది.

ఆహార పదార్థాలు - గ్లై సిమిక్ ఇండెక్స్

ధాన్యాలు

మొక్కజొన్నఅటుకులు                                   83

గోధుమ                                                          68

బియ్యం                                                          89

బాసుమతి బియ్యం                                         58

బార్లీ                                                               25

చిరుధాన్యాలు                                                71

పండ్లు

ఆపిల్                                                            38

అరటి పండు                                                   56

ద్రాక్ష                                                              46

కివి                                                                52

మామిడి పండు                                               55

ఆరెంజ్                                                           43

బొప్పాయి                                                      58

పైన్ ఆపిల్                                                     66

ఖర్జూరం                                                        103

ఎండు ద్రాక్ష                                                    64

పుచ్చ కాయ                                                  72

పప్పులు

కందిపప్పు                                                    21

శెనగపప్పు                                                    11

బఠానీ                                                            25

అలసందలు                                                   37

పాలు - పాల పదార్థాలు

మీగడ పాలు                                                  30

పెరుగు                                                          14

కస్టర్డ్                                                             43

సోయాపాలు                                                  31

ఐస్ క్రీమ్                                                       38

 

 • రోజు మొత్తంలో ఒక లీటరు పాలను 4-5 దఫాలుగా తీసుకోండి.
 • పండ్లు ఆరోగ్యానికి చాలా మంచివే. కాని సహజ సిద్ధంగా వాటిలో చక్కెర ఉంటుంది. కనుక రెండు మూడు రకాల పండ్లు తడవకు కొద్ది కొద్దిగా తీసుకోండి. లేదంటే రెండు మూడు రకాలు కలిపి తీసుకున్నా పర్వాలేదు. పండ్ల రసాలను మాత్రం తాగవద్దు.
 • ఉదయం అల్పాహారంలో తప్పకుండా మాంసకృత్తులు, పిండి పదార్థాలు సమ్మిళితమైన ఇడ్లీ, దోశ, పొంగలి వంటివి తీసుకోవడం చాలా మంచిది.
 • తీపి తినుబండారాలను, చిరు తిండ్లను పూర్తిగా మానెయ్యాలి. అలాగే తేనె, బెల్లం, పటిక బెల్లం మొదలైన వాటిని కూడా మానేయాలి.
 • బయట టిన్నులలో  దొరికే ఆహార పదార్థాలను మానేయడం శ్రేయస్కరం.
 • నడక, వైద్యుల సూచనల మేరకు చిన్నపాటి వ్యాయామం చేయడం మంచిది.

మధుమేహులైన గర్భవతులకు నమూనా ఆహార పట్టిక(శాకాహారులకు)

సమయం

భోజన వివరాలు

ప్రోద్దున 6-7 గంటల మధ్య

 

పావులీటరు పాలు(చక్కెర లేకుండా) గుప్పెడు(20గ్రా.)వేయించిన వేరుశెనగ/శెనగ/సోయా పప్పులు

ఉదయం 8-9 గంటల మధ్య

 

ఉడికించిన గుడ్డు

కప్పు పాలు(150మి.లీ)

లేదా

రెండు చపాతీలు, కూరగాయల కూర, కప్పు పెరుగు

లేదా సాంబారుతో నాలుగు ఇడ్లీలు/రెండు దోశెలు(తక్కువ నూనె వాడాలి)

 

ఉదయం 11 గంటలకు

 

మధ్యస్థ పరిమాణం  ఉన్న ఆపిల్/జామ/బత్తాయి పండు ఒకటి.

 

మధ్యాహ్న భోజనం 1-1.30

 

3 చపాతీలు లేదా 2 చపాతీలు, ఒక కటోరి అన్నం లెదా 3 కటోరిల అన్నం

పచ్చి కూరగాయ ముక్కలు ఒక కప్పు

ఒక కప్పు ఆకుకూర పప్పు

ఒక కప్పు కూరగాయల కూర

ఒక కప్పు పెరుగు

(రెండు టీస్పూన్ల కంటే ఎక్కువ నూనె వాడవద్దు)

 

సాయంత్రం 4 గంటలకు

 

ఒక కప్పు పాలు లేదా ఒక గ్లాసు మజ్జిగ

 

రాత్రి భోజనం 8-8.30 గంటల మధ్య

 

మధ్యాహ్న భోజనం లాగానే తీసుకోవాలి

కాని భోజనంలో వైవిద్యం కోసం కూరలు మార్చుకోవచ్చు

పప్పు బద్దలకు బదులు పూర్తి పెసలు, శెనగలు, మినుములు, రాజమా, బఠానీ; రెండు మూడు కూరగాయలు కలిపిన కూరలు తీసుకోవచ్చు. మొలకెత్తిన విత్తనాలను సలాడుగా తినవచ్చు.

 

రాత్రి నిద్రకు ముందు

 

పావు లీటరు పాలు

లేదా ఒక కప్పు పాలతో పాటు చిన్నపాటి పండు.

 

 

మాంసాహారులు ఈ పై నమూనా ప్రకారమే కూరగాయలతో పాటు చర్మం తీసేసిన చేపలు, కోడి మాంసం తీసుకోవచ్చు.

డాక్టర్.కె. ఉమా దేవి, ప్రొఫెసర్, ఆహారం & పోషణ విభాగం

Download File

Rating :2.66 1   1   1   1  
మీ సూచనను పోస్ట్ చేయండి

(ఈ పేజీ లో ఉన్న కంటెంట్ పై ఏమైన వ్యాఖ్యలు / సలహాలు ఉంటే, ఇక్కడ పోస్ట్ చేయండి)

Select Rating : 0 1 2 3 4