పరిశుభ్రత

ఆహార పదార్దాలు- ప్యాకేజింగ్

 

ప్యాకేజింగ్ అంటే సురక్షితoగా ఉత్పత్తులను రవాణా చేయటానికి, నిల్వ చేయటానికి, అమ్మకానికి, వినియోగానికి సంబంధించిన శాస్త్రము, కళ, సాంకేతికత నైపుణ్యం.

 1. ప్యాకేజింగ్ వస్తువును భౌతికంగా సంరక్షిస్తుంది. ఉష్ణోగ్రత, కంపనాలు, అదురుపాటు, సంపీడనం మొదలైన అంశాల పట్ల సమతుల్యాన్ని అందిస్తుంది.
 2. దుమ్ము, ధూళి అంటదు.
 3. వాతావరణం లోని తేమను నిలవరించటం వలన లోపలి పదార్దాలు పొడిగా ఉంటాయి. తాజాగా, శుభ్రంగా, భద్రంగా, సూక్ష్మ జీవరహితంగా ఉంటాయి.
 4. సరకుల రవాణా సౌకర్యవంతంగా ఉంటుంది. ముఖ్యంగా ద్రవ పదార్దాలు, పొడులను సురక్షితoగా రవాణా చేయవచ్చు.
 5. ప్యాకింగ్ ద్వారా పదార్దాలకు సంబందించిన సమాచారాన్ని వినియోగాదారులుకు అందించవచ్చు.
 6. భద్రత ప్రమాణాలను పాటిస్తూ వస్తువులను కల్తీ నుండి నివారించవచ్చు.
 7. వ్యక్తిగత అవసరానికి, గృహ అవసరాలకు లేదా కార్యాలయ అవసరాలకు తగిన మోతాదులలో లేదా పరిమాణాలలో ప్యాకేజింగ్ చేయవచ్చు. అందువలన వినియోగదారునికి సౌలభ్యంగా ఉంటుంది.

ప్యాకింగ్ రకాలు

 • ప్రాధమిక ప్యాకేజింగ్ పదార్ధాన్ని లేదా ఉత్పత్తిని పూర్తిగా కప్పి వేసి భద్రపరుస్తాయి. ఇందులో సాధారణంగా సరుకు నేరుగా ప్యాకేజిని అంటిపెట్టుకొని ఉంటుంది. ఉదా:-బ్రెడ్
 • ద్వితీయ ప్యాకింగ్ అనేక ప్రాధమిక ప్యాకేజీలను ఒక సమూహంగా, గుంపుగా చేర్చి పట్టుకునేది. ఇది బాహ్యంగా వుంటుంది, ఉదా:- నూడిల్సు, మసాల .
 • తృతీయ ప్యాకేజింగ్ అనేది ఎక్కువ పరిమాణం పదార్థాలను తరలించటానికి, గిడ్డంగులలో నిలువకు నౌకా రవాణాకు వాడేది.

కుటీర ఆహార పరిశ్రమలకు ఫుడ్ కంట్రోల్ బోర్డు ప్రమాణాలు

 1. ఆహార పరిశ్రమ, హోటళ్ళు మొదలు పెట్టాలంటే ఫుడ్ కంట్రోల్ బోర్డు దగ్గర నమోదు చేసుకుని అనుమతి పత్రం పొందాలి. దీని ద్వారా రిజిస్ట్రేషన్ లభిస్తుంది. అందువలన గుణాత్మకమైన వ్యాపారం చేయటానికి మార్గదర్శకం లభిస్తుంది.
 2. ప్యాకింగ్ మరియు లేబులింగ్ నియమాలను పాటించాలి. ఆహార పదార్ధాలకు గాలి, దుమ్ము, ధూళి దూరకుండా ప్యాకింగ్ చేయాలి. ప్యాకింగ్ కి ఉపయోగించే మెటీరియల్ హాని చేయనిదై ఉండాలి. లేబుల్ పై కంపెనీ పేరు ఆహార పదార్ధాల యొక్క వివరాలు, ఉత్పత్తి చేయబడిన తేది ఉండాలి.
 3. అధికార పూర్వకంగా నిషేధించిన కట్టుబాట్లను పాటించాలి. కాలుష్యరహితంగా, ఆహార విషపూరితం కాని పదార్ధాలను తయారు చెయ్యాలి.
 4. ఆహార పదార్ధం యొక్క విలువలు, పోషకాలు క్షుణ్ణంగా పరిశీలించిన తర్వాత ఆ పదార్ధాన్ని మార్కెట్లోకి విడుదల చేయాలి. ఆహార పదార్థాలలో వాడే రసాయనాలు మంచివై ఉండాలి.
 5. వ్యాపార ఆవరణ, దానికి సంబంధించిన వివరాలు, అమలు చేసే పద్ధతులు, క్షుణ్ణంగా అధికారి ద్వారా తెలియచేయాలి.
 6. వ్యాపారాన్ని ప్రారంభించే 28రోజుల ముందుగానే నమోదు చేసుకోవాలి. నమోదు చేసిన అధికారి ద్వారా పై అధికారికి రోజువారీగా సమాచారాన్ని, వ్యాపార మార్పులను అధికారికంగా తెలియచేయాలి.

కుమారి కె. అరుణశ్రీ, విస్తరణాధికారి.

కుమారి ఎ. నిఖిత, విద్యార్ధి, ఐ.డి.నెం: హెచ్.హెచ్.2010/046.

Download File

Rating :2.8 1   1   1   1  
j.mamatha hh/2011-034    2014-08-30 12:25:21
పరిశుభ్రమైన నీటిని వాడండి.నీటి సంబంధిత వ్యాధులకు దూరంగా ఉండండి.నీటిని వృధా చేయకూడదు.
...............................................
M.Sasikala    2014-08-30 12:38:55
నీటి కాలుష్యం వల్ల ఎన్నో రోగాల బారిన పడుతారు.మన చుట్టూ పక్కన పరిసరాలు శుబ్రంగా ఉంచుకోవడం వలన నీరు కలుషితం కాకుండా ఉంటుంది.
...............................................
padmaja    2016-02-08 11:42:33
Could you also give information on how packaging must be done for hot foods (everyday, hundreds of people buy cooked curries, pickles, rice etc., which are packed in plastic covers which are hazardous to health) and what is the ideal material that should be used.
...............................................
మీ సూచనను పోస్ట్ చేయండి

(ఈ పేజీ లో ఉన్న కంటెంట్ పై ఏమైన వ్యాఖ్యలు / సలహాలు ఉంటే, ఇక్కడ పోస్ట్ చేయండి)

Select Rating : 0 1 2 3 4